Langur attend classes with students in Government School at Jharkhand: ప్రతిరోజు విద్యార్థులు కూడా బుద్ధిగా పాఠశాలకు వెళ్లని ఈ రోజుల్లో.. అడవుల్లో తిరిగే ఓ కొండముచ్చు మాత్రం ఒక్కరోజు కూడా డుమ్మాకొట్టకుండా వెళుతోంది. అంతేకాదు ఎంతో క్రమశిక్షణతో తరగతి గదిలో కూర్చుని.. ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను శ్రద్ధగా వింటోంది. ఈ ఘటన ఝార్ఖండ్‌లోని హజరిబాగ్‌లో చోటుచేసుకుంది. పిల్లలతో పాటు పాఠాలు వింటున్న కొండముచ్చుకు సంబందించిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వివరాల్లోకి వెళితే... జార్ఖండ్-బిహార్ సరిహద్దుల్లో కొండల నడుమ ఓ ప్రభుత్వ పాఠశాల ఉంది. ఆ పాఠశాలకు ఓ కొండముచ్చు రెగ్యులర్‌గా వస్తోంది. క్లాస్ రూం లోపలికి వచ్చి పిల్లలతో పాటు బుద్ధిగా పాఠాలు వింటోంది. విద్యార్థులు అందరూ టీచర్ చెప్పే పాఠాలను నోట్ చేసుకుంటూ ఉంటే.. ఆ కొండముచ్చు పుస్తకాల్లోకి తొంగి చూస్తోంది. విద్యార్థుల పక్కనే కూర్చుని అన్ని గమనిస్తోంది. ఇక విద్యార్థులు తరగతి బయటకు వెళ్తే.. అది కూడా వారితో పాటే వెళ్తోంది. వారు లోనికి రాగానే కొండముచ్చు కూడా వస్తోంది.
క్లాస్ రూంలో పిల్లలతో కొండముచ్చు చక్కగా ఆడుకుంటోంది. అంతేకాదు వారు పెట్టే ఆహారాన్ని తింటుంది. ఇందుకు సంబందించిన ఫొటోస్, వీడియోను దీపక్ మహతో అనే వ్యక్తి తన ట్విటర్ ఖాతాలో అప్‌లోడ్ చేశాడు. ఈ వీడియోను పంచుకుంటూ.. 'పాఠశాలకు వచ్చిన కొత్త విద్యార్థి. ఈ కొండముచ్చు ఇతర విద్యార్థులతో కలిసి ప్రభుత్వ పాఠశాలలో చదువుతోంది' అని పేర్కొన్నారు. ఈ వీడియోను చూసిన అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ వీడియోకి లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది.
स्कूल में हर दिन बच्चों के साथ क्लास अटेंड करने आ जाता है लंगूर, सुनता है टीचर की बातों को #Jharkhand pic.twitter.com/V3Bg5utokE
— Zee News (@ZeeNews) September 14, 2022
స్కూల్ ప్రిన్సిపాల్ రతన్ కుమార్ వర్మ మాట్లాడుతూ... 'శనివారం ఉదయం కొండముచ్చుపాఠశాలకు మొదటిసారిగా వచ్చి తరగతి గదిలో కూర్చుంది. దాంతో విద్యార్థులు, టీచర్స్ భయపడ్డారు. ఆదివారం పాఠశాలకు సెలవు కావడంతో.. సోమవారం స్కూల్ ఓపెన్ చేయగానే టైంకు తరగతికి వచ్చింది. టీచర్లు దాన్ని చూసి భయపడితే.. అది వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చాము. అది వారికి చిక్కలేదు. బుధవారం ఆ కొండముచ్చు పాఠశాలకు వచ్చి తనకు ఇష్టం వచ్చిన తరగతిలో కూర్చుంది. పిల్లలను మాత్రం ఏం అనడం లేదు' అని చెప్పారు.
Also Read: Roger Binny BCCI: బీసీసీఐ అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ.. కార్యదర్శి జై షానే!
Also Read: Sreemukhi : ఎద అందాల గుట్టురట్టు.. రెచ్చిపోతోన్న శ్రీముఖి.. పిక్స్ వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook