పామును చూసి పరుగులు పెట్టిన సన్నీలియోన్

సన్నీ లియోన్ పై పాము పడింది. అయినా ఆమె లైట్ గా తీసుకున్నారు. ఇంతకీ అక్కడ జరిగిందేంటీ?

Last Updated : Nov 26, 2017, 08:30 PM IST
పామును చూసి పరుగులు పెట్టిన సన్నీలియోన్

పాము అని పేరువింటే చాలు అబ్బో..! అనేస్తాం. అదే పాము కళ్ల ముందు కనిపిస్తే ఒళ్లు జలదరించడమే కాదు.. అక్కడి నుంచి పరుగులు తీస్తాం.. అవునా.. ! మరి ఇలాంటి సంఘటన ఒక సెలబ్రిటీకి జరిగితే..

బాలీవుడ్ నటి సన్నీలియాన్ కు అచ్చం ఇలాంటి పరిస్థితి ఎదురైందట. ఆ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. "తేరా ఇంతెజార్" సినిమా షూటింగ్ సెట్ లో సన్నీ స్క్రిప్ట్ చదువుకుంటూ ఉండగా.. మూవీ యూనిట్ సరదాగా ఆటపట్టించడానికి ఒక లబ్బర్ పామును ఆమె తలదగ్గరకు తీసుకొచ్చి.. ఆమెపై విసిరారు. అంతే.. గుండె ఆగినంత పనైపోయింది సన్నీలియోన్ కు. వెంటనే పరుగులు పెట్టేసింది. తీరా సంగతి తెలుసుకున్న సన్నీ లైట్ గా తీసుకోవడంతో నవ్వులు విరిశాయి అక్కడ. వీడియోను ఎవరో తీస్తే.. సన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Trending News