Factcheck on Amazon Offers: వాట్సప్‌‌లో లింక్స్ వైరల్.. ఓపెన్‌ చేస్తే ఏమవుతుందో తెలుసా

Factcheck on Amazon Offers: ముఖ్యంగా డి మార్ట్‌, అమెజాన్‌, బార్బిక్యూ నేషన్‌ వంటి సంస్థల ఫేక్‌ లింకులు వాట్సప్‌ గ్రూపుల్లో తెగ షేర్‌ అవుతున్నాయి. అయితే, అవి అంతలా షేర్‌ కావడం వెనుక ఆ లింకులు క్రియేట్‌ చేసిన వాళ్ల మాస్టర్‌ ప్లాన్‌ ఉంది. వాట్సప్‌లో షేర్‌ అవుతున్న ఆ లింక్‌లను ఇక్కడ పోస్ట్ చేస్తే జీ తెలుగు న్యూస్‌ పాఠకులను ఇబ్బందుల్లో పడేసినట్లు ఉంటుందని ఆ లింక్‌లను ప్రస్తావించడం లేదు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 19, 2022, 11:48 PM IST
  • వాట్సప్‌ గ్రూపులను ముంచెత్తుతున్న లింకులు
  • వాట్సాప్‌ గ్రూపుల్లో తెగ వైరల్ అవుతున్న ఫేక్‌ లింకులు
  • ఓపెన్‌ చేస్తే మీ పర్సనల్ డేటా, బ్యాంక్ ఎకౌంట్స్
Factcheck on Amazon Offers: వాట్సప్‌‌లో లింక్స్ వైరల్.. ఓపెన్‌ చేస్తే ఏమవుతుందో తెలుసా

Fact check on Amazon Offers, DMart Offers : కొద్దిరోజులుగా వాట్సాప్‌ గ్రూపులను కొన్ని లింకులు ముంచెత్తుతున్నాయి. వివిధ పాపులర్‌ బ్రాండ్లకు చెందిన లోగోలతో ఈ లింకులు వైరల్‌ అవుతున్నాయి. ఆ లింకులపై దృష్టి పడితే చాలు.. వాటిని ఓపెన్‌ చేయాలన్న ఉత్సుకత రేకెత్తుతోంది. ఎందుకంటే ఆ లింకుపై క్లిక్‌ చేస్తే అద్భుతమైన బహుమతి మీ సొంతం అవుతుందంటూ ప్రముఖ బ్రాండ్‌ లోగోతో మన దృష్టిని ఆకర్షించేలా ఆ మెసేజ్ ఉంటోంది.

ముఖ్యంగా డి మార్ట్‌, అమెజాన్‌, బార్బిక్యూ నేషన్‌ వంటి సంస్థల ఫేక్‌ లింకులు వాట్సప్‌ గ్రూపుల్లో తెగ షేర్‌ అవుతున్నాయి. అయితే, అవి అంతలా షేర్‌ కావడం వెనుక ఆ లింకులు క్రియేట్‌ చేసిన వాళ్ల మాస్టర్‌ ప్లాన్‌ ఉంది. వాట్సప్‌లో షేర్‌ అవుతున్న ఆ లింక్‌లను ఇక్కడ పోస్ట్ చేస్తే జీ తెలుగు న్యూస్‌ పాఠకులను ఇబ్బందుల్లో పడేసినట్లు ఉంటుందని ఆ లింక్‌లను ప్రస్తావించడం లేదు. అయితే, పాఠకుల అవగాహన కోసం వాటి స్క్రీన్‌షాట్లను మాత్రం పోస్ట్ చేయడం జరుగుతోంది. 

డీ మార్ట్‌ సంస్థ లోగోతో రెండు రకాల లింకులు షేర్‌ అవుతున్నాయి. వాటిని ఇక్కడ పరిశీలిద్దాం.
fact-check-on-Amazon-sale-Offers-and-Dmart-sale-offers

వీటిని శ్రద్ధగా పరిశీలిస్తే వెబ్‌సైట్‌ అడ్రస్‌లలో తేడాను గమనించవచ్చు.

డి మార్ట్ కొత్త స్టోర్‌ ఓపెన్‌ చేస్తున్న సందర్భంగా ఈ లింక్‌ ఓపెన్‌ చేస్తే బహుమతిని సొంతం చేసుకోవచ్చని కంటెంట్‌లో ఉంది. దానిని ఓపెన్‌ చేస్తే ఓ పేజీ ఓపెన్‌ అయ్యింది. అందులో నాలుగు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని పేర్కొన్నారు.
fact-check-on-Amazon-sale-Offers-and-Dmart-sale-discounts

ఆ నాలుగు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వగానే కొన్ని గిఫ్ట్‌ బాక్స్‌లు ఓపెన్‌ అయ్యాయి. ఆ గిఫ్ట్‌ బాక్స్‌లను టచ్‌ చేస్తే ఓ మొబైల్‌ గెలుచుకున్నట్లు మరో లింక్‌ ఓపెన్‌ అయ్యింది. నెక్ట్స్‌ స్టెప్‌లో ఈ బహుమతిని సొంతం చేసుకోవాలంటే 5 వాట్సప్‌ గ్రూపులకు, 20 మంది వాట్సప్‌ ఫ్రెండ్స్‌కు లింక్‌ షేర్‌ చేయాలన్న సమాచారం వచ్చింది.

ఆ స్టెప్‌ కంప్లీట్‌ అయితే తాము సెల్‌ఫోన్‌ గెలుచుకోవచ్చన్న ఆశతో చాలామంది ఆ లింక్‌ను వాట్సప్‌ గ్రూపుల్లో షేర్‌ చేస్తున్నారు. అలా షేర్‌ చేసిన తర్వాత గిఫ్ట్‌కు సంబంధించిన అప్‌డేట్‌ రాకుండా.. తిరిగి హోమ్‌ పేజీ ఓపెన్‌ అవుతోంది. అంటే, ఇది ఫేక్‌ లింక్‌. 

fact-check-on-Amazon-sale-Offers-and-Dmart-sale-offers-3

ఇలాగే అమెజాన్‌ సంస్థ లోగోతోనూ మరో లింక్‌ సర్క్యులేట్‌ అవుతోంది. ఆ లింక్‌పై క్లిక్‌ చేసినా డి-మార్ట్‌ లింక్‌ మాదిరిగానే ఓ హోమ్‌పేజ్‌ ఓపెన్‌ అవుతోంది. అలాగే, మరో ప్రముఖ సంస్థ బార్బిక్యూ నేషన్‌ పేరిట కూడా మరో లింక్‌ వాట్సప్‌ గ్రూపుల్లో చక్కర్లు కొడుతోంది. 

Amazon-fact-check-news-fact-check-on-Amazon-sale-Offers-and-Dmart-sale-offers
ఇలా.. మరిన్ని సంస్థల పేరుతోనూ వాట్సప్‌ గ్రూపుల్లో లింకులు వైరల్‌ అవుతున్నాయి. అయితే, ఇవన్నీ ప్రమాదకర లింకులని సైబర్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ లింక్‌లను క్లిక్‌ చేయడం ద్వారా మన మొబైల్‌, ల్యాప్‌ట్యాప్‌, కంప్యూటర్లలోని సమాచారం హ్యాకర్లు సేకరిస్తారని, ఆ సమాచారంతో మన బ్యాంకు అకౌంట్లు ఖాళీ చేసే ప్రమాదం కూడా ఉందని అంటున్నారు. ఇలాంటి లింకుల వల్లే సైబర్‌ నేరాలు (Cyber crimes) పెరుగుతున్నాయని చెబుతున్నారు. సో.. ఇలాంటి లింకులను ఓపెన్‌ చేయొద్దని జీ తెలుగు న్యూస్‌ కూడా పాఠకులను అప్రమత్తం చేస్తోంది.

Also read : Viral News: పెరిగిన నిమ్మకాయ, ఎండుమిర్చి ధరలు.. సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్!

Also read : Viral Video: పెళ్లిలో వరుడి చెంప చెడామడా వాయించేసిన వధువు... వైరల్ అవుతోన్న వీడియో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News