Cats & Hen Viral Video: కోడి పిల్లలను పెంచుకుంటున్న పిల్లి.. ఆ సీన్ చూసి షాకైన తల్లి కోడి

Cats & Hen Viral Video: ఈ వీడియోలో చిన్న పిల్లి పిల్ల, కోడి చేసిన వింత చేష్టలు ఆ ఇంటి యజమానిని ఆకట్టుకుంటున్నాయి. అదే దృశ్యాన్ని తన మొబైల్ కెమెరాలో బంధించి ఆ వీడియోను సోషల్ మీడియా పోస్ట్ చేశారు. ఈ వీడియో ఆ ఇంటి యజమానినే కాదు.. సోషల్ మీడియాలో వీడియో చూసిన వారిని కూడా విపరీతంగా ఎట్రాక్ట్ చేస్తోంది.

Written by - Pavan | Last Updated : Aug 15, 2023, 09:01 PM IST
Cats & Hen Viral Video: కోడి పిల్లలను పెంచుకుంటున్న పిల్లి.. ఆ సీన్ చూసి షాకైన తల్లి కోడి

Cats & Hen Viral Video: కుక్కలు, పిల్లులు వంటి పెంపుడు జంతువులంటే ఎవరికీ ఇష్టం ఉండదు చెప్పండి. వాటితో ఎంత సమయం గడిపినా అసలు సమయమే తెలియదు. పని ఒత్తిడిలో అలిసిపోయి ఇంటికొచ్చే వారికి పెంపుడు జంతువులు ఒక స్ట్రెస్ బూస్టర్ గానూ పని చేస్తాయి. ఎందుకంటే వాటితో ఆడుకుంటుంటే ఎంత ఒత్తిడిని అయినా ఇట్టే మర్చిపోతుంటాం. అవి చేసే తమాషా పనులు, చిత్ర విచిత్రమైన చేష్టలు మనల్ని కడుపుబ్బా నవ్విస్తాయి. ఇంకొన్నిసార్లు పెంపుడు జంతువులు ఇంట్లో చేసే అల్లరి చేష్టలను చూస్తే.. మనం వాటిని వీడియో తీయకుండా ఉండలేం. అంతేకాదు.. ఆ వీడియోలను మనం మళ్లీ మళ్లీ చూసి మురిసిపోతుంటాం. మన కుటుంబసభ్యులు, స్నేహితులకు చూపించి ఆ దృశ్యాన్ని వారితోనూ పంచుకుని నవ్వుకుంటుంటాం. ఇదిగో ఇప్పుడు మేము మీకు చూపించబోయే వీడియో కూడా అటువంటిదే. 

ఈ వీడియోలో చిన్న పిల్లి పిల్ల, కోడి చేసిన వింత చేష్టలు ఆ ఇంటి యజమానిని ఆకట్టుకుంటున్నాయి. అదే దృశ్యాన్ని తన మొబైల్ కెమెరాలో బంధించి ఆ వీడియోను సోషల్ మీడియా పోస్ట్ చేశారు. ఈ వీడియో ఆ ఇంటి యజమానినే కాదు.. సోషల్ మీడియాలో వీడియో చూసిన వారిని కూడా విపరీతంగా ఎట్రాక్ట్ చేస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజెన్స్ సైతం ఇదెక్కడి వింతరా బాబోయ్ అని నమ్మశక్యం కాన్నట్టుగా మళ్లీ మళ్లీ చూస్తున్నారు. ఇంతకీ ఇందులో అంత నమ్మశక్యం కానంతగా ఏముంది అని అనుకుంటున్నారా ? అయితే ఆ వీడియో ఏంటో మీరే చూసేయండి. 

చూశారు కదా .. ఒక పిల్లి పిల్ల కోడి పిల్లలను తన అక్కున చేర్చుకుని తన కన్న పిల్లల్లా చూసుకుంటోంది. ఆ కోడి పిల్లలు కూడా పిల్లి పిల్ల దగ్గర అచ్చం తమ తల్లి దగ్గర కూర్చున్నంత కంఫర్టుగా కూర్చున్నాయి. ఆ దృశ్యం చూసి ఇదేందయ్యో ఇది.. నేనెక్కడా చూడలేదన్నట్టుగా ఆ పిల్లి పిల్ల ముఖంలో ముఖం పెట్టి చూడటం చూడొచ్చు. అంటే ఆ దృశ్యం చూసి మనకే కాదు.. ఆ కోడికి కూడా ఆశ్చర్యం అనిపించిందన్నమాట. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Cute Cats Of Instagram (@cats_of_day_)

ఇది కూడా చదవండి : Snake In Cauliflower: కాలీఫ్లవర్‌‌లో పాము.. ఒళ్లు జలదరించే షాకింగ్ వీడియో

ఎందుకంటే సర్వసాధారణంగా పిల్లికి, కోడికి మధ్య జాతి వైరం ఉంటుంది. కోడిని చూస్తే పిల్లి పరుగెత్తిస్తుంది. ఇంకా వీలైతే ఆ కోడిని వేటాడి ఆహారం చేసుకుంటుంది. " ఇవాళ మనకు చికెన్ బిర్యానీ దొరికిందిరా మామా " అన్నట్టు పండగ చేసుకుంటుంది. కానీ ఈ వీడియోలో ఉన్న పిల్లి పిల్ల మాత్రం అలా కాదు.. కోడి పిల్లలకు ఎలాంటి హానీ కలిగించకుండా ప్రేమగా చూసుకుంటోంది. అందుకే ఆ సీన్ చూసి కోడే షాక్ అయి చూస్తోంది.

ఇది కూడా చదవండి : Cats Vs Snakes Fighting Videos: పిల్లులకు, పాములకు ఫైటింగ్ జరిగితే ఏది గెలుస్తుంది ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News