Weird News: ఈద్ పార్టీకి పిలిస్తే వెళ్లి బిర్యానీతో పాటు నగలను కూడా తిన్నాడో ప్రబుద్ధుడు. మే 3న చెన్నైలో జరిగిన ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగుచూసింది. చెన్నైలోని ఓ నగల దుకాణంలో పనిచేసే మహిళ మే3 తేదీన తన సన్నిహితులకు ఈద్ సందర్భంగా పార్టీ ఇచ్చింది. అయితే ఆ పార్టీకి తన ఫ్రెండ్.. బాయ్ ఫ్రెండ్ ను కూడా ఆహ్వానించింది. వచ్చిన ఆ వ్యక్తి .. పార్టీలో మత్తుగా తాగాడు. బిర్యానీ కూడా తిన్నాడు. ఇంట్లోకి వెళ్లి కప్ బోర్డులో ఉన్న బంగారు ఆభరణాలను కూడా ఆరంగించేశాడు. ఆ తర్వాత పార్టీ ముగియడంతో అక్కడి నుంచి నెమ్మదిగా జారుకున్నాడు.
పార్టీ ముగిసిన తర్వాత హోస్ట్ తన కప్‌బోర్డులోంచి గోల్డ్ చైన్, డైమండ్ లాకెట్, డైమండ్ నెక్లెస్ పోయినట్టు గుర్తించింది. ఆ మరుసటి రోజు విరుగమ్‌బక్కం పోలీసులకు తన ఫ్రెండ్.. బాయ్ ఫ్రెండ్ పైనే అనుమానం ఉందని కంప్లైంట్ చేసింది. పోలీసులు ఆ వ్యక్తిని స్టేషన్ కు పిలిపించి విచారించారు. తొలుత నేరం చేసినట్టు అంగీకరించలేదు. దీంతో పోలీసులు వైద్యుల వద్దకు తీసుకెళ్లి కడుపును స్కాన్ చేశారు. కడుపులో బంగారు నగలు ఉన్నట్టు తేలడంతో చేసేదేంలేక నేరాన్ని అంగీకరించాడు. వెంటనే వైద్యులు అతనికి ఎనీమా ఇచ్చి.. కడుపులోంచి 95 వేల విలువ చేసే డైమండ్ నెక్లెస్, 25 వేల విలువచేసే గోల్డ్ చైన్ ను తీశారు. లాకెట్ మాత్రం అతని కడుపులోనే ఉండిపోయింది. దాన్ని తీసేందుకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
మొత్తంగా బిర్యానీతో పాటు ఆరగించేసిన ఆభరణాల విలువ లక్షా 45 వేల వరకు ఉంటుంది. అయితే ఈ నేరం చేసే సమయంలో అతను ఫుల్లుగా మద్యం సేవించి ఉన్నట్టుగా తేలింది. ఆభరణాలు దొరకడంతో హోస్ట్ పీఎస్ లో ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకుంది.
Also Read: Revanth Vs Kavitha: రాహుల్ పర్యటనకు ముందు ట్విట్టర్ లో కవిత, రేవంత్ మధ్య డైలాగ్ వార్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.