డెహ్రాడూన్: పంట పొలాల్లో కొండచిలువలు ( Pythons ) ప్రత్యక్షమైతే ఇంకేమైనా ఉందా ? అది కూడా రెండు భారీ కొండ చిలువలు పంట పొలాల్లో కనపడటం చూసిన రైతులు ( Farmers ) తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న అటవీ శాఖ రెస్క్యూ టీం ( Forest resque team ).. అతి కష్టం మీద ఆ కొండ చిలువలను పట్టుకుని వెళ్లి సురక్షితంగా అడవిలో విడిచిపెట్టారు. ఉత్తరాఖండ్‌లోని హల్ద్వనికి సమీపంలోని గౌలాపర్ ప్రాంతంలో సోమవారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ ట్విటర్ ద్వారా షేర్ చేసుకున్న ఈ వైరల్ వీడియోపై ( Viral video ) మీరూ ఓ లుక్కేయండి. Also read : Unlock 4.0: మెట్రో రైలు, థియేటర్లు, విద్యా సంస్థలకు నో చెబుతున్న జనం
#WATCH Uttarakhand: Two pythons rescued from Gaulapar area in Haldwani yesterday by Forest Department's Quick Response Team. pic.twitter.com/0bwQmeX3ZK
— ANI (@ANI) August 25, 2020
అటవీ శాఖ అధికారులు ( Forest officials ) ఈ ఘటన గురించి మాట్లాడుతూ.. సీజన్ మారే సమయంలో కొండచిలువలు, ఇతర వణ్యప్రాణులు కొత్త చోటు వెతుక్కుంటూ వెళ్తుంటాయని.. అందుకే అప్పుడప్పుడు, అక్కడక్కడ ఇలాంటి ఘటనలు దర్శనం ఇస్తుంటాయని తెలిపారు. Also read : Sitaphal benefits: సీతాఫలం తింటే కలిగే లాభాలు, నష్టాలు