King Cobra stolen Sandal infront of house: సాధారణంగా పాములు తమ ఆహారంగా ఎలుకలు, కప్పలు, తొండ, కీటకాలను తింటుంటాయి. అప్పుడప్పుడు పాలు, గుడ్లు కూడా మింగేస్తుంటాయి. జనాలు బాగా ఉన్న సందర్బాల్లో భయానికి పాములు తమ ఆహారంను నోట కరుచుకొని వెళ్ళిపోతుంటాయి. ఎలుకలు, కప్పలను పాములు ఎత్తుకెళుతుండడం ఎప్పుడోసారి మనం చూసే ఉంటాం. అయితే చెప్పును ఎత్తుకెళ్లడం ఎపుడైనా చూశారా?. నిజమే.. మీరు చూస్తుంది. ఓ పాము చెప్పును పట్టుకుని వేగంగా పాకుతూ వెళ్లింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియో ప్రకారం... ఒక పెద్ద నాగుపాము ఇటుకల లోపల నుంచి బయటకు వచ్చి ఇంటిముందున్న పిచ్చి మొక్కల వద్దకు వస్తుంది. ఆ మొక్కల మధ్యన ఉన్న ఓ పాత చెప్పును నోటితో బయటికి తీస్తుంది. ముందుగా దాని బరువును బ్యాలెన్స్ చేయలేక కిందపడేస్తుంది. తర్వాత నోటితో చెప్పును గట్టిగా కరుచుకుని.. అక్కడి నుంచి వేగంగా దూసుకెళుతుంది. ఎవరన్నా చెప్పును తీసుకుంటారో అన్న భయంతో అక్కడి వేగంగా పారిపోయి కొంత దూరంలో ఉన్న ఇటుక రాళ్ల మధ్యకు వెళుతుంది. ఇంట్లో ఉన్న వారు అరిచినా పాము చెప్పును పట్టుకుని పారిపోతుంది.
I wonder what this snake will do with that chappal. He got no legs. Unknown location. pic.twitter.com/9oMzgzvUZd
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) November 24, 2022
పాము చెప్పును దొంగతనం చేసిన వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) అధికారి పర్వీన్ కస్వాన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. 'ఈ పాము ఆ చెప్పుతో ఏమి చేస్తుందో అని నేను ఆశ్చర్యపోతున్నాను. దానికి కాళ్లు లేవు. గమ్యం కూడా తెలియదు' అని కామెంట్ చేశారు. ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. వీడియో చూసిన అందరూ పాము చెప్పును తీసుకెళ్లడం ఏంటి అని అవాక్కవుతున్నారు. అదే సమయంలో ఫన్నీ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. గర్ల్ ఫ్రెండ్‌కు గిఫ్ట్ ఇస్తుందేమో, చెప్పుతో పాటూ సాక్సులు కూడా కావాలేమో, పాములు దొంగతనాలు కూడా చేస్తాయా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: BCCI India: టీ20 ప్రపంచకప్ 2022 ఎఫెక్ట్.. టీమిండియా నుంచి పెద్ద తల ఔట్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook.