Viral Video: ఇదేం పైత్యం భయ్యా.. పచ్చి మిర్చిని పెదాలకు లిప్ బామ్ లా రాసుకున్న యువతి.. ఆ తర్వాత.. వీడియో ..

Trending video: యువతి అద్దంముందు నిల్చోని తన చేతిలో పచ్చిమిర్చిని తీసుకుంది. దాన్ని రెండు ముక్కలుగా కట్ చేసి.. అదేదో చలికాలంలో వ్యాస్ లీన్ మాదిరిగా పెదాలకు  రాసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది.  

Written by - Inamdar Paresh | Last Updated : Dec 10, 2024, 10:37 AM IST
  • పచ్చిమిర్చితో వింత ప్రయోగం..
  • నెట్టింట వీడియో వైరల్..
Viral Video: ఇదేం పైత్యం భయ్యా.. పచ్చి మిర్చిని పెదాలకు లిప్ బామ్ లా రాసుకున్న యువతి.. ఆ తర్వాత.. వీడియో ..

girl applied green chillies to lips video goes viral: కొంత మంది యువత ఫెమస్ అయ్యేందుకు ఏదేదో పనులు చేస్తుంటారు. ఇటీవల సోషల్ మీడియా పుణ్యామా.. అని కొందరు ఓవర్ నైట్ లో ఫెమస్ అయిపోతున్నారు. ఒకప్పుడు తమ టాలెంట్ ను చూపించడానికి సరిగ్గా ప్లాట్ ఫామ్ లు ఉండపోయేవని చాలా బాధపడుతుండే వారంట. కానీ ఇప్పుడు అలా కాదు.. తమకొచ్చిన టాలెంట్ ను వీడియోలు, రీల్స్ చేసుకుని మరీ సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తున్నారు.

దీంతో ఆ వీడియోలు కనుకు నెటిజన్లకు నచ్చితే.. షేర్ చేస్తుంటారు. మరికొందరు బాగుందని కూడా కామెంట్లు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో..కొందరు రాత్రికి రాత్రే హీరోలుగా , స్టార్ లుగా మారిపోతున్నారు. కానీ కొందరు మాత్రం.. ఈ రీల్స్ పిచ్చిలో లేని పోనీ పనులు చేసి తమ లైఫ్ ను రిస్క్ లో వేసుకుంటున్నారు. ఇప్పటికే ఈ రీల్స్ పిచ్చిలో పడి చాలా మంది యువత చనిపోయిన సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. తాజాగా, మరో ఘటన ప్రస్తుతం వైరల్గా మారింది. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by SHUBHANGI ANAND 🧿👑 (@shubhangi_anand__)

 

వైరల్ గా మారిన వీడియోలో.. ఒక యువతి తన పెదాలకు పచ్చి మిర్చి రాసుకుంటుంది. అదేదో.. లిప్ బామ్ అనుకుంటుందో మరేంటో కానీ.. మిర్చి చేతిలో తీసుకుని.. కట్ చేసి.. దాన్ని పెదాలకు అప్లై చేసింది.అచ్చం లిప్ స్టిక్ రాసినట్లు పెదాలు అంతట..ఈ మిర్చిని అటు ఇటు రాసుకుంటూ వచ్చింది. ఆతర్వాత మరల దాని మీద లిప్ స్టిక్ అప్లై చేసింది.

అయితే..తొలుత యువతి ఏదో కవర్ చేసిన కూడా.. పెదాలకు మాత్రం మంటగా అన్పించినట్లు తెలుస్తొంది. ఆమె ముఖంలో మార్పులు మాత్రం కన్పిస్తున్నాయని చెప్పుకొవచ్చు. సాధారణంగా మిర్చిపౌడర్ లేదా వంట వండేటప్పుడు మిర్చి కట్ చేసిన చేతుల్ని ఎక్కడైన పెట్టుకుంటే.. లేదా శరీరంను ముట్టుకుంటే.. ఆచోట విపరీతమైన మంట ఉంటుంది.

Read more: Viral Video: ఓర్ని.. వీడేంట్రా నాయన.. బెడ్ మీద అనకొండతో రోమాన్స్..?.. షాకింగ్ వీడియో వైరల్..

అలాంటిది సదరు యువతికి ఇంకెంత మండాలని కొంత మంది కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం షాక్ అవుతున్నారంట. ఇలాంటివి అవసరమా.. అంటూ మరికొందరు తిట్టిపోస్తున్నారంట.

Trending News