Viral: ఎందుకీ పనికిరాని టెక్నాలజీ.. నెటిజన్ల ఆగ్రహం

మూగజీవం ప్రాణాలు కోల్పోవడంతో నెటిజన్లు, జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూగ జీవాల ప్రాణాలు (Elephant died in Accident) కాపాడే టెక్నాలజీ కూడా మన వద్ద లేదా అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు.

Last Updated : Jul 27, 2020, 02:49 PM IST
Viral: ఎందుకీ పనికిరాని టెక్నాలజీ.. నెటిజన్ల ఆగ్రహం

ఉత్తరాఖండ్‌లో విషాదం చోటుచేసుకుంది. పట్టాలపై నడుచుకుంటూ వెళ్తుండగా రైలు ఢీకొనడంతో ఓ గజరాజు ప్రాణాలు (An Elephant Died) కోల్పోయింది. డెహ్రాడూన్‌లోని డోయివాలా ప్రాంతంలో ఈ దుర్ఘటన సోమవారం ఉదయం జరిగింది. ఈ విషయం తెలియగానే జంతు ప్రేమికులతో పాటు నెటిజన్లు స్పందిస్తున్నారు. వేధింపులు తాళలేక నటి Vijayalakshmi ఆత్మహత్యాయత్నం!

ఎన్నో అధునాతన టెక్నాలజీ వాడుతున్నాం. కనీసం ఓ మూగ జీవాన్ని కాపాడే టెక్నిక్ మన వద్ద లేదా అని ప్రశ్నిస్తున్నారు. సోనార్, రాడార్ లాంటి ఎంతో టెక్నాలజీ డెవలప్ చేస్తున్నారు, కానీ అమాయక మూగజీవాల ప్రాణాలను ఇలాంటి ప్రమాదాల బారిన పడకుండా చేసేందుకు ఏవి లేవంటూ ఓ నెటిజన్ ఆవేదన వ్యక్తం చేశాడు. Nithin Wedding Photos: హీరో నితిన్, షాలినిల పెళ్లి వేడుక ఫొటోలు 

మూగ జీవాలు ఉండే క్యారిడార్లు, పార్కుల ప్రాంతాల్లో రైళ్లు, మరే ఇతర ప్రాజెక్టులు అనుమతించకపోవడం ఉత్తమమని కొందరు అభిప్రాయపడ్డారు. కాగా, ఇటీవల కేరళలో పైనాపిల్ పండులో పటాసులు పెట్టి ఆహారంగా ఇవ్వడంతో అది తిన్న గర్భంతో ఉన్న ఏనుగు నరకయాతన అనుభవిస్తూ చనిపోవడం చూశాం. ఏపీలోనూ కొన్ని రోజుల కిందట మరో మూగ జీవం చనిపోయింది. తెలంగాణలో తాజాగా 1473 కరోనా కేసులు 

Trending News