Richest And Poorest MPs: రాజ్యసభలో అత్యంత ధనిక ఎంపీ మన తెలుగు ఎంపీనే

Top 10 Richest MPs And Poorest MPs in Rajya Sabha: ఇండియాలో ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్న వారిలో ఎంత మంది ధనవంతులు ఉన్నారు ? ఎంతమంది సాధారణ సభ్యులు ఉన్నారు ? అలాగే ఎంతమంది రాజ్యసభ సభ్యులపై క్రిమినల్ కేసులు ఉన్నాయి అనే వివరాలను వెల్లడిస్తూ ఏడీఆర్ ఒక నివేదిక విడుదల చేసింది. 

Written by - Pavan | Last Updated : Aug 21, 2023, 05:17 PM IST
Richest And Poorest MPs: రాజ్యసభలో అత్యంత ధనిక ఎంపీ మన తెలుగు ఎంపీనే

Top 10 Richest MPs And Poorest MPs in Rajya Sabha: ఇండియాలో ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్న వారిలో ఎంత మంది ధనవంతులు ఉన్నారు ? ఎంతమంది సాధారణ సభ్యులు ఉన్నారు ? అలాగే ఎంతమంది రాజ్యసభ సభ్యులపై క్రిమినల్ కేసులు ఉన్నాయి అనే వివరాలను వెల్లడిస్తూ ఏడీఆర్ ఒక నివేదిక విడుదల చేసింది. ఏడీఆర్ నివేదిక ప్రకారం, బీఆర్ఎస్ పార్టీకే చెందిన రాజ్యసభ సభ్యుడు బండి పార్థ సారధి రెడ్డి 5,300 కోట్ల రూపాయల ఆస్తులతో రాజ్యసభ మొత్తంలోనే అత్యంత ధనిక ఎంపీగా ఉన్నారు. ఈయన మరెవరో కాదు.. హెటిరో డ్రగ్స్ ని స్థాపించిన హెటెరో గ్రూప్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కూడా.  ఆ తరువాత రూ. 2,577 కోట్ల ఆస్తులతో రెండో స్థానంలో వైఎస్సార్‌సీపీ ఎంపీ ఆళ్ల అయోధ్యరామి రెడ్డి ఉన్నారు. ముచ్చటగా మూడో స్థానంలో ఉన్న ఎంపీ ఎవరో తెలుసా ? బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ సతీమణి, సమాజ్ వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ రూ.1,001 కోట్ల ఆస్తులతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు.
 
కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ 649 కోట్ల ఆస్తులతో నాలుగో స్థానంలో ఉండగా.. ప్రముఖ సుప్రీం కోర్టు అడ్వకేట్, స్వతంత్ర రాజ్యసభ సభ్యుడు అయిన కపిల్ సిబాల్ రూ.608 కోట్ల ఆస్తులతో ఐదో స్థానంలో ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు విక్రమ్‌జిత్ సింగ్ సాహ్నీ రూ. 498 కోట్ల ఆస్తులతో ధనిక రాజ్యసభ సభ్యుల జాబితాలో 6వ స్థానంలో ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకే చెందిన మరో ఎంపీ సంజీవ్ అరోరా రూ.460 కోట్ల ఆస్తులతో 7వ స్థానంలో ఉన్నారు.
Top-10-Richest-MPs-And-Poorest-MPs-in-Rajya-Sabha.jpg 
ఎన్సీపీ ఎంపీ ప్రఫుల్‌భాయ్ మనోహర్‌భాయ్ పటేల్ రూ.416 కోట్ల ఆస్తులతో ఈ జాబితాలో ఎనిమిదో స్థానంలో ఉండగా.. వైఎస్‌ఆర్‌సీపీ నుండి రాజ్యసభ ఎంపీగా పార్లమెంట్ లో కాలుపెట్టిన నత్వానీ పరిమళ్ 396 కోట్ల ఆస్తులతో 9వ ధనవంతుడిగా ఉన్నారు. హర్యానా రాజ్యసభ ఎంపీ కార్తీక్ శర్మ రూ.390 కోట్ల ఆస్తులతో 10వ స్థానంలో ఉన్నారు.

టాప్ 10 పేద రాజ్యసభ ఎంపీల జాబితాను ఓసారి పరిశీలిస్తే..
ఏడీఆర్ వెల్లడించిన నివేదిక ప్రకారం, పంజాబ్ కి చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంత్ బల్బీర్ సింగ్ అత్యంత పేద రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. ఆయనకు రూ.3 లక్షల విలువైన ఆస్తులు మాత్రమే ఉన్నాయి అని ఆయన ఎన్నికల అఫిడవిట్ చెబుతోంది. బిజెపికి చెందిన మహారాజా సనాజయోబా లీషెంబా వద్ద కేవలం రూ. 5 లక్షల విలువైన ఆస్తులు మాత్రమే ఉన్నాయి. 6 లక్షల ఆస్తులతో ఆప్‌ ఎంపీ సంజయ్ సింగ్ 3వ స్థానంలో ఉండగా.. 9 లక్షల విలువైన ఆస్తులతో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రకాష్ చిక్ బరాక్ 4వ స్థానంలో ఉన్నారు. టీఎంసీ పార్టీకే చెందిన సాకేత్ గోఖలే 10 లక్షల రూపాయల విలువైన ఆస్తులతో ఈ జాబితాలో 5వ స్థానంలో ఉన్నారు. 

ఇది కూడా చదవండి : Top 10 Richest MLAs In India: దేశంలోనే టాప్ 10 అత్యంత ధనిక ఎమ్మెల్యేల్లో ఇద్దరు బడా తెలుగు నేతలు

11 లక్షల రూపాయల ఆస్తులతో సీపీఐ (ఎం) నేత ఏఏ రహీమ్‌ 6వ స్థానంవో, రూ. 17 లక్షల ఆస్తులతో బీజేపీ ఎంపీ సుమిత్రా బాల్మిక్ 7వ స్థానంలో, రూ. 18 లక్షల ఆస్తులతో బీజేపీ ఎంపీ సమీర్ ఓరాన్ 8వ స్థానంలో ఉన్నారు. రూ. 20 లక్షల ఆస్తులు వెల్లడించిన సీపీఐ(ఎం) ఎంపీ వి శివదాసన్ 9వ స్థానంలో ఉండగా.. 27 లక్షల రూపాయల ఆస్తులు ప్రకటించిన బిజెపి ఎంపీ వి మురళీధరన్ పదవ స్థానంలో ఉన్నారు. మురళీధరన్ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగానూ ఉన్నారు.

ఇది కూడా చదవండి : Billionaires in Rajya Sabha: పెద్దల సభలో పెద్ద పెద్ద బిలియనీర్లు.. అందులో మన తెలుగు శ్రీమంతులే ఎక్కువ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News