Viral: గిన్నిస్ బుక్(Guinness Book)లో చోటు దక్కించుకోవాలని ప్రతీ ఒక్కరూ ఆశపడుతుంటారు. ఇందుకోసం ఎంత సాహసాన్ని అయినా చేయడానికి వెనుకడుగు వేయరు. కొన్ని సందర్భాల్లో ఇందుకోసం ప్రాణాలను సైతం ఫణంగా పెడుతుంటారు. తాజాగా టర్కీ(Turkey)కి చెందిన ఓ వ్యక్తి ఇలాంటి అరుదైన ఫీట్‌ను చేసి గిన్నిస్ రికార్డులో స్థానం దక్కించుకోవడంతో పాటు అందరి ప్రశంసలు పొందారు.
వివరాల్లోకి వెళితే..
టర్కీకి చెందిన డారియో కోస్టాకు విమానం(Aircraft)తో విన్యాసాలు చేయడం అలవాటు. తన హాబీ ద్వారానే గిన్నిస్ స్థానంలో సంపాదించుకోవాలనుకున్న డారియో ఇందుకోసం ఓ పెద్ద సాహసానికి తెర తీశాడు. టర్కీ(Turkey)లోని ఇస్తాంబుల్(Istanbul)లో ఉన్న 2.6 కిలోమీటర్ల పొడవున్న రెండు సొరంగాల్లో విమానం నడిపి డారియో ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు. అయితే విమానం(Aeroplane) రోడ్డుపై వెళ్లిందనుకుంటే మీరు పొరబడినట్లే. ఎందుకంటే డారియో విమానాన్ని సొరంగంలో కూడా భూమిపై నుంచి కొంత ఎత్తులో నడిపించారు. విమానం ఏమాత్రం పక్కకు జరిగినా.. పైకి లేచినా పెద్ద ప్రమాదం జరిగేది. ఇలా 2.6 కిలోమీటర్ల పొడవున్న సొరంగంలో ఆ విమానం ఏకంగా గంటకు 245 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోవడం మరో విశేషం.
Also Read; BMW New Model Car: బీఎండబ్ల్యూ సరికొత్త మోడల్ కారు చూస్తే..చూపు తిప్పుకోలేరు
అత్యంత పొడవైన టన్నెల్(Tunnel) గుండా విమానాన్ని నడపడం ప్రపంచంలో ఇదే తొలిసారి. ఇలా ఇంత వేగంతో అద్భుత ఫీట్‌ను సాధించారు కాబట్టే డారియో గిన్నిస్ రికార్డు(Guinness World Record)లో స్థానం దక్కించుకున్నారు. ప్రస్తుతం ఈ సాహసానికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్(Viral)గా మారింది. డారియో సాహసానికి నెటిజన్లు(Netizens) వావ్ అంటున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
stunt pilot dario costa set guinness world record by flying flight between two tunne
ఇస్తాంబుల్ లో ఓ వ్యక్తి అరుదైన ఘనత
రెండు సొరంగాల్లో విమానం నడిపిన డారియో కోస్టా
గిన్నిస్ బుక్ లో స్థానం