భార్యభర్తల కాపురంలో చిచ్చుపెట్టిన లిప్ స్టిక్.. స్టోరీ మాములుగా లేదుగా..

Wife Leaves Home: మథుర కు చెందని ఇద్దరు దంపతులకు పెళ్లై రెండు సంవత్సరాలు అయ్యింది.  ఇద్దరు కూడా ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. కానీ  ఆర్థికంగా సెటిల్ కావాడానికి బాగా ప్రయత్నాలు చేస్తున్నారు. భర్త ఎక్కువగా దుబారా చేస్తుంటాడని భార్య తరచుగా ఆవేదన చెందేది. ఈ క్రమంలో ఒకరోజు ఆమె తీసుకున్న నిర్ణయం కాస్త వార్తలలో నిలిచింది.   

Written by - Inamdar Paresh | Last Updated : Mar 7, 2024, 10:48 AM IST
  • పెళ్లై రెండేళ్ల తర్వాత లిప్ స్టిక్ విషయంలో గొడవ..
  • భర్తకు ట్విస్ట్ అనుకోని ట్విస్ట్ ఇచ్చిన భార్య..
భార్యభర్తల కాపురంలో చిచ్చుపెట్టిన లిప్ స్టిక్.. స్టోరీ మాములుగా లేదుగా..

Husband Buys Costly Lipstic Dispute: పెళ్లయ్యాక భార్త భర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్థలు రావడం సహాజమే. ఇద్దరు పెరిగిన వాతావరణం, ఆలోచన విధానం డిఫరెంట్ గా ఉంటుంది. అందుకు ఇద్దరి మధ్య కొన్నిసార్లు వాగ్వాదాలు, గొడవలు జరుగుతుంటాయి. ఈ క్రమంలో ఇద్దరు కూడా గొడవలు చోటు చేసుకుంటే మాట్లాడుకుని పరిష్కరించుకోవాలి.  కొన్నిసార్లు ఇంట్లోని పెద్దలతో మాట్లాడి, నాలుగు గోడల మధ్య ఏర్పడిన ప్రాబ్లమ్స్‌ ను పరిష్కరించుకోవాలి. కానీ కొందరు దీనికి భిన్నంగా ప్రవర్తిస్తారు.

Read More: Actress Kajal Agarwal: హీరోయిన్ కాజల్ అగర్వాల్ నడుముపై చెయివేసిన అభిమాని.. సోషల్ మీడియాలో రచ్చగా మారిన వీడియో ఇదే..

భార్యకు అందంగా లేదని, చికెన్ వండరాలేదని, పప్పులో ఉప్పు వేయలేదని గొడవలకు దిగుతుంటారు. ఇక.. భార్యలేం తక్కువతినలేదు.. వాళ్లుకూడా తమ భర్త.. బంగారం కొనియ్యలేదని, టూర్లకు తిప్పడం లేదని,లగ్జరీ లైఫ్ ఇవ్వడం లేదని గొడవలు పడుతుంటారు. కొందరు భార్యభర్తలు విచిత్రంగా అతిగా ప్రేమిస్తుంటారు. ఇలా వారు చూపిస్తున్న ప్రేమను కూడా అవుతలవారు భరించలేక గొడవలు పడుతుంటారు.  భార్య.. ఒకటి చెబితే.. భర్త మరోకటి చేస్తారు.  ఇది కూడా కొందరు భరించలేక గొడవలు పడుతుంటారు. అచ్చం ఇలాంటి కోవకు  చెందిన ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. 

ఉత్తర ప్రదేశ్ లోని భార్యభర్తల మధ్య  జరిగిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. మథురకు చెందిన జంటకు రెండేళ్ల క్రితం పెళ్లి జరిగింది. ఇద్దరు కలిసి ఉండేవారు. ఒకరోజు భార్య.. తన భర్తకు లిప్ స్టిక్ తీసుకురావాలని కోరింది. అది కూడే పదిరూపాయల లిప్ స్టిక్ తేవాలని మరీ చెప్పింది.  ఈ క్రమంలో భర్త పోంగిపోయాడు. తన భార్యకు మంచి లిప్ట్ స్టిక్ తేవాలని షాపులు వెతికాడు. చివరకు ఒక లిప్ స్టిక్ తీసుకొని తన ఇంటికి వెళ్లి భార్యను సర్ ప్రైజ్ చేయాలనుకున్నాడు. తన భార్య చేతిలో కొత్తగా కొన్న లిప్ స్టిక్ ను పెట్టాడు. ఆమె దాన్ని  చూసి ఆనందపడకుండా , దాని ధర గురించి ఆరా తీసింది.  భర్త మాత్రం... రేటు నీకేందుకు నీకు నచ్చిందా.. లేదా.. అని అడిగాడు.

కానీ భార్య పదే పదే అడగటంతో అది ౩౦ రూపాయలు అని చెప్పాడు. అంతే .. ఆమె భర్తతో గొడవకు దిగింది. నేను చెప్పింది ఏంటీ నువ్వు చేసింది ఏంటని భర్తతో పొట్లాడింది. ఇది కాస్త పెద్దదిగా మారి ఇద్దరు కొట్టుకోవడం వరకు వెళ్లింది. చివరకు మహిళ.. తన ఇంటినుంచి చెప్పాపేట్టకుండా పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో భర్త.. ఆమెను ఎన్నోసార్లు సముదాయించడానికి ప్రయత్నించాడు. కానీ ఆమె మాత్రం అస్సలు పట్టించుకోలేదు. ఈ క్రమంలో ఇరువురి కుటుంబ సభ్యులు ఇద్దరికి కౌన్సెలింగ్ కోసం ప్రయత్నించారు. ఆగ్రాలోని సతీష్ ఖిర్వార్ కౌన్సెలింగ్ ను సంప్రదించారు. ఇద్దరికి ఆయన సరైన విధంగా కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.

ఇద్దరి గొడవలను కౌన్సిలర్న కూల్ గా విన్నాడు. ఇద్దరితో విడివిడిగా మాట్లాడారు. అంతే కాకుండా.. ఆ తర్వాత ఇద్దరికి కూర్చుండబెట్టి.. భార్య ఏంచెప్పాలనుకుంటుందో కూల్ గా అర్థమయ్యేలా చెప్పాడు. అదే విధంగా ఒకరి భావనలను మరోకరు గౌరవించాలని, భార్య.. అనవసరంగా దుబారా ఖర్చులు చేయోద్దని భర్తకు చెప్పేదని ఆయన అన్నారు.  

Read More: Teeth Whitening Tips: మీ దంతాలు పచ్చగా ఉన్నాయా..?.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే ముత్యాల్లా మెరుస్తాయి..

కానీ భర్త.. ఎంత  ఖర్చు అయిన తన భార్యకు మంచిది కొనిచ్చి తన ప్రేమను చూపించుకొవడానికి ప్రయత్నించాడని కౌన్సిలర్ చెప్పాడు. ఇద్దరు కూడా మంచి ఆలోచనే కానీ.. అనవసరంగా మంచి ఫ్యామిలీని అనవసరమైన మాటలతో డిస్టర్బ్ చేసుకుంటున్నారని వివరించారు. కౌన్సెలింగ్ తర్వాత భార్యభర్తలిద్దరూ తిరిగి ఒక్కటయ్యారు. ఈ ఘటన మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News