Engagement Viral Video: ఓసినీ పాసుగలా.. ఇదా మీ రింగులో యవ్వారం

Engagement Ceremony Viral Video: ఎంగేజ్మెంట్ సెరెమనీలో కీలక ఘట్టం రానే వచ్చింది. వధూవరులు రింగ్స్ మార్చుకునే సమయం ఆసన్నమైంది. సాధారణంగా అయితే వధూవరుల కుటుంబసభ్యులు వారికి ఉంగరాలు ఇచ్చి వారు ఉంగరాలు మార్చుకోవాల్సిందిగా చెబుతారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందో తొలుత ఎవ్వరికీ అర్థం కాలేదు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 22, 2023, 12:47 PM IST
Engagement Viral Video: ఓసినీ పాసుగలా.. ఇదా మీ రింగులో యవ్వారం

Engagement Ceremony Viral Video: పెళ్లిళ్లు పేరంటాలు రొటీన్‌గా చేసుకుంటే అందులో మన ప్రత్యేకత ఏముంటుంది అని అనుకుంటున్నారో.. లేక మనిషన్నాకా కూసింత కళాపోషణ ఉండాలని అనుకున్నారో ఏమో తెలియదు కానీ కొంతమంది మాత్రం తమ ఎంగేజ్మెంట్, పెళ్లి వేడుకలను వెరైటీగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇదిగో ఇక్కడ మీరు చూడబోయే వీడియో కూడా అలాంటిదే. అక్కడ ఎంగేజ్మెంట్ సెరెమని జరుగుతోంది. వేదికకు ముందు భాగంలో రెండు వైపులా అతిథులు, బంధుమిత్రులు కూర్చుని ఉన్నారు.

ఎంగేజ్మెంట్ సెరెమనీలో కీలక ఘట్టం రానే వచ్చింది. వధూవరులు రింగ్స్ మార్చుకునే సమయం ఆసన్నమైంది. సాధారణంగా అయితే వధూవరుల కుటుంబసభ్యులు వారికి ఉంగరాలు ఇచ్చి వారు ఉంగరాలు మార్చుకోవాల్సిందిగా చెబుతారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందో తొలుత ఎవ్వరికీ అర్థం కాలేదు. వేదికకు ముందున్న ఖాళీ స్థలంలోంచి ఒక టీ పాయ్ సైజ్ టేబుల్.. దానిపై పెద్ద రింగ్ వేదిక వైపు రావడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Viral Bhayani (@viralbhayani)

రింగ్స్ మార్చుకునే సమయంలో ఇంత పెద్ద రింగుని సీన్‌లోకి ప్రవేశపెట్టారు.. ఇంతకీ ఇంత పెద్ద రింగుతో కొత్త జంట ఏం చేస్తారా అని అందరూ ఉత్కంఠగా ఎదురుచూడసాగారు. అంతలోనే ఆ రింగ్ వేదిక వద్దకు చేరుకోవడం.. ఆ రింగు పై భాగంలోంచి రెండు రింగ్స్ తీసుకుని వాళ్లు చేతికి ఉంగరాలు మార్చుకోవడం చూశాకా అందరికీ సస్పెన్స్ వీడింది. " ఓసినీ పాసుగలా.. ఇదా మీ రింగులో యవ్వారం " అన్నట్టుగా చూశారు అక్కడున్న వాళ్లంతా. మొత్తానికి ఈ వెరైటీ అటెంప్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో కాబోయే కొత్త జంట ఆనందానికి కూడా అవధుల్లేవు.

ఇది కూడా చదవండి : How to Get Good Luck: ఇలాంటి పనులు చేస్తే దురదృష్టం పోయి అదృష్టం వెంట పడుతుందట

ఇది కూడా చదవండి : Tata Punch, Baleno: మార్కెట్లోకి కొత్త కారు ఎంట్రీ.. ఇప్పుడు టాటా పంచ్, బలెనో పరిస్థితి ఏంటి ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News