Pushpa in Exam: ఆన్సర్​ షీట్​లో 'పుష్ప పుష్ప రాజ్​' డైలాగ్​.. వైరల్ అవుతోన్న ఫొటో

Pushpa in Exam: పుష్ప సినిమా అనగానే చాలా మందికి పుష్ప.. పుష్ప రాజ్​ అనే డైలాగ్​ ఎంతో ఫేమస్​ అని అందరికి తెలుసు. ఈ డైలాగ్స్​ను చాలా మంది తమ అవసరానికి తగ్గట్లు వాడుకుంటున్నారు కూడా. తాజాగా ఓ విద్యార్థి ఏకంగా పరీక్ష పేపర్​లోనే ఈ డైలాగ్​ రాశాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 7, 2022, 02:46 PM IST
  • ఆన్సర్​ షీట్​లో పుష్ప డైలాగ్​
  • పరీక్ష రాసేదే లే అంటూ రాసిన విద్యార్థి
  • వైరల్ అవుతున్న పరీక్ష పేపర్​
Pushpa in Exam: ఆన్సర్​ షీట్​లో 'పుష్ప పుష్ప రాజ్​' డైలాగ్​.. వైరల్ అవుతోన్న ఫొటో

Pushpa in Exam: అల్లు అర్జున్​ హీరోగా వచ్చిన పుష్పా మూవీ ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గత ఏడాది డిసెంబర్​లో విడుదలనై ఈ సినిమా పాన్​ ఇండియా లెవల్లో సూపర్​ హిట్​గా నిలిచింది. అది మాత్రమే కాదు సినిమా డైలాగ్స్​, పాటలు గత ఏడాది నుంచి ట్రెండవుతున్న విషయం తెలిసిందే.

సాధారణ ప్రేక్షకులు మొదలుకుని, సినీ, క్రీడా రంగాల ప్రముఖులు సైతం ఈ సినిమాలో పాటలకు స్టెప్పులేయడం, డైలాగ్స్​కు వీడియోలు చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడం చూశాం. అయితే ఇప్పుడు పుష్ప ఫీవర్​ ఎగ్సామ్​కు పాకింది.

ఇంతకీ ఏమైందంటే..

పశ్చిమ్​ బెంగాల్​ల ఓ విద్యార్థి పరీక్ష పేపర్​లో పుష్ప డైలాగ్స్​ రాశాడు. పదవ తరగతి చదువుతున్న ఆ విద్యార్థి ఆన్సర్​ షీట్​లో 'పుష్ప.. పుష్ప రాజ్​.. అపున్​ లిఖేగా నయ్ (పరిష్క రాసేదే లే)' అని ఇంగ్లీష్​లో రాసుకొచ్చాడు.

ఇందుకు సంబంధించిన ఆన్సర్​ షీట్​ను ఉపాధ్యాయుడు సోషల్​ మీడియాలో షేర్ చేశారు. దీనితో ఇప్పుడు ఆ ఫొటో వైరల్ అవుతోంది. అది చూసిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కొందరేమో స్టూడెంట్​పై ఫన్నీ కామెంట్స్​ చేస్తున్నారు. ఆ పేపర్​పై ఆ విద్యార్థి పేరు, రూల్​ నెంబర్ వంటివి లేకుండా జాగ్రత్త పడ్డాడంటూ మరికొందరు ట్వీట్ చేస్తున్నారు.

Also read: Optical Illusion Photo: ఈ చిత్రంలో రెండు వేర్వేరు జీవులు ఉన్నాయి- అవేంటో మీరు తెలుసా?

Also read: Viral Video: వధువు కోపానికి బోరున ఏడ్చేసిన వరుడు- ఏం జరిగిందంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News