Snake Viral Video: కుక్కను కాపాడేందుకు.. కొండ చిలువతో పోరాడిన చిన్నారులు! వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Python Dog Viral Video, 3 Young Boys fight with Python. కొండ చిలువ భారీ నుంచి కుక్కను కాపాడడానికి ముగ్గురు చిన్నారులు తమ ప్రాణాలను పళంగా పెట్టారు.  

Written by - P Sampath Kumar | Last Updated : Aug 7, 2022, 03:42 PM IST
  • కుక్కను కాపాడేందుకు
  • కొండ చిలువతో పోరాడిన చిన్నారులు
  • వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే
Snake Viral Video: కుక్కను కాపాడేందుకు.. కొండ చిలువతో పోరాడిన చిన్నారులు! వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

3 Young Boys fight with Python and saves Dog: చాలా మంది చిన్న పాము కనిపిస్తేనే.. ఆమడ దూరం పరుగెత్తి భయంతో వణికిపోతారు. ఇంకాస్త పెద్ద పాము కనబడితే.. వెన్నులో వణుకు పుట్టి ఒళ్లంతా చెమటలు పట్టేస్తాయి. ఇక కొండ చిలువ కనిపిస్తే ఒక్కసారిగా గుండె ఆగినంత పనవుతుంది. అలాంటిది ముగ్గురు చిన్నారులు పెద్ద కొండ చిలువను పట్టుకుని సాహసమే చేశారు. తమ కుక్కను కొండ చిలువ భారీ నుంచి కాపాడడానికి తమ ప్రాణాలను పళంగా పెట్టారు. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. 

వీడియో ప్రకారం.. ఓ మైదాన ప్రాంతంలో ఓ భారీ కొండ చిలువ ఓ కుక్కను చుట్టేస్తోంది. దాంతో అక్కకు పక్కకు జరిగే అవకాశం కూడా ఉండదు. ఈ ఘటనను ఓ ముగ్గురు పిల్లలు చూస్తారు. వారు ఎలాంటి భయం లేకుండా కొండ చిలువతో పోరాడతారు. చేతిలో కర్రను పట్టుకున్న ఓ పిల్లవాడు కొండ చిలువ తలపై కొడతాడు. మిగతా ఇద్దరు తమకు దొరికిన వాటితో కొడుతారు. అయినా కూడా ఆ కొండ చిలువ కుక్కను వదలదు.

చివరకు ఓ పిల్లాడు కర్ర సాయంతో కొండ చిలువ తలను అదిమి పట్టి.. దాని తలను ఒడుపుగా పట్టుకుంటాడు. వెంటనే ఓ పిల్లాడు వచ్చి పాము తోకను పట్టుకోగా.. ఇంకో పిల్లాడు కొండ చిలువ నుంచి కుక్కను కాపాడేందుకు ప్రయత్నిస్తాడు. చివరకు పిల్లలు ముగ్గురూ కొండ చిలువ నుంచి కుక్కను కాపేడేస్తారు. పాము పట్టు నుంచి తప్పుకున్న కుక్క ఒక్కసారిగా అక్కడి నుంచి పారిపోతుంది. ఆపై పిల్లలు పామును చంపేస్తారు.  

ఈ వీడియోను సోషల్ మీడియాలో 'ఫిగెన్సెజ్గిన్' అనే ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేయబడింది. 'ఈ పిల్లలకు పెద్ద దండాలు' అని క్యాప్షన్‌లో రాశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వీడియో చూసిన అందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. చిన్నారుల ధైర్యసాహసాలకు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వీడియోకి 18 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోను 8 లక్షల మందికి పైగా లైక్ చేశారు. అదే సమయంలో 1 లక్ష మందికి పైగా రీట్వీట్ చేశారు.

Also Read: కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు.. ఏ ఆహార పదార్థాలు తినాలో, ఏవి తినకూడదో తెలుసా?

Also Read: పెళ్లి చేసుకోమని వేధింపులు.. 30 ఫోన్లతో నరకం చూపించాడు.. నిత్య మీనన్ సంచలన ఆరోపణలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News