Drunker Viral News: ఓ వ్యక్తి ఫుల్లుగా తాగాడు. తాగిన మైకంలో ఏం చేస్తున్నాడో తెలియదు. హైదరాబాద్ నుంచి జనగామ వెళ్లాల్సి ఉంది. నడుస్తున్నాడు. నడవడానికి ఒంట్లో సత్తువ కూడా లేదు. ఈ సమయంలో ఏం చేయాలో తెలియక అతి తెలివి ప్రదర్శించాడు. అత్యవసర సేవలకు వినియోగించే 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చాడు. అత్యవసరం.. ఏదైనా ప్రమాదంగా భావించి నిమిషాల వ్యవధిలో అంబులెన్స్ సిబ్బంది అక్కడకు చేరుకుని చూసేసరికి అవాక్కయ్యారు. ఫోన్ చేసిన వ్యక్తి తాగుబోతు అని తెలిసి నివ్వెరపోయారు. సరే అతడికి ఏమైనా అత్యవసర వైద్య సేవలు ఏమైనా కావాల్సి ఉందేమో అడిగితే అతడు చెప్పిన సమాధానం విని ఆశ్చర్యపోయారు.
ఈ సంఘటన తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది. హైదరాబాద్-వరంగల్ జాతీయ ప్రధాన రహదారిపై భువనగిరి వద్ద బుధవారం రమేశ్ అనే వ్యక్తి ఫోన్ చేశాడు. అతడు అప్పటికే తాగి ఉన్నాడు. నడవలేక తనను జనగామలో దించడానికి అంబులెన్స్‌కు ఫోన్ చేశాడు. తనను జనగామలో దింపాల్సిందేనని పట్టుబట్టారు. అంబులెన్స్ సిబ్బంది ఎంత చెప్పినా వినకుండా వాగ్వాదానికి దిగాడు. సిబ్బంది ఇదంతా ఫోన్లో వీడియో తీశారు. ‘హైదరాబాద్ నుంచి జనగామకు వెళ్లాలి. నడవలేకపోతున్నా , బస్సులు కూడా లేవు. నన్ను జనగామలో దింపండి. నాకు ఎమర్జెన్సీ ఉంది. స్పృహతప్పి పడిపోతానేమో' అంటూ అంబులెన్స్ సిబ్బందితో వాదించాడు.
సిబ్బంది: అంబులెన్స్ దేని కోసం ఉంది. ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే ఆస్పత్రికి చేర్చాలి.
తాగుబోతు: నాకు ఎమర్జెన్సీ ఉంది. ఆస్పత్రికి కాదు సార్ జనగామకు వెళ్లాలి.
సిబ్బంది: ఇది జనగామకు వెళ్లే బండి కాదు. ఆస్పత్రికి వెళ్లేది. ఎమర్జెన్సీ ఏమైనా ఉంటే తీసుకెళ్తాం.
తాగుబోతు: నాకు ఎమర్జన్సీనే సార్
సిబ్బంది: సరే ఆస్పత్రికి తీసుకెళ్తాం పద
తాగుబోతు: ఫుల్ టైర్డ్ అయిన. జనగామకు వెళ్లాలి సార్. బస్సు ఫెసిలిటీ కూడా లేదు సార్.
సిబ్బంది: చెప్పేది వినండి అంబులెన్స్ అంటే మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే ఆస్పత్రికి తరలిస్తాం
అంటూ సిబ్బంది, తాగుబోతు వాగ్వాదం జరిగింది. తాగుబోతు ఎంత చెప్పినా వినకుండా వాదిస్తుండడంతో సిబ్బంది విసుగెత్తి అతడిని వదిలేసి వెళ్లిపోయారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. తాగుబోతు రమేశ్ తెలివిని చూసి అందరూ అవాక్కవుతున్నారు. కాగా ఈ పరిణామంపై ఇంకా అధికారులు స్పందించలేదు. అత్యవసర సేవలు ఇలా దుర్వినియోగం చేసుకునే వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటారు. తాజా పరిణామంపై అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.
Also Read: IT Slabs: ఉద్యోగులపై జాలి చూపని నిర్మలమ్మ.. పొగడ్తలు తప్ప ఒక్క రూపాయి లాభం లేదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter