Pushpa Dance Video: సామీ సామీ సాంగ్‌కు ఈ బామ్మ స్టెప్స్‌ ఎలా వేసిందో చూడండి!

Pushpa Movie Viral Dance: ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పుడు మొత్తం పుష్ప మూవీలోని రీల్సే వైరల్ అవుతున్నాయి. క్రికెటర్స్.. సెలెబ్రిటీస్‌.. సామాన్య జనం అందరూ ఇప్పుడు పుష్ప మూవీలోని పాటలకు స్టెప్స్‌ వేస్తూ అదరగొట్టేస్తున్నారు. అలాంటి వీడియోనే ఇది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 2, 2022, 08:53 AM IST
  • అల్లు అర్జున్ పుష్ప మూవీలోని పాటలు, డైలాగ్స్‌కు ఒక రేంజ్‌లో క్రేజ్‌
  • పుష్పలోని పాటలకు, డైలాగ్స్‌కు తెగ రీల్స్ చేసేస్తున్న జనం
  • సామీ సామీ సాంగ్‌కు డ్యాన్స్‌ చేసిన బామ్మ
Pushpa Dance Video: సామీ సామీ సాంగ్‌కు ఈ బామ్మ స్టెప్స్‌ ఎలా వేసిందో చూడండి!

Grandma Dance Viral Video: అల్లు అర్జున్ పుష్ప మూవీలోని పాటలు, డైలాగ్స్‌కు ఇప్పుడు ఒక రేంజ్‌లో క్రేజ్‌ వచ్చింది. పాన్ ఇండియా మూవీగా వచ్చిన పుష్పలోని పాటలకు, డైలాగ్స్‌కు జనాలంతా ఇప్పుడు తెగ రీల్స్ చేసేస్తున్నారు. సోషల్ మీడియాలో అంతటా ఇప్పుడు పుష్ప మూవీలోని పాటలే కనిపిస్తున్నాయి. 

చిన్న పిల్లల దగ్గర నుంచీ పెద్దవాళ్ల దాకా అందరూ పుష్ప మూవీలోని పాటలకు తమదైన స్టైల్‌లో స్పెప్స్‌ వేస్తూ సోషల్ మీడియాలో ఆ వీడియోస్‌ను అప్‌లోడ్‌ చేస్తున్నారు. ఇక ఆ వీడియోలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

తాజాగా పుష్ప మూవీలోని (Pushpa Movie) పాటకు ఒక బామ్మ వేసిన స్టెప్స్‌ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. సామీ సామీ సాంగ్‌కు (Sami Sami Song‌) ఆమె చేసిన డ్యాన్స్ అదిరిపోయింది. ఇక ఈ వీడియోను బింధస్త్ ముల్గి అనే ఇన్‌స్టాగ్రామ్‌ హ్యాండిల్‌ ద్వారా పోస్ట్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

ముంబైకి చెందిన గౌరీ పవార్ తన బామ్మతో (Grandma) కలిసి వీడియోలు రీల్స్ చేయడానికి గ్రామానికి వెళ్లింది. ఇక గౌరీ బామ్మ తమలపాకు వేసుకునే స్టైల్‌.. ఆ తర్వాత ఆమె నడిచే తీరు.. చివరకు సామీ సామీ సాంగ్‌కు ఆమె వేసిన స్టెప్ అదిరిపోయాయి.

 

బామ్మతో కలిసి గౌరీ పవార్ కూడా డ్యాన్స్ చేసింది. ఇక ఈ వీడియోను గౌరీ.. బింధస్త్ ముల్గి ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో అప్‌లోడ్ చేయగా.. నెటిజెన్స్‌ నుంచి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఇక అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప మూవీ 2021 డిసెంబర్​ 17న రిలీజైన విషయం తెలిసిందే. కొవిడ్‌ (Covid‌) సమయంలో కూడా భారీ కలెక్షన్స్ రాబట్టింది ఈ మూవీ. మొత్తానికి పుష్ప మూవీలోని సాంగ్స్‌.. డైలాగ్స్‌తో పాటు అల్లు అర్జున్ (Allu Arjun) మ్యానరిజంపై కూడా ఒక రేంజ్‌లో రీల్స్​ వస్తున్నాయి. ఇవన్నీ సోషల్​ మీడియాలో ఫుల్ వైరల్​ (Viral) అవుతున్నాయి.

Also Read: Aishwarya Dhanush Covid 19: కరోనాతో ఆసుపత్రిలో చేరిన ఐశ్వర్య ధనుష్...

Also Read: Gelatin Sticks: కారులో 1000 జిలెటిన్ స్టిక్స్.. కలకలం రేపిన పేలుడు పదార్థాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News