Viral Video: చేప ప్రాణాలను కాపాడిన కొంగ.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఘటన..

Viral News: కొంగలు, చెరువులలో, కాలువలలో ఎక్కువగా తిరుగుతుంటాయి. అంతే కాకుండా.. చేపలను వేటాడి తింటాయి. ఇది రోటిన్ గా జరిగేదే. అయితే.. ఇక్కడ  ఒక ఘటన మాత్రం దీనికి రివర్స్ గా మారింది.

Last Updated : Mar 12, 2024, 08:12 PM IST
  • నీళ్లలో విలవిల్లాడిపోయిన చేప..
  • కొంగ చేసిన పనికి షాక్ కు గురౌతున్న నెటిజన్లు
Viral Video: చేప ప్రాణాలను కాపాడిన కొంగ.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఘటన..

Sarus Crane Saves Fish Life Video Viral: సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు తరచుగా వార్తలలో ఉంటాయి. కొన్ని వీడియోలు చూస్తే ఫన్నీగా ఉంటాయి. మరికొన్ని వీడియోలు మాత్రం.. ఆశ్చర్యానికి గురిచేసేవిలా ఉంటాయి. కొన్నిసార్లు జాతీవైరుధ్యం ఉన్న జీవులు ఎంతో ప్రేమతో కలసిమెలసి ఉంటాయి. కోతులు, కుక్కలు, పిల్లులకు అస్సలు పడదని మనకు తెలిసిందే. కానీ.. పిల్లి పిల్లలు, కుక్కపిల్లలతో కలిసి ఉంటాయి. కోతులు, కుక్క పిల్లలను ఆడిస్తుంటాయి. అదేవిధంగా కుక్క పాలను, పందిపిల్లలు తాగుతుంటాయి.

 

ఇలాంటి ఫన్నీ వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ గా మారుతుంటాయి. నెటిజన్లు కూడా ఇలాంటి ఫన్నీవీడియోలను చూడటానికి ఆసక్తి చూపిస్తుంటారు. అచ్చం ఇలాంటి కోవకు చెందిన ఒక వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. 

పూర్తి వివరాలు.. 

కొంగలు చేపలను వేటాడుతుంటాయి. ముఖ్యంగా సమ్మర్ వచ్చిందంటే చాలు.. నీళ్లు తక్కువగ ఉన్న కాలువలు, చెరువుల దగ్గరకు కొంగలు ఎక్కువగా వచ్చి చేరుతుంటాయి. చేపల కోసం కాచుకుని చూస్తుంటాయి. చేప కోసం గంటల తరబడి నీళ్లలో కొంగ జపం చేస్తుంటాయి. ఇది మనకు తెలిసిందే. చేపలు తమ కాళ్ల దగ్గరకు రాగానే వెంటనే తమ నోటితో చేపలను ఇట్టే పట్టేసుకుంటాయి. కానీ ఇక్కడ ఒక కొంగ దానికి పూర్తిగా విరుద్దంగా ప్రవర్తించింది. కాలువలో నీళ్లు తక్కువగా ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చిందో కానీ కొంగలువచ్చాయి.

Read More: Snake Venom: బాప్ రే... పాము విషం ఇంత డెంజరా..?.. కళ్ల ముందే ఆమ్లేట్ లా మారిపోయిన రక్తం.. వైరల్ గా మారిన వీడియో ఇదే..

అక్కడ ఒక చేప.. నీళ్లు తక్కువగా ఉండటంతో, విలవిల్లాడిపోయింది. ఇది గమనించిన కొంగ వెంటనే చేపను నోట్లో కరుచుకుని, నీళ్లు ఎక్కువగ ఉన్న ప్రదేశంలోకి తీసుకెళ్లి పడేసింది. చేపప్రాణాలను కొంగ కాపాడింది. వెంటనే చేప తుర్రున అక్కడి నుంచి నీళ్లలోనికి జారీపోయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఆశ్చర్యంతో నోరెళ్ల బెడుతున్నారు. 
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News