Snake Viral Video: ఈ చెట్లంటే పాములు పడిచస్తాయంట.. ఇవి ఇంట్లో ఉంటే పాములకు గ్రీన్ కార్పెట్ వేసినట్లే..

Snake Viral Video Trending in Google: ఇంటి చుట్టుపక్కల ఎక్కువగా గుబురుగా ఉండే చెట్లను అస్సలు పెట్టుకోవద్దు. అదే విధంగా సువాసనలు వెదజల్లే చెట్ల దగ్గర పాములు ఎక్కువగా వస్తుంటాయి. అడవికి దగ్గరగా ఉన్న ప్రాంతాలలో, చెట్లు ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో పాములు వస్తుంటాయి. 

Written by - Inamdar Paresh | Last Updated : Feb 24, 2024, 02:13 PM IST
  • సువాసన వచ్చే చెట్ల దగ్గర పాములుంటాయి..
  • ఇంట్లో గుబురుగా చెట్లు పెరక్కుండా చూడాలి..
Snake Viral Video: ఈ చెట్లంటే పాములు పడిచస్తాయంట.. ఇవి ఇంట్లో ఉంటే పాములకు గ్రీన్ కార్పెట్ వేసినట్లే..

Snake Viral Video Trending in Google: మనలో చాలా మందికి పాములంటే చచ్చేంత భయం. పొరపాటున పాములు  (snakes)  కన్పిస్తే, ఆ ప్రాంతానికి వెళ్లడం మానేస్తారు. అడవికి దగ్గరగా ఉన్న ప్రాంతాలలో, చెట్లు ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో పాములు వస్తుంటాయి. పొలాలకు దగ్గరలో ఉన్న ఇళ్లలో కూడా ఎక్కువగా ఉంటాయి.

పాములు ఎలుకలను ఎక్కువగా తింటాయి. కొన్నిసార్లు పాములు మనుషులను కాటు వేస్తుంటాయి. పాములు కన్పిస్తే కొందరు స్నేక్ సొసైటీ వారికి కూడా సమాచారం ఇస్తుంటారు. అయితే..  కొన్ని చెట్లంటే పాములు పడిచస్తాయంట. వీడిని ఇంట్లో అస్సలు పెట్టుకోవద్దని చెబుతుంటారు.

మల్లె చెట్లు.. 

మల్లె చెట్టు కు (Jasmine) మంచి సువాసన ఉంటుంది. బొండు మల్లె, సన్నం మల్లే తీగలాగా పాకుతుంటాయి. దీనికి పూలు పూస్తాయి. దీని నుంచి సువాసన కొద్ది దూరం వరకు కూడా వస్తుంటుంది. ఈ వాసనను పాములు ఆకర్షిస్తాయంట. అందుకే ఈ చెట్ల చుట్టుపక్కల పాములు ఎక్కువగా ఉంటాయంట.

మొగలి చెట్టు.. 

మొగలి చెట్లంటే పాములకు ఎంతో ఇష్టమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అడవుల్లో ఈ చెట్ల కింద పాములు కుప్పలుగా ఉంటాయంట. వీటి నుంచి కూడా మంచి సువాసన వస్తుంది. 

పారిజాతం..

పారిజాతం చెట్టు చాలా కొద్ది ప్రదేశాలలో కన్పిస్తుంటుంది. దీన్ని దేవతా చెట్టు అని కూడా అంటారు. పారిజాతం నుంచి మంచి సువాసన వస్తుంది. అందుకే దీన్నుంచి సువాసన వచ్చే అగరొత్తులు, పర్ఫూమ్ లను తయారు చేస్తారు. వీటి చుట్టుపక్కల కూడా పాములుంటాయి.

గుబురుగా పెరిగే మొక్కలు..

ఇంట్లో కొన్నిరకాల మొక్కలు గుబురుగా, తీగల మాదిరిగా దట్టంగా పెరుగుతాయి.  ఆప్రాంతమంతా వ్యాపిస్తాయి. అయితే.. ఇలాంటి ప్రదేశాలలో వెలుతులు అస్సలు పడదు. వెచ్చగా ఉంటుంది. అందుకే వీటిని పాములు తమ ఆవాసాలుగా చేసుకుంటాయని చెబుతారు. అందుకు మన ఇళ్లలో చెట్లను పెంచితే ఎప్పటి కప్పుడు క్లీన్ గా ఉంచుకోవాలి. ముఖ్యంగా ఈ చెట్లను ఇంట్లో పెంచుకున్న వారు కాస్తంతా అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. 

Also Read: Yatra 2 Trailer: నేను విన్నాను.. నేను ఉన్నాను.. యాత్ర-2 ట్రైలర్‌లో అదిరిపోయే డైలాగ్స్  

Also Read: Drop Tecno Pop 8 Price: ఫ్లిప్‌కార్ట్‌ హాట్‌ డీల్‌లో Tecno Pop 8 మొబైల్ కేవలం రూ. 6,799కే..ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News