Kala Chashma Viral Video: హిందీ పాటకు ఆఫ్రికా పిల్లల డాన్స్.. వీడియో చూస్తే మైండ్ బ్లాక్ అవుద్ది!

African Boys Dance To Kala Chashma song, Video Goes Viral. గతంలో ఐకాన్ స్టార్  అర్జున్ 'పుష్ప' సినిమాలోని పాటలకు స్టెప్పులేసిన ఆఫ్రికా పిల్లలు.. తాజాగా బాలీవుడ్‌ బ్యూటీ కత్రీనా కైఫ్ పాటకు డాన్స్ చేశారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Aug 27, 2022, 02:59 PM IST
  • హిందీ పాటకు ఆఫ్రికా పిల్లల డాన్స్
  • వీడియో చూస్తే మైండ్ బ్లాక్ అవుద్ది
  • పిల్లల డ్యాన్స్‌కు ఫిదా అయిన కేటీఆర్
Kala Chashma Viral Video: హిందీ పాటకు ఆఫ్రికా పిల్లల డాన్స్.. వీడియో చూస్తే మైండ్ బ్లాక్ అవుద్ది!

African Boys Dance To Katrina Kaifs Kala Chashma song: ఆఫ్రికా పిల్లలకు చాలా టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్‌ను సమయం, సందర్భం వచ్చినపుడల్లా ప్రపంచానికి చూపిస్తూనే ఉన్నారు. ప్రపంచంలోని పలు పాటలకు డాన్స్ చేస్తూ సత్తాచాటుతున్నారు. ముఖ్యంగా భారతీయ సినిమాలకు డాన్స్ చేసి అబ్బురపరుస్తున్నారు. ట్రెండీ సాంగ్స్‌కి రీల్స్ చేస్తూ నిత్యం సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. గతంలో ఐకాన్ స్టార్  అర్జున్ 'పుష్ప' సినిమాలోని పాటలకు స్టెప్పులేసిన ఆఫ్రికా పిల్లలు.. తాజాగా బాలీవుడ్‌ బ్యూటీ కత్రీనా కైఫ్ పాటకు డాన్స్ చేశారు. 

సిద్దార్థ్ మల్హోత్రా, కత్రీనా కైఫ్ జంటగా నటించిన ఈ చిత్రం 'బార్ బార్ దేకో' 2016లో విడుదల అయిన ఈ సినిమాలోని పాట 'కాలా చష్మా' చాలా ఫేమస్ అయింది. ఈ పాటలో కత్రీనా అదిరే స్టెప్పులతో అదరగొట్టారు. ఇదే పాటకు ఉగాండాకు చెందిన పిల్లలు డాన్స్ చేశారు. ఓ డజను మందికి పైగా పిల్లలు కాలా చష్మా పాటకు అదిరే స్టెప్పులు వేశారు. పిల్లలు అందరూ ఒకే రిథమ్‌లో అద్భుతంగా డ్యాన్స్ చేశారు. అందరూ బాగానే చేసినా.. ఓ పిల్లాడు బాగా హైలెట్ అయ్యాడు. 

ఆఫ్రికా పిల్లలకు సంబందించిన డాన్స్ వీడియోను 'ఏవియేటర్ అనిల్ చోప్రా' అనే వినియోగదారు శుక్రవారం ట్విట్టర్‌లో షేర్ చేశారు. దాంతో ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. ఒక రోజులో ఈ వీడియో 1.6 మిలియన్లకు పైగా వ్యూస్ మరియు 73,000 లైక్‌లను సంపాదించింది. తెలంగాణ ఐ‌టి శాఖల మంత్రి కేటీఆర్‌ కూడా పిల్లల డ్యాన్స్‌కు ఫిదా అయిపోయారు. ఆ వీడియోని తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. 'మీ ముఖాల్లో తప్పకుండా చిరునవ్వు ఉంటుంది. ఈ పిల్లలు అద్భుతమైన నృత్యకారులు. ఈ ఆఫ్రికన్ పిల్లల డ్యాన్స్ చూస్తే.. ఫిదా కాకుండా ఉండలేరు' అని పేర్కొన్నారు.   

Also Read: JP NADDA MEETING LIVE UPDATES: బీజేపీలోకి క్రికెటర్ మిథాలీ రాజ్! జేపీ నడ్డాతో కీలక సమావేశం..

Also Read: సినిమా కాదు.. ఒళ్ళు గగుర్పొడిచే రియల్ సీన్! మొసళ్ల మధ్యలో బాలుడు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News