King Cobra Poison Live Video: ఈ పాము సైజు చిన్నదే.. కానీ ప్రాణాంతకరం.. పాయిజన్ చిమ్ముతున్న కింగ్ కోబ్రా LIVE వీడియో చూసేయండి! 

King Cobra Spewing Huge Poison. కింగ్ కోబ్రా కాటేసే సమయంలో ఎక్కువగా విషాన్ని చిమ్ముతుంది. కింగ్ కోబ్రా ఎలా విషాన్ని చిమ్ముతుందో ఈ కింది వీడియోలో చూసేయండి.   

Written by - P Sampath Kumar | Last Updated : Feb 24, 2023, 04:54 PM IST
  • పాయిజన్ చిమ్ముతున్న కింగ్ కోబ్రా
  • లైవ్ వీడియో చూసేయండి
  • నాలుక తోనే వాసన చూస్తుంది
King Cobra Poison Live Video: ఈ పాము సైజు చిన్నదే.. కానీ ప్రాణాంతకరం.. పాయిజన్ చిమ్ముతున్న కింగ్ కోబ్రా LIVE వీడియో చూసేయండి! 

Dangerous King Cobra Spewing Huge Poison Live Video: ప్రపంచంలో అత్యంత పెద్ద, పొడవైన విష సర్పములలో నల్లత్రాచు లేదా రాచనాగు లేదా కింగ్ కోబ్రా ముందువరుసలో ఉంటుంది. ఇది నేల పైన మాత్రమే జీవించగలిగే పాము. సాధారణంగా  కింగ్ కోబ్రా 18.5 అడుగుల (5.7 మీటర్) పొడవు వరకు పెరుగుతుంది. ఇక బరువు సుమారుగా 44 పౌండ్లు (8 కిలోలు) ఉంటుంది. చాలా అరుదుగా మాత్రమే 10 కిలోల బరువు ఉంటుంది. ఫిమేల్ కింగ్ కోబ్రా 20 నుంచి 40 గుడ్లను పెడుతుంది. కింగ్ కోబ్రా జీవిత కాలం 20 సంవత్సరాలు. 

ఇతర పాములను, కొండ చిలువలను కూడా కింగ్ కోబ్రా తింటుంది. గుడ్లు, క్రిమికీటకాలు, కప్పలు, బల్లులు లాంటి వాటిని కూడా తినేస్తుంది. చూడడానికే భీతి గొలిపే కింగ్ కోబ్రా.. సహజంగా ఎవరి కంటబడానికి ఇష్టపడదు. కోబ్రా జాతి పాముల వలె.. కింగ్ కోబ్రా తన పొడవులో మూడవ వంతు వరకు పడగ ఎత్తగలదు. దేన్నైనా ఎదుర్కోవాల్సి వచ్చినపుడు పడగ పైకెత్తి బుస కొడుతుంది. బరి కింగ్ కోబ్రా పడగ పైకెత్తితే.. ఆరు అడుగుల ఎత్తుండి ఎదురుగా నిలిచిన మనిషి కళ్ళలోనికి ఉగ్రంగా చూస్తుంది.

చైనా, మలేసియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, ఆగ్నేయ ఆసియా, భారత్ దేశాలలోని దట్టమైన అరణ్యాలలో కింగ్ కోబ్రా జీవిస్తుంది. చుట్టూ సెలయేళ్ళు, చెరువులు ఉన్న ప్రదేశాలలో నివసించడానికి ఎక్కువ ఆసక్తి చూపుతుంది. అయితే అడవులను నరికి వేయడముతో కొన్ని ప్రాంతాలలో ఈ పాముల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఇతర పాముల వలెనే కింగ్ కోబ్రా కూడా తన నాలుక తోనే వాసన చూస్తుంది. ఇతర జీవుల నుంచి వచ్చే వాసనను తనలోని ఘ్రాణేంద్రియాల ద్వారా గ్రహిస్తుంది. ఆహారం దగ్గరలో ఉన్నప్పుడు తన నాలుకను బయటకు, లోనికి అంటూ ఎంత దూరంలో ఉందో పసిగడుతుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News