Aadhaar Link Issues: పాన్ కార్డుతోనే కాదు పీఎఫ్ ఎక్కౌంట్‌తో కూడా ఆధార్ లింక్ అవసరం, గడువు తేదీ ఎప్పుడంటే

Aadhaar Link Issues: ఆధార్ కార్డు. నిత్య జీవితంలో ప్రతి ఒక్కరికీ ఇది ఆధారమైపోయింది. మీ పాన్ కార్డు, మీ పీఎఫ్ ఎక్కౌంట్‌లతో ఆధార్ కార్డు లింక్ అయిందో లేదో వెంటనే సరి చూసుకోండి. గడువు తేదీ సమీపిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 29, 2021, 09:11 AM IST
Aadhaar Link Issues: పాన్ కార్డుతోనే కాదు పీఎఫ్ ఎక్కౌంట్‌తో కూడా ఆధార్ లింక్ అవసరం, గడువు తేదీ ఎప్పుడంటే

Aadhaar Link Issues: ఆధార్ కార్డు. నిత్య జీవితంలో ప్రతి ఒక్కరికీ ఇది ఆధారమైపోయింది. మీ పాన్ కార్డు, మీ పీఎఫ్ ఎక్కౌంట్‌లతో ఆధార్ కార్డు లింక్ అయిందో లేదో వెంటనే సరి చూసుకోండి. గడువు తేదీ సమీపిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. 

ఆధార్ కార్డును(Aadhaar Card)ప్రతి ఒక్కటితో లింక్ చేయడం ఇప్పుడు అనివార్యమైపోయింది. మీ పాన్ కార్డు, మీ పీఎఫ్ ఎక్కౌంట్‌లు ఆధార్ కార్డుతో అనుసంధానమయ్యాయో లేదో వెంటనే సరి చూసుకోవల్సిన సమయం వచ్చింది. ఒకవేళ లింక్ కాకపోతే వెంటనే చేసుకోండి. ఎందుకంటే గడువు తేదీ సమీపిస్తోంది. ఇదే అంశంపై నెలకొన్న సందిగ్దతకు తెరదించుతూ కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది.

పాన్ కార్డు(Pan Card),ఈపీఎఫ్ ఎక్కౌంట్‌(PF Account)లతో ఆధార్‌ను లింక్ చేసేంందుకు గడువు తేదీ ఎప్పుడు,టెక్నికల్ సమస్యలు వంటివి గత కొద్దికాలంగా వెంటాడుతున్నాయి. యూఐడీఏఐ సిస్టమ్‌లో సమస్యలు తలెత్తుతున్నాయంటూ వస్తున్న వార్తలపై యూఐడీఏఐ స్పందించింది. ఏ విధమైన సాంకేతిక సమస్యల్లేవని తెలిపింది.ఆధార్ లింక్ గడువు తేదీ సమీపించడంతో వివిధ మీడియాల్లో విభిన్న కథనాలు వస్తుండటంతో స్పందించాల్సి వచ్చిందని వివరించింది. ఎన్‌రోల్‌మెంట్, మొబైల్ నెంబర్ అప్‌డేట్ సర్వీసుల్లో కొంత అసౌకర్యం కల్గిన మాట వాస్తవమేనని..ఇప్పుడా సమస్య పరిష్కారమైందని యూఐడీఏఐ(UIDAI)తెలిపింది. ప్రస్తుతం పాన్ కార్డు, పీఎఫ్ ఎక్కౌంట్‌లకు ఆధార్ లింక్‌కు(PF Account link with Aadhaar) ఏ విధమైన సంబంధం లేదని, లింక్ అప్‌గ్రేడేషన్ కొనసాగుతోందని వెల్లడించింది. రోజుకు 5 లక్షలకు పైగా అప్‌గ్రేడ్ చేసుకుంటున్నారని..గత 9 రోజుల్లో 50 లక్షలమంది అప్‌గ్రేడ్ చేసుకున్నారని పేర్కొంది. 

పీఎఫ్ ఎక్కౌంట్‌తో(PF Account)ఆధార్ లింక్ చేసేందుకు చివరి తేదీ సెప్టెంబర్ 1 కాగా, పాన్ కార్డును ఆధార్‌తో(Pan card link with Aadhaar)లింక్ చేసేందుకు చివరి తేదీ మాత్రం సెప్టెంబర్ 30 వరకూ ఉంది. ఈపీఎఫ్ కొత్త నిబంధనల ప్రకారం కచ్చితంగా పీఎఫ్ ఖాతాను ఆధార్‌తో లింక్ చేయాల్సి ఉంటుంది.లేకపోతే పీఎఫ్ ఎక్కౌంట్‌లో జమ చేసే నగదుపై ప్రభావం పడనుంది. 

Also read: Viral videos: చిన్న పిల్లికి ట్రైనింగ్ ఇస్తోన్న తల్లి పిల్లి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News