వైరల్ వీడియో : 'బాహుబలి 2'లో ప్రభాస్ చేసిన స్టంట్.. రియల్‌గా చేస్తే ఎలా వుంటుంది ?

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రెనె కేస్‌లోస్కీ రియల్ స్టంట్స్ 

Last Updated : May 24, 2018, 11:26 AM IST
వైరల్ వీడియో : 'బాహుబలి 2'లో ప్రభాస్ చేసిన స్టంట్.. రియల్‌గా చేస్తే ఎలా వుంటుంది ?

బాహుబలి 2 సినిమాలో ఏనుగుపై ప్రభాస్ చేసిన స్టంట్స్ ఆడియెన్స్‌ని అబ్బూరపరిచాయి. ఏనుగు మీద నుంచి ప్రభాస్ చేసిన విన్యాసాలు చూసి అభిమానులు ఔరా.. స్టంట్స్ అంటే ఇలాగే వుండాలి అనుకున్నారు. అయితే, అందులో వీఎఫ్ఎక్స్ వర్క్ కూడా వుందనే సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నట్టు అనుకుంటున్నారా ? మరేం లేదు.. ఇదిగో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తే, మీకు కూడా బాహుబలి సినిమాలో ఏనుగు సీన్ గుర్తురాకమానదు. ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు రెనె కేస్‌లోస్కీ. వృత్తిరీత్యా జంతువులకు శిక్షణ ఇవ్వడం రెనె పని. సర్కస్‌లోనూ పర్‌ఫార్మెన్స్‌లు ఇస్తుంటాడు. జంతువులకు శిక్షణ ఇచ్చే పని కావడంతో వాటిని మచ్చిక చేసుకుని వాటితోనే విన్యాసాలు చేయడంలో రెనె దిట్ట. అతడి ఇన్‌స్టాగ్రామ్ ఎకౌంట్ నిండా అటువంటి దృశ్యాలే కనిపిస్తాయి. అందుకే ఇన్‌స్టాగ్రామ్‌‌లో రెనెకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా వుంది.

ప్రస్తుతం రెనె ఏనుగుపై చేసిన పలు విన్యాసాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవేంటో మీరూ ఓ లుక్కేసేయండి మరి. 

 

 

1 or 2 ? 🐘

A post shared by Rene Casselly | Official (@rene_casselly) on

 

 

 

Trust. Love. Respect. 🐘❤️. #animallover #elephant

A post shared by Rene Casselly | Official (@rene_casselly) on

 

Trending News