Twitter Privacy Policy: ప్రముఖ మైక్రోబ్లాగింగ్ వేదిక ట్విట్టర్ కొత్త పాలసీ అమల్లోకొచ్చింది. ఇక నుంచి కొత్త నిబంధనల ప్రకారం నడుచుకోకపోతే విషయం సీరియస్‌గా ఉంటుంది. మీ ఫోటోలు డిలీట్ అయిపోతాయి జాగ్రత్త.
సోషల్ మీడియా మాధ్యమంలో ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్‌గా ప్రాచుర్యంలో ఉన్న ట్విట్టర్ నవంబర్ 30,2021 నుంచి కొత్త పాలసీ ప్రవేశపెట్టింది. ఒకరి అనుమతి లేకుండా మరొకరి ఫోటోలు గానీ కంటెంట్ గానీ వినియోగించకూడదు. ఈ విషయంపై ఫిర్యాదులొస్తే సంబంధిత పోస్ట్‌లు డిలీట్ అవుతాయి. ట్విట్టర్ ప్రవేశపెట్టిన కొత్త నిబంధనల ప్రకారం ఇక నుంచి పోస్ట్ చేయాల్సి ఉంటుంది. లేదా ట్వీట్ చేయాల్సి ఉంటుంది.
ఈ సైట్‌లో ఒక యూజర్ లేదా ఓ అథారిటీ అనుమతి లేకుండా ఫోటోలు గానీ, వీడియోలు గానీ లేదా కంటెంట్ గానీ పోస్ట్ చేయకూడదు. అలా చేసిన పక్షంలో సంబంధిత యూజర్ లేదా అథారిటీ నుంచి ఫిర్యాదు అందితే వాటిని ట్విట్టర్ డిలీట్ చేస్తుంది. ఇప్పటికే ట్విట్టర్‌లో ఇటువంటి కఠిన నిబంధనలున్నాయి. చిరునామా, ఫోన్ నెంబర్, ఈ మెయిల్స్ మెడికల్ బిల్స్, సోషల్ మీడియా వివరాలు, జీపీఎస్ లొకేషన్, ఐడీ కార్డులు, మెడికల్ రికార్డ్స్ వంటి సమాచారాన్ని ట్విట్టర్‌లో షేర్ చేయకూడదు. ఆర్ధిక లావాదేవీల సమాచారం కూడా ట్విట్టర్‌లో షేర్ చేయకూడదు. అమెరికాలో బహిరంగ ప్రదేశాల్లో ఫోటోలు తీసి..ట్విట్టర్‌లో(Twitter)అనుమతి లేకుండా పోస్ట్ చేయడం ఎక్కువైంది. యూజర్ల వ్యక్తిగత భద్రతను కాపాడేందుకు వివిధ దేశాల చట్టాలకు అనుగుణంగా కొత్త పాలసీ(Twitter New Policy) ప్రవేశపెట్టింది ట్విట్టర్.
ట్విట్టర్ కొత్త అప్‌డేట్(Twitter New Rules)ప్రకారం..పబ్లిక్ ఫిగర్స్, ప్రజా ప్రయోజనాల నిమిత్తం షేర్ చేసే పోస్టులకు ఈ నిబంధన వర్తించదు. అయితే ఈ తరహా పోస్టులు అభ్యంతరకరంగా ఉంటే మాత్రం అవి కూడా తొలగించబడతాయి. ఒక్కోసారి ఫిర్యాదులో తీవ్రతను బట్టి అంటే పోస్టులో ఉన్న అభ్యంతర తీవ్రతను బట్టి ఎక్కౌంట్ బ్లాక్ చేయడం లేదా తొలగించడం లేదా సస్పెండ్ చేయడం కూడా ఉంటుంది.
Also read: Belly Dance Viral Video: బెల్లీ డ్యాన్స్ వైరల్.. ఓవర్ నైట్ సెలెబ్రిటీగా మారిన ఉత్తరాఖండ్ యువతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook