Viral Video: మెట్రోలో ఒకరినొకరు కౌగిలించుకుంటూ రొమాన్స్.. నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్న వీడియో..

Couple Romance in Delhi Metro: ఢిల్లీ మెట్రో కు సంబంధించిన చాలా వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విచ్చలవిడిగా వైరల్ అవుతున్నాయి అయితే ఇటీవలే ఓ జంట రొమాన్స్ చేసుకుంటూ రెచ్చిపోయింది..ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో తెగ వైరల్ గా మారింది.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jul 26, 2023, 07:30 PM IST
Viral Video: మెట్రోలో ఒకరినొకరు కౌగిలించుకుంటూ రొమాన్స్.. నెట్టింట్లో తెగ వైరల్  అవుతున్న వీడియో..

Couple Romance in Delhi Metro: గత కొన్ని నెలల నుంచి ఢిల్లీ మెట్రో కు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ గా మారుతున్నాయి. మెట్రోలో ప్రయాణం చేసే వారంతా ఛీ ఛీ అనిపించుకునేలా కొందరు ప్రేమికులు అశ్లీలమైన పనులు చేస్తున్నారు. వీటికి సంబంధించిన వీడియోలే నిత్యం నెట్టింట్లో దర్శనమిస్తున్నాయి. అయితే ఇటీవలే ఓ జంట చేసిన అసభ్యకరమైన పనులు మరోసారి ఢిల్లీ మెట్రో అధికారులకు మచ్చ తెచ్చే విధంగా చేసింది. ఇంతకీ ఆ వీడియో వైరల్ కావడానికి కారణాలేంటో? అసలా వీడియోలో ఏముందో? వీడియోకు సంబంధించిన మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

ఇంతకుముందు వైరల్ అయిన వీడియో లాగానే ప్రస్తుతం నెట్టింట్లో లవర్స్ రొమాన్స్ చేస్తున్న వీడియోననే ఓ వైరల్ అవుతుంది. వీడియో వివరాల్లోకి వెళితే.. ఓ జంట ఒకరినొకరు కౌగిలించుకుంటూ లిప్ కిస్సులు పెట్టుకోవడం మీరు చూడవచ్చు. ఈ వీడియోని అదే భోగిలో ప్రయాణిస్తున్నావు వ్యక్తి చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. మెట్రోలో తోటి ప్రయాణికులు ఉన్నారని గమనించకుండా ఆ జంట రొమాన్స్ లో నిమగ్నమైపోయింది. అయితే ఈ అసభ్యకరమైన పనులు చూడలేక తోటి ప్రయాణికులు ఆ భోగి నుంచి పక్కన బోగి కి వెళ్లిపోయారని సమాచారం.

అయితే ఇటీవలే వైరల్ అవుతున్న ఢిల్లీ మెట్రో కు సంబంధించిన వీడియోలపై ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ స్పందిస్తూ వస్తోంది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వారు DMRCకి ట్యాగ్ చేయడంతో దీనిపై కూడా అధికారులు స్పందించారు. ఇకముందు మెట్రో రైల్ ప్లాట్ఫారంపై రీల్స్ తీయడం, మెట్రోలో రొమాన్స్ చేసుకోవడం వంటి అసభ్యకరమైన చర్యలకు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ వెల్లడించింది. ఇకనుంచి ఢిల్లీ మెట్రో కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయితే వెంటనే యాక్షన్ తీసుకోబోతున్నట్లు తెలిపింది.

ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో సామాజిక కార్యకర్త బర్ఖా ట్రెహాన్ DMRC ని ట్యాగ్ చేస్తూ షేర్ చేశాడు. బహిరంగ ప్రదేశాల్లో "ఇలాంటి అశ్లీలమైన పనుల వల్ల ఇతర ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. దీనిపై అధికారులు తప్పకుండా స్పందించాలని" క్యాప్షన్ రాస్తూ ఈ వీడియోను పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ గా మారింది. చూసిన వారంతా వారి అభిప్రాయాలను కామెంట్ల రూపంలో వ్యక్తపరిస్తున్నారు.

Also Read: IND vs WI Highlights: ఒక్క బంతి పడలేదు.. వరుణుడి ఖాతాలోకి విజయం.. రెండో టెస్టు డ్రా  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook 

 

Trending News