Snake Giving Birth : పాము నేరుగా పిల్లలు పెట్టడం ఎప్పుడైనా చూశారా ?

Snake Giving Birth To Young Baby Snakes: ప్రపంచవ్యాప్తంగా పాములు అన్నీ దాదాపు ఒకే విధమైన శరీర ఆకృతిని కలిగి ఉన్నప్పటికీ, అందులో దాదాపు 3,000 రకాల వరకు పాముల జాతులు ఉంటాయని స్నేక్ సైన్స్ చెబుతోంది. అలాగే, చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసే మరో విషయం ఏంటంటే, పాముల పునరుత్పత్తిలో కూడా ఒక పాము నుంచి మరో పాముకు మధ్య వ్యత్యాసాలు ఉంటాయి.

Written by - Pavan | Last Updated : Jul 13, 2023, 04:13 AM IST
Snake Giving Birth : పాము నేరుగా పిల్లలు పెట్టడం ఎప్పుడైనా చూశారా ?

Snake Giving Birth To Young Baby Snakes: ప్రపంచవ్యాప్తంగా పాములు అన్నీ దాదాపు ఒకే విధమైన శరీర ఆకృతిని కలిగి ఉన్నప్పటికీ, అందులో దాదాపు 3,000 రకాల వరకు పాముల జాతులు ఉంటాయని స్నేక్ సైన్స్ చెబుతోంది. అలాగే, చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసే మరో విషయం ఏంటంటే, పాముల పునరుత్పత్తిలో కూడా ఒక పాము నుంచి మరో పాముకు మధ్య వ్యత్యాసాలు ఉంటాయి. సాధారణంగా పాములు గుడ్లు పెట్టడం ద్వారానే పిల్లలు చేస్తాయి అని చాలామంది భావిస్తుంటారు. కానీ వాస్తవానికి కొన్ని రకాల పాములు క్షీరదాల మాదిరిగానే గుడ్లు పెట్టడం కాకుండా ఏకంగా పిల్లలనే పెడతాయి.

అవును, పాములు పిల్లలు పెట్టడం ఎప్పుడైనా చూశారా ? చాలామంది పాములు గుడ్లు పెట్టి వాటి ద్వారా పిల్లలు పెట్టడం చూసి ఉండొచ్చు కానీ పాము పిల్లలు పెట్టడం చూసి ఉండకపోవచ్చు. అలాంటి వారి కోసమే సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ స్నేక్ వీడియో.

చూశారు కదా.. పాము రోడ్డుపై వెళ్తున్న సమయంలోనే పిల్లలు పెడుతోంది. ఆ సమయంలో ఆ పాము ఒక్క చోట ఆగిపోయి అక్కడే మెలికలు తిరుగుతోంది. మరోవైపు పాము తోక కింది భాగంలో.. అంటే సాధారణంగా పాములు ఎక్కడి నుంచి అయితే గుడ్లు పెడతాయో.. అక్కడి నుంచే పిల్లలు పెడుతుండటం ఈ వీడియోలో కనిపిస్తోంది. 

 

ఈ దృశ్యం చూసిన ప్రత్యక్షసాక్షులు.. అక్కడే ఆగిపోయి ఆ వీడియోను తమ మొబైల్ కెమెరాల్లో బంధించడం మొదలుపెట్టారు. అలా ఒక యూట్యూబర్ ఈ వీడియోను యూట్యూబ్ లో అప్ లోడ్ చేయగా.. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. ఎంతోమంది నెటిజెన్స్ ఈ వీడియోను ఎంతో ఆసక్తిగా వీక్షిస్తున్నారు. 

స్నేక్స్ అంటేనే చాలామందికి ఒక రకమైన ఆసక్తి నెలకొని ఉంటుంది. అందులోనూ పాము పిల్లలు పెడుతోంది అనగానే ఈ వీడియోకు మరింత ఎక్కువ స్పందన కనిపిస్తోంది. స్నేక్ సైన్స్ తెలుసుకోవాలి అనే ఆసక్తి ఉన్న ఔత్సాహికులు చాలామందే ఉంటారు. పాములు ఎప్పుడు, ఎందుకు, ఎలా ప్రవర్తిస్తాయి అనే సందేహం చాలామందిలో ఉంటుంది. అందుకే పాములకు సంబంధించిన వీడియోలకు ఇంటర్నెట్లోనూ అంత ఎక్కువ రెస్పాన్స్ కనిపిస్తోంది. ఈ వీడియోను కూడా 2.74 కోట్ల మంది వీక్షించగా.. లక్షా 25 వేల మంది లైక్ కొట్టారు.

Trending News