Swami Om's death: బిగ్ బాస్ ఫేమ్ స్వామి ఓం మృతి

Swami Om passes away: ఢిల్లీ: తనకు తాను దేవుడిగా ప్రకటించుకుని పలు వివాదాల్లో తలదూర్చడంతో పాటు బిగ్ బాస్ 10 సీజన్‌లో కంటెస్టెంట్స్‌లో ఒకరిగా పేరు తెచ్చుకున్న స్వామి ఓం మృతి చెందాడు. మూడు నెలల క్రితం కొవిడ్ బారిన పడిన స్వామి ఓం.. కరోనా నుంచి కోలుకున్నప్పటికీ పక్షవాతం రావడంతో మళ్లీ ఆస్పత్రిపాలయ్యాడు.

Last Updated : Feb 3, 2021, 05:03 PM IST
Swami Om's death: బిగ్ బాస్ ఫేమ్ స్వామి ఓం మృతి

Swami Om passes away: ఢిల్లీ: తనకు తాను దేవుడిగా ప్రకటించుకుని పలు వివాదాల్లో తలదూర్చడంతో పాటు బిగ్ బాస్ 10 సీజన్‌లో కంటెస్టెంట్స్‌లో ఒకరిగా పేరు తెచ్చుకున్న స్వామి ఓం మృతి చెందాడు. మూడు నెలల క్రితం కొవిడ్ బారిన పడిన స్వామి ఓం.. కరోనా నుంచి కోలుకున్నప్పటికీ పక్షవాతం రావడంతో మళ్లీ ఆస్పత్రిపాలయ్యాడు. అలా గత 15 రోజుల నుంచే తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచాడు. స్వామి ఓం మృతి చెందిన విషయాన్ని అతడి కుమారుడు అర్జున్‌ జైన్‌, స్నేహితుడు ముఖేశ్‌ జైన్‌ ధృవీకరించారు.

Also read : Pushpa shooting: ఫ్యాన్స్ మధ్య Allu Arjun.. ఫోటోలు, వీడియో వైరల్..

Bigg Boss Hindi Season 10 లో పాల్గొన్న Swami Om ఆ సీజన్‌లో తన తోటి కంటెస్టంట్స్ పట్ల అమర్యాదగా ప్రవర్తించి వారి ఆగ్రహానికి గురయ్యాడు. కంటెస్టంట్స్ ఫిర్యాదుతో Salman Khan అతడిని బిగ్ బాస్ హౌజ్ నుంచి ఎలిమినేట్ చేశాడు. అంతటితో తన విపరీత ధోరణిని ఆపని స్వామి ఓం... బిగ్ బాస్ హౌజ్ నుంచి వచ్చిన తర్వాత కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌పై, బిగ్ బాస్ నిర్వాహకులపై, బిగ్ బాస్ హోస్ట్ సల్మాన్ ఖాన్‌పై నోరు పారేసుకుని మళ్లీ వార్తల్లోకెక్కాడు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News