King Cobra Cap Viral Video: మరీ ఇంత కోపమా.. ఈ కింగ్ కోబ్రా కోపానికి ఎవ్వడైనా భయపడాల్సిందే!

Big Snake Viral Video: 16 Feet King cobra playing with Snake Catcher Cap like a Child. 16 అడుగుల కింగ్ కోబ్రా.. స్నేక్ క్యాచర్‌ క్యాప్‌తో చిన్న పిల్లలు ఆడుకున్నట్లు ఆడుకుంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Nov 24, 2022, 05:37 PM IST
  • అచ్చు చిన్న పిల్లల మాదిరే
  • క్యాప్‌తో ఆడుకున్న 16 అడుగుల కింగ్ కోబ్రా
  • వీడియో చివరి వరకు చూడండి
King Cobra Cap Viral Video: మరీ ఇంత కోపమా.. ఈ కింగ్ కోబ్రా కోపానికి ఎవ్వడైనా భయపడాల్సిందే!

16 Feet  King Cobra Viral Video: ఈ భూ ప్రపంచంలో ఎన్నో రకాల పాముల జాతులు ఉన్నాయి. అన్ని పాములు కూడా చెట్లు, పొదలు, పంటపొలాల్లో ఎక్కువగా సంచరిస్తుంటాయి. అక్కడే చిన్న చిన్న కీటకాలు, గుడ్లు, ఎలుకలను వేటాడి తింటుంటాయి. అప్పుడప్పుడు పాములు దారి తప్పి గ్రామాల్లోకి  వస్తుంటాయి. అలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు విషాద సంఘటనలు జరిగితే.. మరికొన్నిసార్లు మాత్రం ఫన్నీ ఘటనలు జరుగుతుంటాయి. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

వీడియో ప్రకారం... ఇండోనేషియాలో ఓ కుటుంబం మొత్తం అన్నం తింటూ ఉంటుంది. అందరూ అన్నం తింటుండగా.. ఒక్కసారిగా 16 అడుగుల కింగ్ కోబ్రా ఇంట్లోకి దూసుకొచ్చింది. దాన్ని చూసిన వారు హడలిపోయి.. అన్నం వదిలేసి పారిపోపోతారు. వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇవ్వగా అతడు హుటాహుటిగా అక్కడికి వస్తాడు. స్నేక్ క్యాచర్‌ పట్టుకోవడానికి ప్రయత్నించగా కింగ్ కోబ్రా ఇల్లు మొత్తం తిరుగుతూ తప్పించుకుంటుంది. ఓసారి స్నేక్ క్యాచర్‌ను కాటేయడానికి మీదికి దూసుకొస్తోంది. అయినా కూడా బెదరని అతడు దాన్ని వెంబడిస్తాడు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook.

 

Trending News