Momos: భార్యాభర్తల మధ్య 'మోమోస్‌' చిచ్చు.. విడాకులివ్వాలని కేసు పెట్టిన భార్య

Viral Incident: అన్యోన్యంగా ఉన్న దంపతుల మధ్య 'మోమోస్‌' చిచ్చు రేపింది. అది కాస్త చినిగి చినిగి విడాకుల దాకా చేరింది. ఈ కేసును చూసి పోలీసులు విస్తుపోయారు. ఈ సంఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 27, 2024, 11:45 AM IST
Momos: భార్యాభర్తల మధ్య 'మోమోస్‌' చిచ్చు.. విడాకులివ్వాలని కేసు పెట్టిన భార్య

Momos Wife Case: వారిద్దరికీ కొన్నాళ్ల కిందట వివాహమైంది. కొత్తగా పెళ్లవడంతో ఆ దంపతులు అన్యోన్యంగా ఉన్నారు. భార్య అడిగిందే తడువుగా ఏది అడిగితే అది తెచ్చి ఇచ్చేవాడు. ఎంతో ప్రేమతో.. ఆప్యాయంగా భార్య అడుగుతుండడంతో అన్ని తెచ్చి పెట్టేవాడు. ఈ క్రమంలోనే భార్యకు ఎంతో ఇష్టమైన 'మోమోస్‌' రోజు తెచ్చి ఇచ్చేవాడు. అయితే కొన్ని రోజులకు అవి తీసుకురావడం మానేశాడు. దీంతో ఆ భార్యాభర్తల మధ్య గొడవ మొదలైంది. మోమోస్‌ ఎందుకు తీసుకురావడం లేదని భార్య గొడవకు దిగింది. ఆ కారణంగా ఆమె అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమె విడాకులు ఇప్పించాలని పోలీసులను ఆశ్రయించడంతో అందరూ విస్తుపోయారు. కేసును స్వీకరించిన పోలీసులు ఆ కొత్త దంపతులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఈ సంఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇది ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

Also Read: Road Kalyanam: అంగరంగ వైభవంగా 'రోడ్డు' పెళ్లి.. మీరు చదివేది నిజమే రోడ్డుకు పెళ్లి

 

ఆగ్రా జిల్లా పినహాట్‌కు చెందిన ఓ యువకుడికి మల్పూరా గ్రామానికి చెందిన ఓ యువతితో గతేడాది వివాహం జరిగింది. అత్తగారింటికి వచ్చాక ఈ కొత్త జంట ఎంతో ప్రేమగా.. అన్యోన్యంగా జీవిస్తున్నారు. ఈ సమయంలో చిరు తిండి అయిన మోమోస్‌ అంటే భార్యకు చాలా ఇష్టం. దీంతో భర్త అడిగినప్పుడల్లా మొమోస్‌ తీసుకువస్తుండేవాడు. ఇలా రోజు అడుగుతుండడంతో తీసుకొస్తున్నాడు. తరచూ ఇదే జరుగుతుండడంతో భర్తకు విసుగొచ్చింది. కొన్ని రోజులకు మోమోస్‌ తీసుకురావడం మానేశాడు. తన ఉద్యోగం ముగిసిన తర్వాత ఇంటికి వచ్చేప్పుడు మోమోస్‌ తీసుకురాకపోవడంతో భార్య గొడవకు దిగింది. తరచూ ఇలాగే జరుగుతుండడంతో భార్య భర్తను వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. వెళ్లడమే కాకుండా ఇదే విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Also Read: Anchor Kidnap: కిడ్నాప్‌ కేసులో భారీ ట్విస్ట్‌.. 'జరిగింది ఇది' అంటూ యాంకర్‌ లేఖ విడుదల

ఫిర్యాదులో ఆమె రాసిన కారణం చూసి పోలీసులు అవాక్కయ్యారు. 'నా భర్త మోమోస్‌ తీసుకురావడం మానేశాడు' అని యువతి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసును పరిశీలించిన పోలీసులు భార్యాభర్తలను ఇద్దరినీ స్టేషన్‌కు పిలిపించారు. వారి సమస్య తెలుసుకున్నారు. అనంతరం వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఈ సమయంలో ఆమె ఎంతకీ బెట్టు వీడలేదు. తనకు రోజు మోమోస్‌ తీసుకురావాల్సిందేనని పోలీసుల ముందే స్పష్టం చేసింది. ఎవరు ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు. 'పని ఒత్తిడి, ఆలస్యం, ఇంటికి త్వరగా రావడం వంటి కారణాలతో మోమోస్‌ తీసుకురావడం మరచిపోతున్నా' అని భర్త పోలీసులకు వివరించాడు. 

 

ఈ విషయాలన్నీ విన్నా కూడా ఆ యువతి వినిపించుకోలేదు. తనకు రోజూ మోమోస్‌ తీసుకువస్తేనే భర్త వెంట వెళ్తానని తేల్చిచెప్పింది. దీంతో పోలీసులు సమస్య పరిష్కరించలేక తలపట్టుకున్నారు. ఇక చివరికి మధ్యేమార్గంగా పోలీసులు ఒక ప్రతిపాదన చేశారు. 'వారానికి రెండుసార్లు తప్పకుండా మోమోస్‌ తీసుకురావాలి' అని భర్తకు చెప్పారు. ఈ ప్రతిపాదనతో యువతి కొంత వెనక్కి తగ్గింది. ఈ ప్రతిపాదనకు అంగీకరించి భర్తతో వెళ్తానని ప్రకటించింది. వారిద్దరి మధ్య సయోధ్య కుదరడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 'ఏంట్రా మహిళలు ఇలా తయారయ్యారు' అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 'భర్త కన్నా మోమోస్‌ ఎక్కువయ్యాయా తల్లీ' అని ప్రశ్నిస్తున్నారు. 'అలాంటి భార్యతో ఎందుకు బ్రో.. విడాకులు ఇచ్చేయ్‌' అని కొందరు సూచనలు చేస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News