Rupees 1000 Per Hour: అట్లుంటది మరీ.. పార్కింగ్ చార్జీ గంటకు రూ. 1000.. ఎక్కడో తెలుసా..?

Bengaluru Parking Fees: మెట్రోపాలిటన్ నగరం కర్ణాటకలో ట్రాఫిక్ రద్దీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కడ ప్రతిరోజు వేలాది వాహనాలు రోడ్డుపైకి వస్తున్నాయి. దీంతో రోడ్లపై ఎక్కడ చూసిన ట్రాఫిక్ సమస్య నెలకొని ఉంటుంది. వాహనాలు పార్కింగ్ చేసేందుకు అక్కడ ఇష్టమున్న వాళ్లు, ఇష్టమున్న డబ్బులను డిమాండ్ చేస్తున్నారు. 

Last Updated : Mar 6, 2024, 12:10 PM IST
  • బెంగళూరులో భారీగా పెరిగిపోతున్న ట్రాఫిక్..
  • రూ. వెయ్యి పార్కింగ్ ఫీజుగా వసూలు చేస్తున్న మాల్స్..
 Rupees 1000 Per Hour: అట్లుంటది మరీ.. పార్కింగ్ చార్జీ గంటకు రూ. 1000.. ఎక్కడో తెలుసా..?

Malls In Bengaluru Charges Rs 1000 As Parking Fees: రోజు రోజుకు వాహనాలు రద్దీ రోడ్ల మీద పెరిగిపోతుంది. ప్రతి ఒక్కరు టూవీలర్, కార్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.  తమ ఇంటి నుంచి ఆఫీసులకు వెళ్లడానికి ఎక్కువ మంది సొంత వాహనాలను ఉపయోగిస్తున్నారు. దీంతో రోడ్లన్ని ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ తో సమస్య నెలకొనిఉంటుంది. ఇక.. బెంగళూరులో ట్రాఫిక్ సమస్య మరీ ఘోరంగా ఉంది. అక్కడ సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఎక్కువగా ఉండటం, ఐటీ కంపెనీలు కూడా చాలా ఉన్నాయి. 

Read More: Viral Video: లేడీ కండక్టర్ ను పట్టుకుని దున్నపోతు మొహందానా.. అంటూ పచ్చి బూతులు.. వైరల్ వీడియో...

అక్కడ ట్రాఫిక్ సమస్య గురించి, అధికారులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. షాపింగ్ మాల్స్, దుకాణాల వద్ద సరైన పార్కింగ్ ఫెసిలిటీ కూడా లేదు. అక్కడ ప్రజలకు ట్రాఫిక్ తో నిత్యనరకం అనుభవిస్తారు. కొందరు దీన్ని తమ ఆదాయవనరుగా ఉపయోగించుకుంటున్నారు. కొన్ని చోట్ల కేవలం గంటకు టూవీలర్ కు, కార్లకు భారీగా పార్కింగ్ ఫీజులను రాబడుతున్నారు. దీంతో ప్రజలు ట్రాఫిక్ చార్జీలు బాదుడుతో బెంబెలెత్తిపోతున్నారు. 

కొన్ని చోట్ల వాహనాలకు రూ. 1000కూడా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన బోర్డులు సైతం బహిరంగానే పెడుతున్నారు. అయిన కూడా ట్రాఫిక్ పోలీసులు ఈ ఘటనలను పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. కొందరు ఇక తప్పని పరిస్థితులలో పార్కింగ్ ఫీజు వెయ్యిరూపాయలను ఇస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని మాల్స్ లలో ప్రత్యేకంగా పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Read More: Pooja Hegde: హాట్ ఫోటోషూట్స్‌తో పూజా హెగ్డే రచ్చ.. బుట్టబొమ్మ అందాలకు ఫ్యాన్స్ ఫిదా..

2015 లో గంటలకు రూ. 40 చొప్పున పార్కింగ్ ఫీజు వసూలు చేసేవారు. కానీ ఇప్పుడు వాహనాల సంఖ్య పెరగడంతో , పార్కింగ్ కూడా ఒక బిజినెస్ లాగా మారిపోయిందని అక్కడి వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పోలీసులు పార్కింగ్ చార్జీలను నిర్ణయించాలని, అధికంగా వసూలు చేసేవారిపైన చర్యలు తీసుకొవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
 

Trending News