Krait Snakes Video: ఇంట్లో రెండు ప్రమాదకరమైన క్రైట్ స్నేక్‌లు.. రెండింటిని ఒకేసారి పట్టాడు! నీకో దండంరా అయ్యా

Snake catcher caught Two Krait Snakes cleverly. స్నేక్ క్యాచర్ మురళీవాలే హౌస్లా చాలా సులువుగా రెండు ప్రమాదకరమైన క్రైట్ స్నేక్‌లను పట్టుకున్నాడు.   

Written by - P Sampath Kumar | Last Updated : Aug 22, 2022, 03:48 PM IST
  • ఇంట్లో రెండు ప్రమాదకరమైన క్రైట్ స్నేక్‌లు
  • రెండింటిని ఒకేసారి పట్టాడు
  • వీడియో చూస్తే గూస్ బంప్స్ ఖాయం
Krait Snakes Video: ఇంట్లో రెండు ప్రమాదకరమైన క్రైట్ స్నేక్‌లు.. రెండింటిని ఒకేసారి పట్టాడు! నీకో దండంరా అయ్యా

Snake catcher caught Two Krait Snakes very easily at Home: అతిపెద్ద పాముల్లో 'క్రైట్ స్నేక్‌' కూడా ఒకటి. క్రైట్ స్నేక్‌ పేరు వింటేనే చాలా మంది భయపడతారు. అలాంటిది నేరుగా కనిపిస్తే అంతే సంగతులు.. ప్రాణాలు అర చేతిలో పట్టుకుని కిలోమీటరు దూరం పరుగు తీస్తారు.క్రైట్ స్నేక్‌ అత్యంత విషపూరితమైంది కూడా. ఈ పాము కాటుకు ఇప్పటికే చాలా మంది చనిపోయారు కూడా. అందుకే స్నేక్‌ క్యాచర్‌లు కూడా ఈ పామును పట్టుకోవడానికి కాస్త జంకుతుంటారు. అయితే స్నేక్ క్యాచర్ మురళీవాలే హౌస్లా చాలా సులువుగా రెండు పాములను పట్టుకున్నాడు. 

ఒడిశాలోని ఓ పాత ఇంటిలో ప్రమాదకరమైన రెండు క్రైట్ స్నేక్‌లు దూరాయి. ఓ రూమ్‌లోకి దూరడంతో ఇంట్లోని వారు తలపెట్టి.. స్నేక్ క్యాచర్ మురళీవాలే హౌస్లాకు కబురు చేశారు. విషయం తెలుసుకున్న మురళీవాలే.. ఆ ఇంటికి వెళ్ళాడు. డోర్ తీసి చూడగా.. రెండు క్రైట్ స్నేక్‌లు ఉన్నాయి. ఓ దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించగా.. అది పరుగులు పెట్టింది. నెమ్మదిగా రెండింటిని ఒక దగ్గరికి తెచ్చి పట్టుకోవడానికి ప్రయతించగా సాధ్యం కాలేదు. 

మరోసారి రెండు క్రైట్ స్నేక్‌లను ఒక దగ్గరికి తెచ్చిన స్నేక్ క్యాచర్ మురళీవాలే.. స్టిక్ సాయంతో ఓ క్రైట్ స్నేక్‌ తోకను పట్టుకుంటాడు. ఆపై ఇంకో క్రైట్ స్నేక్‌కు కూడా అలానే పట్టుకుంటాడు. బయటకు తీసుకొచ్చిన అనంతరం వాటిని ఓ సంచిలో వేసి పట్టుకుంటాడు. ఆపై ఆ రెండు క్రైట్ స్నేక్‌లను అడవిలో వదిలేస్తాడు. ఇందుకు సంబందించిన వీడియోను మురళీవాలే హౌస్లా తన యూట్యూబ్ ఛానెన్‌లో పోస్ట్ చేశాడు. ఈ వీడియో సంవత్సరం క్రితం అప్లోడ్ చేయబడింది. ఈ వీడియోకు 2,867,701 వ్యూస్ వచ్చాయి. 

Also Read: 25 ఏళ్ల కింగ్ కోబ్రా.. ఎన్ని గుడ్లు పెట్టిందో తెలుసా? బుసలు కొడుతున్నా ఎగ్స్ బయటికి తీసుకొచ్చాడు

Also Read: Shahid Afridi-Kohli: విరాట్ కోహ్లీ భవిష్యత్తుపై షాహిద్‌ అఫ్రిదీ కీలక వ్యాఖ్యలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News