Thief Stealing iPhone In Varanasi : మనం ఇంటి నుంచి కాస్లీ బట్టలు, ఫోన్ లు, బంగారం పెట్టుకుని బైటకు వెళ్తుంటాం. కొన్నిసార్లు బస్టాండ్ లు, ట్రైన్ లు, టెంపులలో కేటుగాళ్లు మాటు వేసి ఉంటారు. ముఖ్యంగా రద్దీగా ఉన్న చోట చీరీలు జరగటం కామన్. ఏంపనిచేయకుండా ఇలా చోరీలు చేస్తూ అవి అమ్ముతూ.. దానితో వచ్చిన సొమ్ముతో కొందరు కాలం గడిపేస్తుంటారు. కానీ కొన్నిసార్లు చోరీలు చేస్తు అడ్డంగా దొరికి పోతారు.
It happened on 29 Jan 2024 at around 1:27pm. I had visited Varanasi for a pilgrimage trip with my parents. We were having street food when some guy (black nike sweatshirt) pulled it out of my pocket.
I realized it was missing 3 mints later & all of us were in a state of panic. pic.twitter.com/OeAbgeCViT
— Sarah (@shehjarr_) February 5, 2024
మనం ఎంత అప్రమత్తంగా ఉన్న కూడా దొంగలు తమ ట్యాలెంట్ ను చూపిస్తూనే ఉంటారు. ముఖ్యంగా కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఈ తలనొప్పి మరింత ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో ఎంతో అలర్ట్ గా ఉండాలి. లేకపోతే మనకు ఇష్టమైన బంగారం, మొబైల్ ఫోన్ లను పొగొట్టుకుని బాధపడుతుండాలి. అచ్చం ఇలాంటి ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
పూర్తి వివరాలు...
ఉత్తర ప్రదేశ్ లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఒక సార్ ఆన్ అనే యువతి తన కుటుంబంతో వారణాసి భోళా శంకరుడిని దర్శించుకొవడానికి వచ్చింది. అయితే.. ఆమె అంతకు నాలుగు నెలల ముందే ఐఫోన్ ను కొనుగోలు చేసింద. ఆ తర్వాత తన ఫ్యామిలో కలిసి సరదాగా పవిత్రమైన వారణాసికి ప్లాన్ చేశారు. ఆ పవిత్రమైన టెంపుల్ ఆవరణలో తనకుటుంబంతో కలిసి హోటల్ లో ఏదో తింటుంది. కాసేటికి బిల్ పే చేద్దామని జేబులో చూస్తూ ఐఫోన్ లేదు. దీంతో టెన్షన్ తో ఆమె నోట్లో మాటరాలేదు. పవిత్రమైన చోట ఇలాంటి ఘటన ఎదురవ్వడంతో తీవ్ర మనోవేదనకు గురైంది. వెంటనే అక్కుడున్న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
గత నెల జనవరి 29 ఈఘటన జరిగినట్లు సమాచారం. ఆ తర్వాత యువతి తనకు ఎదురైన చేదు అనుభవాలను ఎక్స్ వేదికగా పంచుకుంది. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది. బాధితురాలు.. స్థానిక పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్లింది. అప్పుడు.. ఆమెకు ట్విస్ట్ ఎదురైంది. బాధితురాలి ఫిర్యాదులో పోలీసులు.. ఫోన్ చోరీకి గురైందని దానికి బదులుగా ఫోన్ కన్పించకుండా పోయిందని రాయమన్నారని చెప్పింది. కానీ యువతి మాత్రం చోరీ జరిగిందనే రాసింది. ఆ తర్వాత.. యువతి అక్కడ ఉన్న షాపు దగ్గరకు వచ్చి, సీసీ కెమెరా ఫుటేజ్‌లో రికార్డులు చూడమని రిక్వెస్ట్ చేసింది.
అప్పుడు యువతి దిమ్మతిరిగే ఘటన కన్పించింది. ఒక కేటుగాడు ఆమెను ఫాలో అవుతున్నాడు. తల్లిదండ్రులతో ఆమె మాట్లాడుతుండగా.. మెల్లగా ఆమె వెనుకాలే వచ్చి, ఏదో కవర్ లాంటి దాన్నిఅడ్డంగా పెట్టి, జేబులోని ఐఫోన్ తీసి మెల్లగా జారుకున్నాడు. ఈ వీడియోను స్థానికులకు చూపించగా.. వారు.. చోరీ చేసింది విజయ్ అనే దొంగగా గుర్తించారు. అతనిపై అప్పటికే పలుకేసులున్నాయని కూడా చెప్పారు.
Read More: Rama- Krishna Tulsi: కృష్ణతులసి, రామతులసికి తేడా ఏమిటి? ఇంట్లో ఏ తులసిని నాటాలో తెలుసా?
ఈ వీడియోను యువతి పోలీసులకు వెళ్లి ఇచ్చింది. ఆ తర్వాత దీనిపై పోలీసులు కూడా కేసు నమోదు చేశారని చెప్పింది. ఇక.. తన మరో ట్విస్ట్ ఏంటంటే యువతి ఫోన్ లోకేషన్ జార్ఖండ్ లో ఉన్నట్లు ఆమెకు సమాచారం వచ్చింది. ఈ విషయాన్ని కూడా యువతి పోలీసులకు చెప్పింది. ఇప్పటిదాక తన ఫోన్ గురించి ఎలాంటి సమాచారం రాలేదని ఆవేదనతో రాసుకొచ్చింది. పవిత్రమైన ఆలయాల దగ్గర ఇలాంటి పనులు చేయడం ఏంటని కూడా బాధపడింది. ఒక పవిత్రమైన ఆధ్యాత్మిక నగరంలో, ఇలాంటి ఘటన జరగటం తమను తీవ్రంగా కలిచివేస్తుందని యువతి తన బాధను ఎక్స్ వేదికగా పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook