Phone Addiction: ఇదేం విడ్డూరం.. చిన్నారిని ఆ పనిచేస్తూ ఫ్రిడ్జీలో పెట్టేసిన తల్లి.. వైరల్ వీడియో..

Smart Phone Addiction: కన్న తల్లి ఫోన్ లో అదేపనిగా మాట్లాడుతుంది. ఇంతలో బిడ్డ హాల్ లో ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో తల్లి ఫోన్ లో ఎంతగా మునిగిపోయిందో ఆమె పూర్తిగా మర్చిపోయింది. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Last Updated : Apr 1, 2024, 12:39 PM IST
  • స్మార్ట్ ఫోన్ కు బానిసైన తల్లి..
  • ఇంట్లోకి వచ్చిన భర్తకు ఊహించని షాక్..
Phone Addiction: ఇదేం విడ్డూరం.. చిన్నారిని ఆ పనిచేస్తూ ఫ్రిడ్జీలో పెట్టేసిన తల్లి.. వైరల్ వీడియో..

Mother Smart Phone Addiction Video Viral On Social Media: ప్రస్తుతం టెక్నాలజీ రోజురోజుకు మారిపోతుంది. స్మార్ట్ ఫోన్ లేనిదే ఒక్క అడుగు తీసి వేయలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో రోజుకు కొత్త అప్‌ డేట్ లు, టెక్నాలజీలు పుట్టుకొస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ లలో కొత్త యాప్ లు కూడా పుట్టగొడుగుల్లా వస్తున్నాయి. అయితే... మొబైల్‌ ఫోన్ వల్ల ఎంతైతే లాభాలు ఉన్నాయో.. అంతే నష్టాలు కూడా ఉన్నాయంటూ కొందరు నిపుణులు తరచుగా సూచిస్తుంటారు. ఇదిలా ఉండగా.. కొందరు ఇళ్లలో వంటలు చేస్తు ఫోన్ మాట్లాడుతుంటారు. దీంతో వంటలో మసాలాలు, ఉప్పు, కారం ఏంవేశారో మర్చిపోతుంటారు. కొందరు ఫోన్ మాట్లాడుకుంటూ.. కనీసం ఒంటి మీద ప్రాపర్ గా దుస్తులు కూడా లేకుండా బైటకు వచ్చిన అనేక ఘటనలు వార్తలలో నిలిచాయి.

 

 

ఇదిలా ఉండగా.. కొందరు ట్రాఫిక్ లలో, వెహికిల్స్ నడిపిస్తు ఫోన్ లు మాట్లాడుకుంటూ వీళ్లు డెంజర్ లో పడిందే కాకుండా.. అవతలి వారిని సైతం ప్రమాదంలో నెట్టేస్తుంటారు. దీంతో కొన్నిసార్లు ప్రాణాలు పోయేటు వంటి ఘటనలు కూడా వార్తలలో నిలిచాయి. కొందరు ఫోన్ లు మాట్లాడుతూ జలపాతాలు, కొండ ప్రాంతాల నుంచి కిందకు పడిపోయిన ఘటనలు కూడా వైరల్ గా మారాయి.

ఇక కరోనా మహమ్మారి మూలంగా ఇంట్లో పిల్లల చదువులన్నీ ఆన్లైన్ అయిపోయాయి. పిల్లకు ఫోన్ లు ఇవ్వాల్సి వచ్చింది. దీంతో చిన్నారులు కూడా ఫోన్ కు అడిక్ట్ అయిపోయారు. ఇంట్లో పిల్లలు తినాలంటూ ఫోన్ లలో ఫన్నీ వీడియోలు, పొగొ లాంటివి పెడితేనే చిన్నారులు తింటున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఒక తల్లి చేసిన ఘనకార్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పూర్తివివరాలు..

ఇంట్లో పిల్లాడు కింద ఆడుకుంటున్నాడు. అతని పక్కనే తల్లి ఫోన్ మాట్లాడుతుంది. ఆమె ధ్యాస అంతా పిల్లాడి కన్నా కూడా ఫోన్ లో అవతల మాట్లాడుతున్న వారి మాటలపైనే ఉంది. తల్లి వెజిటెబుల్స్ కట్ చేస్తుంది. ఇంతలో ఆమె ఒక్కసారిగా లేచీ.. పిల్లాడిని తీసుకుని ఫ్రిడ్జీ డోర్ తీసి అందులో పెట్టేసింది. అసలైతే.. వెజిటెబుల్స్ ను ఆమె ఫ్రిడ్జీలో పెట్టాలనుకుంది. కానీ ఆమె ఫోన్ లో మాట్లాడటంలో మునిగిపోయి వెజిటెబుల్స్ బదులుగా, పిల్లాడిని పెట్టినట్లు తెలుస్తొంది.అప్పడు ఆమె భర్త అక్కడికి వచ్చి పిల్లాడి గురించి ఆరా తీస్తాడు. దీంతో ఇద్దరు అతని కోసం వెతుకుతారు. ఫ్రిడ్జీ నుంచి మూలుగుతున్న సౌండ్ రావడంతో ఒక్కసారిగా డోర్ తీసి చూస్తాడు.

Read More: Teen Girl reel At Airport: ఎయిర్ పోర్టులో యువతి రచ్చ.. లగేజీ ట్రాలీపై పడుకొని రీల్స్.. వైరల్ గా మారిన వీడియో..

ఒక్కసారిగా షాకింగ్ కు గురైన  భర్త.. వెంటనే చిన్నారికి చిన్నారిని బైటకు తీసి సపర్యలు చేస్తాడు. పిల్లాడు.. ఏడుస్తుంటాడు. అతని శరీరమంతా ఒక్కసారిగా చల్లబడిపోయింది. భర్త సమయానికి వచ్చాడని ఆ పిల్లాడు బతికాడు.. లేకుంటే పరిస్థితి ఏంటని తలుచుకుంటే కన్నీళ్లు వస్తున్నాయి. ఈ క్రమంలో భర్త ఆమెను తిట్టిపోస్తాడు. అయితే.. అచ్చం ఇలా జరగకున్న ఇలాంటి విధంగానే ఎందరో ఫోన్ కు అడిక్ట్ అయి తమ పిల్లలు, తమపనులను అశ్రధ్దగా చేస్తున్నారు. అందుకే ప్రజలకు అవగాహాన కల్పించేందుకు ఈ వీడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News