Leopard On Bengaluru - Bellari Highway: అడవిలో ఉండే చిరుత పులి అడవిలోంచి బయటికొచ్చి హైవేపై బైఠాయించింది. నడి రోడ్డుపై ఏదో ధర్నా చేస్తున్నట్టుగానో.. లేక మీరే నా సామ్రాజ్యంలోకి వచ్చారన్నట్టుగానో ముఖం పెట్టి దర్జాగా కూర్చుంది. అది హైవే కావడంతో అటుగా వచ్చిన వాహనదారులు నడిరోడ్డుపై చిరుత పులిని చూసి దూరంగానే ఆగిపోయారు. రాత్రి వేళ కావడంతో చిరుతపులి రోడ్డుపై కూర్చోవడం గమనించని ద్విచక్ర వాహనదారులు దానికి అతి దగ్గరిగా వచ్చి లైట్ల వెలుతురులో చిరుతపులిని చూసి మళ్లీ వెనక్కిపోతుండటం ఈ దృశ్యంలో చూడొచ్చు. ఏపీలోని అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం, డీ.హీరేహాళ్ మండలం, ఓబులాపురం గ్రామం సమీపంలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
చిరుతపులిని చూసి దూరంగా ఆగిపోయిన వాహనదారులు.. అక్కడి నుంచే తమ మొబైల్ కెమెరాల్లో ఈ దృశ్యాన్ని బంధించారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సుమారు రెండు గంటలపాటు చిరుతపులి అక్కడక్కడే తిరుగుతూ కనిపించింది. దీంతో ఆ మార్గం గుండా వెళ్లే వాహనదారులు, ప్రయాణికులు హడలిపోయారు. చిరుత పులి నడి రోడ్డుపై కూర్చున్న తీరు చూస్తే.. అక్కడి నుంచి వాహనదారులు ఎవ్వరూ అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వెళ్లేందుకు వీల్లేదన్నట్టుగా.. తన ముందుకు వచ్చే వారిపై దూకడానికి సిద్ధంగా ఉందా అన్నట్టుగా ఫోజు పెట్టి కూర్చుని ఉంది.
ఇది కూడా చదవండి : Happiest State In India: ఇండియాలో జనం సంతోషంగా ఉన్న రాష్ట్రం ఏదో తెలుసా ?
అనంతపురం జిల్లాలో బెంగళూరు - బళ్లారి హైవే అటవీ ప్రాంతం మధ్యలోంచి వెళ్తుండటంతో తరచుగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. అనేక సందర్భాల్లో హైవేను ఆనుకుని ఉన్న సమీప గ్రామాల్లోకి కూడా చిరుత పులులు వస్తుండటంతో అక్కడి సమీప గ్రామాల ప్రజలు చిరుత పులి పేరెత్తితేనే హడలిపోతున్నారు. కొన్ని సందర్భాల్లో వ్యవసాయ బావుల వద్ద సైతం చిరుత పులుల సంచారం కనిపించిన సందర్భాలు ఉన్నాయని అక్కడి పరిసర ప్రాంతాల ప్రజలు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి : Monkey Rescues Kitten: మంచితనం తెలిసిన కోతి పిల్ల.. నీ జాలి గుండెకు హ్యాట్సాఫ్.. వైరల్ వీడియో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK