Father Kills Daughter: బిడ్డ చేతే సూసైడ్ నోట్స్ రాయించాడు.. తెలివిగా డ్రామా ఆడి ఉరి తీశాడు

Father Kills Daughter with Suicide drama: నువ్వు సూసైడ్ చేసుకున్నట్టు నటించు చాలు.. వారికి గుణపాఠం వచ్చేలా మిగతా కథంతా తాను ముందుండి నడిపిస్తానని కూతురిని నమ్మించాడు. తండ్రి చెప్పిన మాటలు నమ్మిన కూతురు అతడు చెప్పినట్టే చేసింది. సూసైడ్ నోట్స్ రాసిన అనంతరం సీలింగ్ ఫ్యాన్ కి ఉరేసుకుని నటించే ఫైన్ సీన్ చేస్తున్నాను అనుకుంది.

Written by - Pavan | Last Updated : Nov 14, 2022, 09:59 PM IST
  • తాను రాసుకున్న స్క్రిప్ట్ ఒకటి.. కూతురికి చెప్పిన స్క్రిప్ట్ మరొకటి..
  • పోలీసులను సైతం బురిడీ కొట్టించి ఆ నేరాన్ని మరొకరిపై వేసిన ఘనుడు
  • అసలు దొంగ ఎలా దొరికాడంటే.. అంతు చిక్కని ప్రశ్నకు జవాబేది..
  • సినిమాను తలపించే రియల్ క్రైమ్ స్టోరీ..
Father Kills Daughter: బిడ్డ చేతే సూసైడ్ నోట్స్ రాయించాడు.. తెలివిగా డ్రామా ఆడి ఉరి తీశాడు

Father Kills Daughter with Suicide Drama: ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనే కోణంలో స్కెచ్ వేశాడు. కన్న కూతురిని చంపడంతో పాటు.. ఆ నేరాన్ని తనకు ఎవరిపైనైతే కోపం ఉందో వారిపైనే నెట్టేసి వారిపై కూడా ప్రతీకారం తీర్చుకోవాలని ప్లాన్ చేశాడు. దాదాపు పోలీసులను కూడా నమ్మించాడు. పోలీసులు సైతం అతడి ప్లాన్ గురించి తెలియక అతడి ట్రాప్ లో పడి అమాయకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కానీ కుట్రపూరితమైన తన ప్లాన్ ని అమలు చేయడంలో తనకు తెలియకుండానే ఓ పొరపాటు చేసి అసలు నేరస్తుడు అడ్డంగా దొరికిపోయాడు. సీన్ కట్ చేస్తే.. ఇప్పుడు తానే కటకటాల వెనుక ఊచలు లెక్కబెడుతున్నాడు.  రెండో భార్యతో పాటు మరో నలుగురు సమీప బంధువులపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న అతడి ప్లాన్ బెడిసికొట్టింది. అచ్చం సినీ ఫక్కీలో స్కెచ్ వేసి మరీ కన్నబిడ్డను హత్య చేసిన ఈ ఘటన ఎక్కడ జరిగిందో చూద్దాం రండి.

నువ్వు నటించు.. మిగతాది నేను చూసుకుంటానన్నాడు..
నాగపూర్‌కి చెందిన 40 ఏళ్ల వ్యక్తికి సంబంధించిన రియల్ స్టోరీ ఇది. అతడి మొదటి భార్య 2016 లో ఆత్మహత్య చేసుకుంది. రెండో భార్య ఇంట్లో నుండి వెళ్లిపోయింది. ఇద్దరు బిడ్డలతో కలిసి ఉంటున్న ఆ మనిషికి టీనేజీకి వచ్చిన పెద్ద బిడ్డ కూడా ఎందుకు భారమైందో తెలియదు కానీ ఆమెని హత్య చేసి ఆ నేరాన్ని తన రెండో భార్యతో పాటు ఆమె తల్లిగారింటిమీదే వేయాలనుకున్నాడు. అందుకు తగిన పథకం వేశాడు. చూడ్డానికి అచ్చం డ్రామాలా ఉండేలా తన బిడ్డ చేతే సూసైడ్ నోట్స్ రాయించాడు. ఐదు సూసైడ్ నోట్స్ రాయించి తన సూసైడ్‌కి వారే కారణం అనే నమ్మించేలా తన రెండో భార్యతో పాటు మరో నలుగురు సమీప బంధువుల పేర్లు రాయించాడు. 

తాను రాసుకున్న స్క్రిప్ట్ ఒకటి.. కూతురికి చెప్పిన స్క్రిప్ట్ మరొకటి..
నువ్వు సూసైడ్ చేసుకున్నట్టు నటించు చాలు.. వారికి గుణపాఠం వచ్చేలా మిగతా కథంతా తాను ముందుండి నడిపిస్తానని కూతురిని నమ్మించాడు. తండ్రి చెప్పిన మాటలు నమ్మిన కూతురు అతడు చెప్పినట్టే చేసింది. సూసైడ్ నోట్స్ రాసిన అనంతరం సీలింగ్ ఫ్యాన్‌కి ఉరేసుకుని నటించే ఫైన్ సీన్ చేస్తున్నాను అనుకుంది. కానీ ఫైనన్ సీన్‌లో తండ్రి తాను రాసుకున్న స్క్రిప్టును ప్రవేశపెట్టాడు. సీలింగ్ ఫ్యాన్‌కి కూతురు ఉరేసుకోగానే.. ఆమె కాళ్ల కింద కుర్చీని కాళ్లతో తన్నేశాడు. ఊహించని పరిణామానికి షాకైన కూతురికి తనను తాను కాపాడుకునే అవకాశం కూడా లేకపోయింది. ఎందుకిలా చేశావ్ నాన్న అని కూడా అడిగే పరిస్థితి లేకపోయింది. నాన్నతో కలిసి నాటకం ఆడుతున్నాను అనుకుంది.. కానీ నాన్న ఆడిన దొంగ నాటకంలో బిడ్డ పాత్ర శాశ్వతంగా ప్రాణాలు వదిలింది. మొత్తానికి తండ్రి తన స్కెచ్ ని విజయవంతంగా ఇంప్లిమెంట్ చేశాడు.

పోలీసుల రంగ ప్రవేశం..
తాను బయటికి వెళ్లి వచ్చేలోగా తన కూతురు సూసైడ్ చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆమె గదిలో లభించిన 5 సూసైడ్ లెటర్స్ ఆధారంగా వారే ఆమె ఉరేసుకునేందుకు పరోక్షంగా కారణం అయ్యారని భావించి వారిపైనే కేసులు నమోదు చేశారు. పోలీసులను బురిడి కొట్టించడంలో సక్సెస్ అయ్యానని లోలోనే ఎగిరి గంతేశాడు. 

అసలు దొంగ ఎలా దొరికాడంటే.. 
తాను అనుకున్న పని చేశానని సంబరపడిపోయాడు తండ్రి. కేసు దర్యాప్తులో భాగంగా తండ్రి సెల్ ఫోన్ తీసుకుని పరిశీలిస్తున్న పోలీసులకు ఒక షాకింగ్ ఫోటో కనిపించింది. ఆ ఫోటో మరేదో కాదు.. తన కూతురు సూసైడ్ చేసుకుంటుండగా తీసిన ఫోటో అది. ఆ ఫోటో చూసిన పోలీసులు ఒక్కసారిగా షాకయ్యారు. తాను ఇంట్లో లేనప్పుడు తన కూతురు సూసైడ్ చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేసిన వ్యక్తి ఫోన్లో ఆమె సూసైడ్ చేసుకుంటుండగా తీసిన ఫోటో ఎలా వచ్చిందనే ప్రశ్న పోలీసులకు అసలు దొంగ ఎవరో పట్టిచ్చింది. సమ్‌థింగ్ ఫిషీ అని భావించిన పోలీసులు.. తండ్రిని అరెస్ట్ చేసి తమదైన స్టైల్లో విచారిస్తే అసలు విషయం కక్కాడు. తన 12 ఏళ్ల చిన్న కూతురు చూస్తుండగానే, తన పెద్ద బిడ్డ ప్రాణం తీసిన నేరం అంగీకరించాడు. అసలు విషయం తెలిసి అవాక్కవడం పోలీసుల వంతయ్యింది. 

అంతు చిక్కని ప్రశ్నకు జవాబేది.. 
బిడ్డను చంపి మరొకరిపై ఆ నేరం వేయాలనుకున్నాడు సరే.. కానీ ఇంతకీ ఆ తండ్రికి కన్నబిడ్డనే చంపాల్సినంత అవసరం ఏమొచ్చింది ? కన్నబిడ్డను కడతేర్చి.. ఆ నేరం మరొకరిపై మోపి ఎందుకు తప్పించుకోవాలనుకున్నాడు ? వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికే కన్నబిడ్డను పావులా వాడుకున్నాడా లేక కన్నబిడ్డపై కూడా చంపేంత కోపం ఉందా ? ఈ ప్రశ్నలకు సమాధానం రాబట్టే పనిలో పోలీసులు బిజీ అయ్యారు. మహారాష్ట్ర నాగపూర్‌లోని కలామ్న పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన సినిమా స్టోరీకి ఏం తక్కువ లేదు కదా !!

Also Read : Delhi Murder Case: యువతి దారుణ హత్య.. మృతదేహాన్ని 35 ముక్కలు చేసి ఫ్రిజ్‌లో దాచిపెట్టిన బాయ్‌ఫ్రెండ్

Also Read : Bansuwada Woman Death: ఫేస్‌బుక్‌లో యువకుడితో ప్రేమ.. భర్తను వదిలి వెళ్లిపోయిన మహిళ.. ఊహించని షాక్

Also Read : School Girl Dead: స్కూల్లో పనిష్మెంట్.. 9 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News