/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

Apple Smartwatch Exploded: అమెరికాలో ఒక యాపిల్ స్మార్ట్ వాచ్ యూజర్ కి ఈ చేదు అనుభవం ఎదురైనట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలొచ్చాయి. మొదట స్మార్ట్ వాచ్ వేడెక్కుతున్నట్టు గ్రహించిన యూజర్.. వెంటనే ఆ విషయాన్ని యాపిల్ కస్టమర్ కేర్ కి తెలియజేశాడు. యూజర్ ఇచ్చిన ఫిర్యాదుతో యాపిల్ టీమ్ సదరు సమస్యపై దృష్టిసారించింది. ఆ సమస్య పరిష్కరించే వరకు దానిని ఉపయోగించకుండా పక్కన పెట్టేయాల్సిందిగా యాపిల్ సూచించింది.  కానీ ఆ మరునాడే ఊహించని పరిణామం చోటుచేసుకుంది. 

మరునాడు ఉదయం నిద్ర లేచిచూసేసరికి.. ఉపయోగించకుండా పక్కన పెట్టిన స్మార్ట్ వాచ్ బ్యాటరీ ఉబ్బినట్టుగా, లావుగా తయారవడమే కాకుండా స్క్రీన్ పగిలిపోయి దాని నుండి శబ్ధాలు రావడం మొదలయ్యాయి. దీంతో ఏదో ఊహించని ఉపద్రవం ఎదురవబోతోందని గ్రహించిన సదరు స్మార్ట్ వాచ్ యూజర్.. వెంటనే దానిని కిటికీలోంచి బయటకు విసిరేశాడు. కిటికీలోంచి విసిరిన మరుక్షణమే ఆ వాచ్ పేలిపోయింది. 

యాపిల్ స్మార్ట్ వాచ్ పేలిన విషయాన్ని సదరు యూజర్ యాపిల్ కంపెనీకి తెలియజేశాడు. అయితే, ఆ విషయాన్ని గోప్యంగా దాచిపెట్టాల్సిందిగా చెప్పిన యాపిల్ కంపెనీ.. ఒక డాక్యుమెంట్‌పై సంతకం చేయాల్సిందిగా కోరింది. అంతేకాకుండా ఆ వాచ్‌ని ల్యాబ్‌లో టెస్టింగ్ కోసం పికప్ బాయ్‌ని అరేంజ్ చేసి పికప్ చేసుకోనున్నట్టు తెలిపింది. 

అయితే, ఈ విషయాన్ని సీక్రెట్‌గా ఉంచి డాక్యుమెంట్‌పై సంతకం చేయాలన్న యాపిల్ విజ్ఞప్తిని మాత్రం సున్నితంగా తిరస్కరించిన యూజర్.. ఈ విషయాన్ని ఇలా బహిర్గతం చేశాడు. ఇలాంటి విషయాలు బయటికొస్తే.. యాపిల్ కంపెనీ తయారు చేసే స్మార్ట్ వాచ్ సేల్స్‌పై దుష్ర్పభావం చూపిస్తాయనే భయంతోనే కంపెనీ సదరు యూజర్‌ని పేలుడు విషయం గోప్యంగా ఉంచాల్సిందిగా కోరినట్టు అర్థమవుతోంది. కాని ప్రపంచమే ఓ కుగ్రామంగా మారిన నేటి డిజిటల్ ప్రపంచంలో ఇలాంటి విషయాలు గోప్యంగా ఉంచడం సాధ్యపడుతుందా అంటే లేదని చెప్పాలి.

Also Read : ఎయిర్‌టెల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఆ ఎనమిది నగరాల్లో 5జీ ప్లస్‌ సేవలు!

Also Read : 5G Services: భారతదేశంలో 5జీ యుగం..గుడ్‌న్యూస్ చెప్పిన జియో సంస్థ..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Section: 
English Title: 
Apple Smart watch exploded in USA after overheat issue
News Source: 
Home Title: 

Smartwatch Exploded: పేలిన యాపిల్ స్మార్ట్ వాచ్.. సీక్రెట్‌ సెటిల్మెంట్‌కి ప్రయత్నం

Smartwatch Exploded: పేలిన యాపిల్ స్మార్ట్ వాచ్.. సీక్రెట్‌ సెటిల్మెంట్‌కి యాపిల్ ప్రయత్నం
Caption: 
Twitter Photo
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Smartwatch Exploded: పేలిన యాపిల్ స్మార్ట్ వాచ్.. సీక్రెట్‌ సెటిల్మెంట్‌కి ప్రయత్నం
Pavan
Publish Later: 
No
Publish At: 
Thursday, October 6, 2022 - 21:19
Request Count: 
58
Is Breaking News: 
No