Hindu Priest Inaugurates Mosque: మన భారతీయ సమాజం ఒక సర్వమత సమ్మేళనం అని.. హిందూ, ముస్లింలు భాయ్ భాయ్ అని చాటిచెప్పే మరో గొప్ప ఘటనకు తాజాగా కర్ణాటక వేదికైంది. కర్ణాటకలోని కొప్పల్ జిల్లా కుకనూర్ తాలూకా భానాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇటగి మసీదును సోమవారం హిందూ మతానికి చెందిన స్వామీజీ ప్రారంభించిన ఘటన యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ అని నిత్యం కొలమానం వేసుకుంటున్న సమాజం ఉన్న ఈ రోజుల్లో ఒకరిని ఒకరు పరస్పరం గౌరవించుకుంటే ఎవ్వరూ ఎక్కువ కాదు.. ఎవ్వరూ తక్కువ కాదు.. అందరూ సమానమే అని చాటిచెప్పిన ఆ హిందూ - ముస్లిం మత పెద్దలను యావత్ సమాజం కొనియాడుతోంది.
యలబుర్గా శ్రీధర్ మురుడి మఠానికి చెందిన బసవలింగ శివాచార్య స్వామీజీ, కుకనూరు అన్నదానేశ్వర శాఖామఠానికి చెందిన మహాదేవయ్య స్వామీజీలు ఈ మసీదును ప్రారంభించగా.. హిందూ - ముస్లిం భాయి భాయి అనే మాటను నిజం చేస్తూ వారికి ముస్లిం మత పెద్దలు దగ్గరుండి పూజా కార్యక్రమాల్లో సహాయం అందించిన తీరు, ఆ అద్భుత దృశ్యం ముందు ఏ దృశ్య కావ్యమైనా చిన్నపోవాల్సిందే... ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా అయినా తక్కువే.
ఒక మసీదును స్వామీజీలు ప్రారంభించడంతోనే ఈ అద్భుత ఘట్టానికి తెరపడలేదు. ఈ పూజా కార్యక్రమాల ముగిసిన తరువాత హిందూ సంఘాల నాయకులు స్వామీజీకి పాదాభివందనం చేస్తూ పాద పూజ చేయగా.. ముస్లిం మత పెద్దలు వారికి హారతి, బిల్వపత్రాలు అందిస్తూ సహకరించిన తీరు మాటల్లో వర్ణించలేనిది.
ఈ సందర్భంగా మసీదు ప్రారంభోత్సవంలో పాల్గొన్న బసవలింగ శివాచార్య స్వామీజీ మాట్లాడుతూ, " మన నడవడిక, ప్రవర్తన రాబోయే యువ తరానికి ఆదర్శంగా ఉండాలి. మనందరం అలా జీవించాలి. ఆచరించి చూపించాలి. అప్పుడే కదా సమాజంలో శాంతి నెలకొంటుంది " అని అన్నారు. అలాగే, మహదేవయ్య స్వామీజీ మాట్లాడుతూ, " గ్రామీణ ప్రాంతాల్లో హిందువులు, ముస్లింలు సోదరభావంతో మతసామరస్య భావాన్ని పెంపొందించుకుంటూ అన్ని పండుగలను శాంతియుతంగా జరుపుకుంటారు. అది మనందరికీ గర్వకారణమని చెప్పుకోవచ్చు " అని అభిప్రాయపడ్డారు.
మసీదు ప్రారంభోత్సవంలో పాల్గొన్న ముస్లిం మత పెద్ద ముహమ్మద్ అలీ మాట్లాడుతూ, " ముస్లిం సమాజం శాంతిని, సామరస్యాన్ని కోరుకుంటోందని.. కుకనూరులో తామంతా అన్నదమ్ముల్లా ఉన్నాం కనుకే స్వామీజీని మసీదు ప్రారంభోత్సవానికి ఆహ్వానించాం " అని తెలిపారు.
ఇది కూడా చదవండి : Online Kidnapping: మీ పిల్లల ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెడుతున్నారా ? ఐతే రిస్కే
అన్ని మతాలు ఒక్కటేనని.. మనుషులమంతా ఒక్కటే అనే గొప్ప సందేశాన్ని ఇచ్చేందుకు ఆధ్యులయ్యారు ఇక్కడి ముస్లిం మత పెద్దలు. మసీదు ప్రారంభోత్సవానికి హిందు మత పెద్దలతో పూజలు ఎందుకనుకోకుండా ఈ ఘట్టానికి తొలి అడుగు వేసిన ఆ ముస్లిం మతపెద్దలను అభినందించి తీరాల్సిందే.. అలాగే, వారి ఆహ్వానాన్ని కాదనకుండా ఈ అద్భుతమైన ఘట్టం తమ చేతుల మీదుగా కానిచ్చిన ఆ స్వామిజీలను కూడా కీర్తించి తీరాల్సిందే. అన్నింటికి మించి ఇరుమతాల పెద్దలు ఎలాంటి శషిబిషలకు పోకుండా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా సోదరభావంతో ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం హర్షనీయం, అభినందనీయం.
ఇది కూడా చదవండి : IT Raids On Youtuber Taslim: యూట్యూబ్ నుంచి 1 కోటి సంపాదించిన యూట్యూబర్‌పై ఐడి దాడులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి