Girls Dance Video: ఊ అంటావా పాటకు ఉత్తరాది అమ్మాయిల బెల్లీ డ్యాన్స్ మామూలుగా లేదుగా..వీడియో వైరల్

Girls Dance Video: పుష్ప పాటల మేనియా ఇంకా వదల్లేదు. ఉత్తరాదిన ఆ పాటల జోరు, డ్యాన్స్ ఇంకా కొనసాగుతోంది. ఓ వేడుకలో ఆ ముగ్గురు అమ్మాయిలు చేసిన బెల్లీ డ్యాన్స్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 28, 2022, 09:10 PM IST
Girls Dance Video: ఊ అంటావా పాటకు ఉత్తరాది అమ్మాయిల బెల్లీ డ్యాన్స్ మామూలుగా లేదుగా..వీడియో వైరల్

Girls Dance Video: పుష్ప పాటల మేనియా ఇంకా వదల్లేదు. ఉత్తరాదిన ఆ పాటల జోరు, డ్యాన్స్ ఇంకా కొనసాగుతోంది. ఓ వేడుకలో ఆ ముగ్గురు అమ్మాయిలు చేసిన బెల్లీ డ్యాన్స్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. 

అల్లు అర్జున్ సినిమా పుష్ప విడుదలై చాలా కాలం కావస్తున్నా..ఆ సినిమా పాటల ప్రభావం ఇంకా అలానే ఉంది. పుష్ప పాటలకు ముఖ్యంగా సమంత ఐటమ్ సాంగ్ ఊ అంటావా పాటకు డ్యాన్స్ క్రేజ్ ఇంకా హల్‌చల్ చేస్తూనే ఉంది. ఈ సినిమా పాటలకు చేస్తున్న డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇదే క్రమంలో ఓ వేడుకలో ముగ్గురు అమ్మాయిలు చేసిన బెల్లీ డ్యాన్స్ వీడియో బాగా వైరల్ అవుతోంది. ఊ అంటావా మావా పాటకు చేసిన బెల్లీ డ్యాన్స్ అందర్నీ ఆకట్టుకుంటోంది. మళ్లీ మళ్లీ చూసేలా చేస్తోంది. చీరకట్టులో నడుము ఊపుతూ చేసిన బెల్లీ డ్యాన్స్ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ముగ్గురు యువతుల డ్యాన్స్ మీరు కూడా చూడవచ్చు. ఓ వేడుకలో నిర్వహించిన డ్యాన్స్ ఛాలెంజ్‌లో చీరకట్టులో ముగ్గురు అందమైన అమ్మాయిలు..పుష్ప సినిమాలోని ఊ అంటావా పాటకు బెల్లీ డ్యాన్స్ ప్రారంభిస్తారు. చుట్టూ పెద్ద సంఖ్యలో మహిళలు, అమ్మాయిలు కోరస్ ఇస్తూ..ప్రోత్సహిస్తూ..కెమేరాల్లో చిత్రీకరిస్తుంటే ఆ అమ్మాయిలు రెచ్చిపోయి చేసిన డ్యాన్స్ అందర్నీ పిచ్చెక్కిస్తోంది. అమ్మాయిల హావభావాలు, సోయగాలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.

ఈ డ్యాన్స్ వీడియో ట్వట్టర్ వేదికపై షేర్ కాగానే పెద్ద ఎత్తున లైక్స్, కామెంట్స్, వ్యూస్ లభిస్తున్నాయి. పోస్ట్ చేసిన గంటల్లోనే వేలాది వ్యూస్ లభించాయి. 

Also read: Elephant vs Lionesses video: ఒంటరి ఏనుగు, 14 సింహాల పోరాటం, చివరికి గెలిచిందెవరు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News