Viral Video: ఒక్కోసారి ఊహించని పరిణామాలు జరుగుతుంటాయి. అంతవరకూ క్షేమంగానే ఉండి అంతలో ఇబ్బందుల్లో పడే పరిస్థితులుంటాయి. ఆ ఐదుగురు అలాగే మాట్లాడుకుంటూనే..ఒక్కసారిగా మాయమైపోయారు..ఏమైంది వారికి..
ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని జైసల్మేర్ సమీపంలోని బాబా బావ్డీ ప్రాంతంలో జరిగింది. ఏప్రిల్ 7వ తేదీ రాత్రి జరిగిన ఘటన ఇది. ఊహించని పరిణామమిది. ఈ వీడియోనే ఇప్పుడు వైరల్ అవుతోంది. వీడియోలో ఓ ఐదుగురు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు. ఒక్కసారిగా మాయమైపోతారు. అదేంటని ఆశ్చర్యంగా అన్పిస్తోందా..నిజమే అసలేం జరిగిందంటే...
జైసల్మేర్‌కు చెందిన ఈ వీడియోలో అదొక వర్క్‌షాప్. ఇక్కడ ఓ నలుగురు వ్యక్తులు క్లోజ్‌గా నిలుచుని మాట్లాడుకుంటుంటే..మరో వ్యక్తి పక్కనే కూర్చుని పని చేసుకుంటున్నాడు. పక్కనే ఓ బైక్ ఉంది. ఒక్కసారిగా ఆ ఐదుగురు కిందకు కూరుకుపోయారు. ఆపై అక్కడున్న బైక్ పడిపోయింది. మాట్లాడుకుంటూ ఉండగానే ఆ ఐదుగురు లోపలకు కూరుకుపోయి పడిపోయింది ఓ కాలువలో. ఇదంతా అక్కడున్న సీసీటీవీలో స్పష్టంగా రికార్డైంది. ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.
వాస్తవానికి ఆ ఐదుగురు నిలుచుని మాట్లాడుకుంటున్న ప్రాంతం ఓ కాలువపై ఉన్న స్లాబ్. అది ఒక్కసారిగా కిందకు కూలిపోవడంతో ఆ ఐదుగురు కిందకు పడిపోయారు. అదృష్టమేంటంటే ఆ కాలువ అంత లోతుగా లేకపోవడం, పెద్దగా నీళ్లు లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. చిన్న చిన్న గాయాలతో అందరూ క్షేమంగా బయటపడ్డారు. ఈ ఘటన నేపధ్యంలో కాలువపై నిర్మించిన స్లాబ్ నాణ్యతపై ప్రశ్నలు విన్పిస్తున్నాయి. ఒకవేళ కాల్వలో ఆ సమయంలో ప్రవాహం ఎక్కువగా ఉండి ఉంటే పరిస్థితి ఏంటనే వాదన విన్పిస్తోంది. ఏదేమైనా ఆ ఐదుగురు అదృష్టవశాత్తూ బతికి బయటపడ్డారు. ఆ వీడియో మీ కోసం..
Rajasthan: 5 men fall into a drain in Jaisalmer#Viral #news #journalist #AnuragSason
For more news #SubscribeNow https://t.co/DiLNy8iN1T pic.twitter.com/i33AkFTSiQ— Journalist Anurag K Sason (@AnuragSason) April 13, 2022
Also read: Tricky Question: ఈ చిత్రంలో ఉన్న గ్లాసుల్లో ఏది త్వరగా నీటితో నిండిపోతుంది?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook