Wild King Cobra Catching Video: మనలో చాలా మంది చిన్నపామును దగ్గర నుంచి చూసినా.. ఆమడ దూరం పరిగెడతాం. ఎక్కడ మన మీద దాడి చేస్తుందోనని భయపడిపోతాం. కానీ ఓ వ్యక్తి మాత్రం భారీ నాగుపామును ఒట్టి చేతులతో పట్టేశాడు. ఏ మాత్రం భయపడకుండా నిర్భయంగా బంధించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను @ _yashhh._illy అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే 35 వేల లైక్‌లు రాగా.. కామెంట్ల వర్షం కురపిస్తూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
పాములలో నాగు పాము డేంజరస్ అంటారు. ఆ పాము పగపట్టడం.. కాటు వేయడం పక్కనపెడితే.. దాన్ని నేరుగా చూడగానే చాలా మంది వెన్నులో వణుకుపుడుతుంది. ఫొటోలు, వీడియోలు కూడా భయపెడతాయి. అయితే చాలా మంది స్నేక్ క్యాచర్‌లు అలవోకగా పట్టేస్తారు. ఎంత పెద్ద పాములు అయినా.. ఎంతో నేర్పరితో బంధించి ప్రజల నుంచి రక్షిస్తారు. ఇటీవల ఇలా స్నేక్ క్యాచింగ్ వీడియో బాగానే హల్‌చల్ చేస్తున్నాయి.
తాజాగా వైరల్ అవుతున్న వీడియో విషయానికి వస్తే.. ఓ వ్యక్తి నాగుపాము వద్దకు చేరుకున్నప్పుడు దాని తల బెదిరింపు భంగిమలో ఉంది. ఈ వీడియో ఉత్కంఠభరితమైన క్షణంతో ప్రారంభమవుతుంది. అతను తన ఒట్టి చేతులతో పామును దాని తోకతో పట్టుకుంటాడు. తన అద్భుతమైన నైపుణ్యంతో నిర్భయంగా పామును బంధిస్తాడు. వీడియో ఇలా ఇంటర్‌నెట్‌లో అప్‌లోడ్ అయిందో లేదో.. క్షణాల్లో వైరల్‌గా మారింది. ఆ అసాధారణ ధైర్యసాహసాలను మెచ్చుకుంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతూ కామెంట్స్ చేస్తున్నారు.
"ఇది నమ్మశక్యంగా లేదు.. నేను విస్మయంలో ఉన్నాను. పూర్తిగా పిచ్చివాడిగా ఉన్నాను." అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. "అతని ధైర్యసాహసాలు మాటలకు అతీతమైనవి.. ఒక అద్భుతమైన వాచ్.. ధన్యవాదాలు." అని మరో నెటిజన్ పేర్కొన్నాడు. "ఇది బాధ్యతారాహిత్యం. ఇటువంటి వీడియోలు ఇతరులను తప్పుదారి పట్టించవచ్చు.. ఇలాంటి ప్రదర్శనల ద్వారా ఎవరూ ప్రభావితం కావద్దు." మరో వీక్షకుడు కోరాడు. మొత్తానికి ఈ భారీ నాగుపాము వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
Also Read: Delhi Air Pollution: ఢిల్లీపై కరుణించిన ప్రకృతి, వర్షం కారణంగా పెరిగిన గాలి నాణ్యత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి