Optical Illusion: ఒకే వస్తువును లేదా చిత్రాన్ని ఇద్దరు వ్యక్తులు చూసే దృక్కోణం వేరుగా ఉండొచ్చు. దానిపై ఇద్దరి ఆలోచనలు, అవగాహన కూడా వేరుగా ఉండొచ్చు. ఈ వేర్వేరు ఆలోచనలే ఆ వ్యక్తుల మనస్తత్వాన్ని పట్టిస్తాయి. ఉదాహరణకు మీరొక ఆప్టికల్ ఇల్యూజన్‌ని చూస్తే... అందులో మీకు ఏం కనిపిస్తోందన్న దాన్ని బట్టి మీ ఆలోచనా ధోరణి, మనస్తత్వాన్ని అంచనా వేయొచ్చునని చెబుతుంటారు సైకాలజిస్టులు.
ఇక్కడ కనిపిస్తున్న ఆప్టికల్ ఇల్యూజన్‌లో నాలుగు చిత్రాలు ఉన్నాయి. ఇందులో మీరు మొదట ఏ వస్తువును చూశారనే దానిపై మీ మనస్తత్వాన్ని అంచనా వేయొచ్చు.
1) మొదట వృద్ధుడి ముఖాన్ని చూసినట్లయితే :
ఆ చిత్రాన్ని చూడగానే మొదట మీకు వృద్ధుడి ముఖం కనిపించినట్లయితే... మీ చూపు ఎప్పుడూ పెద్ద చిత్రాన్ని దాటిపోదని అర్థం.
ఇక మనస్తత్వం విషయానికొస్తే... నిజమైన ప్రేమకు అవసరమయ్యే సమయం, శక్తి, కృషిని వెచ్చించడానికి సిద్దపడే వ్యక్తి పట్ల మీరు ఆకర్షితులు కావొచ్చు.
2) మొదట గుర్రంపై ఉన్న వ్యక్తిపై మీ చూపు పడితే :
మీ చూపు మొదట గుర్రంపై ఉన్న వ్యక్తిపై పడినట్లయితే... మీరు కలలు కనే వ్యక్తి మీ ఎదురుగా ఉన్నా సరే... మీరు ఇంకా ఆ వ్యక్తి కోసం వెతుకులాడుతున్నట్లు అర్థం. ప్రేమ, రొమాన్స్ వంటి వాటికి దగ్గరయ్యేందుకు మీ మనసు కాస్త సంకోచిస్తున్నట్లు. అది మీ డ్రీమ్ గర్ల్ అయినా సరే మీ మనసు సంకోచిస్తూ ఉంటుంది.
3) మీ చూపు ఆ అమ్మాయిపై పడినట్లయితే...
ఆ ఆప్టికల్ ఇల్యూజన్‌లో నది పక్కనే ఓ అమ్మాయి పడుకుని ఉండటం గమనించవచ్చు. ఒకవేళ మీ చూపు మొదట ఆ అమ్మాయిపై పడినట్లయితే... గతంలో ప్రేమ తాలుకూ జ్ఞాపకాలు మిమ్మల్ని బాధిస్తున్నాయని అర్థం. శాశ్వతమైన ప్రేమ కోసం అన్వేషించడంలో ప్రయోజనం ఉంటుందని మిమ్మల్ని మీరు ఒప్పించడంలో చాలా కష్టంగా ఫీలవుతారు.
4) మీ చూపు ఆ ఆర్చ్‌పై పడినట్లయితే...
మీ చూపు మొదట ఆ నదిపై ఉన్న ఆర్చ్‌పై పడినట్లయితే మీ నరనరాన అడ్వెంచర్ తాలుకు ఆలోచనలు ఉన్నాయని అర్థం. మీరు ప్రేమలో పడటానికి భయపడరు. జీవితం అని పిలవబడే థ్రిల్లింగ్ అడ్వెంచర్‌ను ఆస్వాదిస్తారు.
Weekly Horoscope: రాశి ఫలాలు ఏప్రిల్ 11-ఏప్రిల్ 17... ఆ రాశి వారికి ఆర్థిక నష్టాలు తప్పకపోవచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook