800 ఏళ్లలో ఇంతకు ముందెప్పుడు లేని విధంగా ఆకాశంలో తొలిసారిగా ఓ అద్భుతం జరగబోతోంది. డిసెంబర్ 21 నాడు ఆకాశం అందుకు వేదిక కాబోతోంది. డిసెంబర్ 21న సూర్యస్తమయం తర్వాత విశ్వంలోనే అతిపెద్ద గ్రహాలైన బృహస్పతి, శని గ్రహాలు ఒకే వరుసలోకి రానున్నాయి. దీంతో డబుల్ ప్లానెట్‌గా కనిపించనున్న ఈ దృశ్యాన్నే క్రిస్టమస్ స్టార్‌గా లేదా బేత్లేమ్ స్టార్‌గా పిలుస్తున్నారు.
బృహస్పతి, శని గ్రహాలు ఇలా ఒకదానికొకటి అత్యంత సమీపంలోకి వచ్చినట్టుగా కనిపించనుండటం ఇదే తొలిసారి కావడంతో దీనిని ఖగోళ శాస్త్రవేత్తలు ఆకాశంలో ఓ అద్భుతంగా అభివర్ణిస్తున్నారు.
ఉత్తర అర్ధగోళంలో ఉన్న వాళ్లు సూర్యస్తమయం తర్వాత 45 నిమిషాలకు ఆకాశంలో నైరుతి దిశగా చూస్తే ఈ క్రిస్మస్ స్టార్ ( Christmas Star ) అద్భుతం ఆవిష్కృతమవుతుంది.
వాస్తవానికి బృహస్పతి, శని గ్రహాలు ఎప్పుడూ ఒకదానికొకటి సమీపంలోకి రావు. బృహస్పతి భూమి నుంచి 5 ఆస్ట్రానమికల్ యూనిట్స్ దూరంలో ఉంటే.. శనిగ్రహం 10 ఆస్ట్రానమికల్ యూనిట్స్‌లో ఉంటుంది. కానీ డిసెంబర్ 21 నాడు సాయంత్రం అవి ఒకదానికొకటి సమీపంలోకి వచ్చినట్టుగా కనిపిస్తాయంతే.
ఈ రెండు గ్రహాలు ఇలా వరుస క్రమంలోకి రావడం అనేది ప్రతీ 20 ఏళ్లకు ఒకసారి అరుదుగా జరిగేదే అయినప్పటికీ.. ఇలా ఇంత దగ్గరిగా వచ్చినట్టు కనిపించడం మాత్రం నిజంగానే చాలా చాలా అరుదైన అద్భుతం అని హూస్టన్‌లోని రైస్ యూనివర్శిటీలో ఫిజిక్స్ అండ్ ఆస్ట్రానమి ప్రొఫెసర్‌గా ఉన్న ప్యాట్రిక్ హ్యార్టిగన్ తెలిపారు.
Also read : SSB jobs 2020: ఎస్ఎస్‌బిలో 1522 ఖాళీలు.. దరఖాస్తుకు 10వ తరగతి అర్హత
గతంలో 1226లో మార్చి 4న ఇలాంటి అద్భుతం జరిగిందని.. ఆ తర్వాత మళ్లీ ఇదే మొదటిసారి అని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
జుపిటర్, శాటర్న్ గ్రహాలు ఈ ఏడాది ఎండా కాలంలోనే భూమ్యాకాశంలోకి ప్రవేశించినట్టుగా కనిపించినప్పటికీ.. డిసెంబర్ 16-25 మధ్యన అవి మరింత దగ్గరిగా వచ్చినట్టు కనిపించనున్నాయి.
అలా డిసెంబర్ 21 నాడు సూర్యాస్తమయం తర్వాత జుపిటర్, శాటర్న్ ప్లానెట్స్ ( Jupiter, Saturn planets ) మరింత సమీపంలోకి వచ్చినట్టుగా కనిపించి డబుల్ ప్లానెట్స్‌లా తలపిస్తాయని ప్యాట్రిక్ హ్యార్టిగన్ తెలిపారు.
Also read : Salary Reduce from 2021: వచ్చే ఏడాది మీ జీతం తగ్గవచ్చు.. ఎందుకో తెలుసా!
ఆకాశం నిర్మలంగా ఉండి వాతావరణం అనుకూలించినట్టయితే... భూమి మీద ఏ మూల నుంచి అయినా ఈ అద్భుతాన్ని ఆస్వాదించవచ్చు. అయితే, ఈక్వేటార్‌కి సమీపంలో ఉన్న వాళ్లకు దీనిని మరింత బాగా వీక్షించేందుకు వీలు కలుగుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
సోషల్ మీడియాలో జీ హిందుస్థాన్ పేజీలను సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook