Viral Video of Bride Slaps Groom : సోషల్ మీడియాలో ఓ పెళ్లి వీడియో వైరల్‌గా మారింది. స్టేజీపై దండలు మార్చుకునే సమయంలో ఓ వధువు వరుడి చెంప చెల్లుమనిపించింది. ఏకంగా మూడు సార్లు అందరి ముందు అతని చెంపపై లాగి కొట్టింది. ఆపై స్టేజీ దిగి వెళ్లిపోయింది. వధువు చేసిన పనికి పెళ్లి కొడుకు బిత్తరపోగా... పెళ్లికి వచ్చిన అతిథులంతా నోరెళ్లబెట్టారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. జలౌన్ జిల్లా చమారీ గ్రామానికి చెందిన రీనా అనే యువతికి, హమీర్‌పూర్‌కి చెందిన రవికాంత్ అహిర్వార్ అనే యువకుడికి ఇటీవల పెళ్లి జరిగింది. పెళ్లి వేడుకలో భాగంగా జయమాల వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేజీపై వధూవరులు దండలు మార్చుకునే సమయంలో వరుడికి వధువు ఊహించని షాకిచ్చింది. వరుడు తన మెడలో దండ వేయబోతుండగా వధువు అతని చెంప చెల్లుమనిపించింది. వరుసగా మూడు, నాలుగుసార్లు అతని చెంప చెడామడా వాయించేసింది.
ఆపై కోపంతో స్టేజీ దిగి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పెళ్లి కొడుకు తాగి ఉన్నందుకే వధువు అతన్ని చెంప దెబ్బ కొట్టిందని చెబుతున్నారు. పెళ్లి ఇష్టం లేక వధువు అలా చేసిందనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఆ గొడవ తర్వాత వధువుకు ఆమె కుటుంబ సభ్యులు నచ్చజెప్పడంతో పెళ్లి తంతు పూర్తయినట్లు తెలుస్తోంది.
● A #video has surfaced in which a bride can be seen slapping the groom in #Hamirpur
● As per reports, the groom was in a drunken state that's why the bride took this step pic.twitter.com/C5Cg5zjQSj— Taaza TV (@taazatv) April 18, 2022
Also Read: Flipkart Realme 8S 5G: రూ.5 వేలకే Realme 8S 5G స్మార్ట్ ఫోన్.. త్వరపడండి!
The Kashmir Files OTT: ఇక ఓటీటీలో కశ్మీర్ ఫైల్స్.. ఏ ప్లాట్ఫామ్లో రానుందంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook