Bottle gourd found in man stomach in chhatarpur Madhya Pradesh: సాధారణంగా కొందరు కాయిన్స్ లను మింగేస్తుంటారు. మరికొందరు వెంట్రుకలు, గోర్లను సైతం మింగుతుంటారు. ఇటీవల కొందరు మొలలు, చిన్నగా ఉండే ఇనుప వస్తువులు సైతం మింగేస్తున్నారు. ఇక ఎయిర్ పోర్టులలో బంగారం క్యాప్సుల్స్, బంగారం పెస్టులను ప్రైవేటు పార్ట్ లలో పెట్టి రవాణా చేస్తుంటారు. కొన్నిసార్లు చిన్న పిల్లలు ఆటవస్తువులను తెలియకుండా మింగేస్తుంటారు.
ఇలాంటి పరిస్థితుల్లో.. కొన్నిసార్లు అనుకోని ఘటనలు జరుగుతుంటాయి. కొందరు తరచుగా కడుపు నొప్పితో బాధపడుతుంటారు. తీరా డాక్టర్ వద్దకు వెళితే.. పొట్టలో ఉన్న సమస్య కాస్త బైటపడుతుంది. కొన్నిసార్లు డాక్టర్ లు ఎక్స్ రేలలో షాకింగ్ ఘటనలు వెలుగులోకి వచ్చిన సంఘటనలు ఉన్నాయి. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
పూర్తి వివరాలు..
మధ్య ప్రదేశ్ లో ఛత్తర్ పూర్ లో వింత ఘటన వెలుగులోకి వచ్చింది. ఖజురహోకు చెందిన ఒక వ్యక్తి కొన్నిరోజుల నుంచి కడుపునొప్పితో బాధపడుతున్నాడు. దీంతో అతను ఛతర్ పూర్ లోని ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ వైద్యులు సదరు వ్యక్తికి ఎక్స్ రే చేయించారు. ఈ క్రమంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. అతగాడి కడుపులో.. పెద్ద సోరకాయ ఉండటం కన్పించింది. వెంటనే వైద్యులు సర్జరీ చేయాలని సూచించారు.అప్పటికే సదరు వ్యక్తి బాధతో విలవిల్లాడిపోతున్నాడు. ఈ నేపథ్యంలో వైద్యులు గంటల పాటు శ్రమించి, సర్జరీ చేశారు. ఆ తర్వాత పొట్ట నుంచి పెద్ద సోరకాయను బైటకు తీశారు.
ఆ సోరకాయను చూసి వైద్యులు సైతం ఆశ్చర్యపోయారు. ఇదిలా ఉండగా.. అంత పెద్ద సోరకాయ అతడి కడుపులో ఎలా పోయిందనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. సోరకాయ వల్ల కడుపుని పేగులు సైతం ఒత్తుకుపోయినట్లు వైద్యులు గుర్తించారు. అయితే.. మానసిక పరిస్థితి సరిగ్గాలేని వాళ్లు ఇలాంటి పనులు చేస్తారని కూడా వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతానికి ఆ వ్యక్తి అపస్మారకస్థితిలోనే ఉన్నాడని, అతను మెలుకుంటేనే అసలు విషయం బైటపడుతుందని కూడా వైద్యులు చెబుతున్నారు. ఈ ఘటన మాత్రం వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం ఇదేం విడ్డూరం అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం.. అంత పెద్ద సోరకాయ పొట్టలోకి ఎలా వెళ్లిందబ్బా.. అంటూ డౌటానుమానం వ్యక్తం చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి