Bride Gun Firing: పెళ్లి రోజున ఎవరైన ఫొటోషూట్ లేదా వీడియో సాంగ్ షూట్ చేయించుకోవాలని ప్లాన్ చేస్తుంటారు. మరికొందరు పెళ్లి ఊరేగింపులో డ్యాన్స్ చేస్తూ సందడి చేస్తారు. కానీ, ఓ పెళ్లి కూతురు మాత్రం మిగిలిన వారి కంటే భిన్నంగా ఆలోచించి ఓ పని చేసింది. ఆమె చేసిన పనికి పెళ్లికి వచ్చిన వారితో పాటు వీడియో చూస్తున్న వారు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఏం జరిగిందంటే?
తన పెళ్లిలో ఓ వధువు చేసిన పనికి అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. సాధారణంగా ఏదైనా పెళ్లిలో వరుడు డ్యాన్స్ చేస్తూ సందడి చేయడం సహా వధువు సైలెంట్ గా పెళ్లిపీటలపై కూర్చుంటుంది. కానీ, ఈరోజుల్లో పురుషుల కంటే మహిళలు పెళ్లి వేడుకల్లో రెచ్చిపోయి సందడి చేస్తున్నారు. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వీడియో ప్రకారం.. ఓ వధువు, తన పెళ్లి రోజున తుపాకితో గాల్లో మూడు రౌండ్లు కాల్పులు జరిపింది. దాంతో పెళ్లికి వచ్చిన అతిథులు పెళ్లికూతురు ప్రవర్తనను చూసి ఆశ్చర్యపోయారు.
దీంతో అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎలాంటి భయం, బెరుకు లేకుండా ఆ వధువు గన్ కాల్చడాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోను deepesh966 అనే ఖాతా ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: Viral Prank Video: షాప్ ఓనర్ చేసిన పనికి జనం పరార్.. వీడియో వైరల్
Also Read: Peacock Funny Video: 'నా గుడ్డు తీసుకుంటావా?'.. వ్యక్తిపై దాడి చేసిన నెమలి.. వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook