Snake Bite Video: పాములు తనను తానే కాటేసుకుంటాయా, వైరల్ అవుతున్న వీడియో

Snake Bite Video: సకల కోటి జీవాల్లో అత్యంత ప్రమాదకరమైంది పాము. విషపూరిత పాములు ఒక్క కాటేస్తే చాలు ప్రాణం విలవిల్లాడి ఆగిపోతుంది. అందుకే పాముల పేరు వినగానే ఒంట్లోంచి వణుకు పుట్టడం ఖాయం. మనిషి ఎంతగా ఎదిగినా పామును చూస్తే భయపడటానికి కారణం కూడా అదే.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 4, 2023, 11:41 AM IST
Snake Bite Video: పాములు తనను తానే కాటేసుకుంటాయా, వైరల్ అవుతున్న వీడియో

Snake Bite Video: అసలు పాములు ఎవరినైనా ఎందుకు కాటేస్తాయి, ఎందుకు మింగేందుకు ప్రయత్నిస్తాయో తెలుసుకుంటే సమాధానం సులభమే. తన ప్రాణాలకు హాని కలుగుతుందనే భయంతోనే పాములు కాటేసేందుకు ప్రయత్నిస్తుంటాయి. ఈ క్రమంలో పాములెదురైనా అదే పరిస్థితి. అందుకే ఓ పాము తనను తానే కాటేసుకుని విలవిల్లాడిపోయింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. 

పాములు సహజంగా ప్రమాదం పొంచి ఉందని భావించినప్పుడు దాన్నించి తప్పుకునేందుకు ప్రయత్నిస్తుంటాయి. ఈ క్రమంలో ఏది అడ్డుగా వచ్చినా కాటేసేందుకు ప్రయత్నిస్తాయి. అడ్జుగా వచ్చింది పామైనా సరే లేదా తన దేహమైనా సరే కాటేయడమే వచ్చు వాటికి. పాముల్లో అత్యంత ప్రమాదకరమైన, విష పూరితమైన రక్త పింజర విషయంలో అదే జరిగింది. ఓ విషపూరితమైన రక్తపింజర తనను తానే కాటేసుకుని విలవిల్లాడిపోయింది. ఆ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. 

ఎక్కడిదో, ఎలా జరిగిందో తెలియదు కానీ ఓ రక్త పింజర తల, దేహం వేర్వేరుగా పడి ఉన్నాయి. రెండింట్లోనూ ఇంకా కదలిక ఉంది. తల లేని దేహంతో నేలపై కొట్టుకుంటున్న పాము విడిగా పడున్న తలను తాకింది. అంతే రక్త పింజర తల ఒక్కసారిగా నోరు తెరిచి పాము దేహాన్ని నోట కరిచి కాటేసింది. దాంతో పాము దేహం విలవిల్లాడిపోయింది. అత్యంత భయంకరంగా ఉన్న ఈ వీడియో వైరల్ అవుతోంది.

రక్త పింజర పాము పరిమాణంలో చిన్నగా ఉన్నా అత్యంత వేగంగా కదిలే అత్యంత విషపూరితమైన పాము. రక్త పింజర కరిస్తే క్షణాల్లో ప్రాణాలు పోతాయంటారు. రక్త పింజర కాటేస్తే మనిషి కండరాలపై ప్రభావం పడుతుంది. మనిషి ఉన్నట్టుండి కుప్పకూలిపోతాడు. అంతటి ప్రమాదకరమైన రక్త పింజర తనను తానే కాటేసుకుని విలవిల్లాడిన దృశ్యం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. 

Also read: Horrible Road Accident: భయంకరమైన రోడ్డు యాక్సిడెంట్.. అతి వేగంగా వచ్చి పోలీసుని ఢీకొట్టిన కారు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News