Matric Exam Paper Viral: ప్లీజ్ సార్.. నన్ను పాస్ చేయండి.. లేకుంటే పెళ్లి చేస్తారు.. యువతి ఎగ్జామ్ పేపర్ వైరల్

Latest Viral News: మెట్రిక్యులేషన్ చదువుతున్న ఒక యువతి ఎగ్జామ్ లో అన్ని సినిమా స్టోరీలు రాసింది. అంతే కాకుండా ఎలాగైన నామీద దయతో ఈ ఎగ్జామ్ ను పాస్ చేయాలని ప్రాధేయ పడింది. ఈ ఎగ్జామ్ పేపర్ ను చూసిన ఇన్విజిలేటర్ షాకింగ్ తో నోరెళ్లబెట్టారు. ఇప్పుడిది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.   

Written by - Inamdar Paresh | Last Updated : Mar 12, 2024, 12:55 PM IST
  • మెట్రిక్యులేషన్ లో పాస్ చేయాలంటూ బాలిక రచ్చ..
  • ఎగ్జామ్ పేపర్ చూసి షాక్ అయిన ఇన్విజిలేటర్లు..
Matric Exam Paper Viral: ప్లీజ్ సార్.. నన్ను పాస్ చేయండి.. లేకుంటే పెళ్లి చేస్తారు.. యువతి ఎగ్జామ్ పేపర్ వైరల్

Girl Writes Movie Stories In Exam Paper In Bihar: నార్మల్ గా పిల్లలకు బోర్డు ఎగ్జామ్ లంటే భయంతో వణికిపోతుంటారు. కొందరు ఎగ్జామ్ లకు ముందు నుంచి ప్రిపరేషన్ ప్లాన్ లో ఉంటారు. ఉదయం, సాయంత్రం కష్టపడి చదువుతుంటారు. ఎగ్జామ్ కు పక్కాగా ప్లాన్ ప్రకారం చదువుకుని, ఎగ్జామ్ రాస్తుంటారు. కానీ మరికొందరు స్టూడెంట్స్ ల మనస్తత్వం కాస్త భిన్నంగా ఉంటుంది. ఎగ్జామ్ లకు పదిరోజుల ముందు బ్యాటింగ్ స్టార్ట్ చేస్తారు. ఇక టెన్షన్ పడుతు.. ఆరోగ్యం పాడుచేసుకుంటారు. ఇక.. మరికొందరు స్టూడెంట్స్ చేసే రచ్చ మాములుగా ఉండదు. వారి ఎగ్జామ్ లకు ఇంట్లో వాళ్లను టెన్షన్ కు గురిచేస్తారు. ఇల్లు పీకి పందిరి వేస్తుంటారు.

Read More: Actress Kajal Agarwal: హీరోయిన్ కాజల్ అగర్వాల్ నడుముపై చెయివేసిన అభిమాని.. సోషల్ మీడియాలో రచ్చగా మారిన వీడియో ఇదే..

కొందరు ఎగ్జామ్ లకు భయపడి లేని డ్రామాలు ఆడుతారు. కరెక్ట్ గా ఎగ్జామ్ సమయానికి ఆరోగ్యం బాగాలేదని నటిస్తారు. మరికొందరు ఎగ్జామ్ లలో ఫెయిల్ అవుతామని సూసైడ్ లు కూడా చేసుకుంటారు. ఇక ఎగ్జామ్ సెంటర్ లో కొందరు పేపర్ లో సినిమా వార్తలు, కవిత్వాలు రాస్తుంటారు. తనకు క్యాన్సర్ అని ఎగ్జామ్ ఎలాగైన పాస్ చేయాలని కూడా కొందరు పేపర్లలో రాస్తుంటారు. డబ్బులను కూడా పేపర్ కు అతికించి ఇస్తుంటారు. పేపర్లలో ముగ్గులు కూడా వేస్తుంటారు. అచ్చం ఇలాంటి కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. 

పూర్తి వివరాలు..

బీహర్ మెట్రిక్యులేషన్ ఎగ్జామ్స్ లలో కొందరు విద్యార్థులు వెరైటీగా ప్రవర్తించారు. కొందరు విద్యార్థులు చేసిన పని ప్రస్తుతం వార్తలలో నిలిచింది. ఒక యువతి చాలా ఎమోషన్ తో ఆన్సర్ షీట్ లో రాసిన స్టోరి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక యువతి పేపర్ లో సినిమా స్టోరీలు, కవిత్వాలతో పూర్తిగా నింపేసింది.

అంతే కాకుండా చివరగా ఒక బిగ్ ట్విస్ట్ కూడా ఇచ్చింది. తాను... పేదింటి యువతినని, తనను ఎలాగైన పాస్ చేయాలని ఇన్విజిలేటర్ ను ప్రాధేయపడింది. అంతే కాకుండా.. తను ఎగ్జామ్ పాస్ కాకుంటే ఇంట్లో పెళ్లి చేస్తారని కూడా ఆవేదన వ్యక్తం చేసింది.

Read More: Snake Venom: బాప్ రే... పాము విషం ఇంత డెంజరా..?.. కళ్ల ముందే ఆమ్లేట్ లా మారిపోయిన రక్తం.. వైరల్ గా మారిన వీడియో ఇదే..

నా పరువును మీరే కాపాడాలంటూ కూడా.. ఎమోషనల్ గా ఎగ్జామ్ పేపర్ లో రాసింది. దీన్ని చూసి ఇన్విజిలేటర్ లు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. ఈ వెరైటీ ఎగ్జామ్ పేపర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.   దీన్ని చూసిన నెటిజన్లు ఇదేంటి రా నాయన అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News