Hook step for Pushpa Song: "పుష్ప" పాటకు పోర్చుగీస్‌ తండ్రీ కూతురు స్టెప్స్ అదిరిపోయాయి, సోషల్ మీడియాలో దూసుకెళ్తోంది

Portuguese Father, Daughter hook step for Pushpa Song : పుష్ప మూవీలోని డైలాగ్స్, పాటలకు మస్తు క్రేజ్‌. పోర్చుగీస్‌కు చెందిన తండ్రీకూతురు శ్రీవల్లి పాటకు వేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 24, 2022, 05:27 PM IST
Hook step for Pushpa Song: "పుష్ప" పాటకు పోర్చుగీస్‌ తండ్రీ కూతురు స్టెప్స్ అదిరిపోయాయి,  సోషల్ మీడియాలో దూసుకెళ్తోంది

Pushpa Movie fever : గతేడాది డిసెంబర్‌లో రిలీజై బాక్సాఫీస్‌ వద్ద భారీగా కలెక్షన్స్ వసూళ్లు చేసింది అల్లు అర్జున్ (Allu Arjun) పుష్ప మూవీ. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో అంతా పుష్ప మేనియానే నడుస్తోంది. ఈ మూవీలోని డైలాగ్స్, పాటలకు మస్తు క్రేజ్‌ వచ్చింది. సెలబ్రిటీల దగ్గర నుంచి ప్రతీ ఒక్కరూ పుష్ప మూవీలోని పాటలకు రీల్స్ చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తోంది. 

ఓ తండ్రీకూతురు పుష్ప మూవీలోని (Pushpa Movie) శ్రీవల్లి పాటకు వేసిన సింపుల్ స్టెప్ప్ అదిరిపోయాయి. ఈ డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను 4 మిలియన్లకు పైగా వీక్షించారు.

పుష్ప మూవీలోని శ్రీవల్లి హిందీ సాంగ్‌ పోర్చుగీస్‌కు చెందిన తండ్రీకూతురు (Portuguese Father Daughter) మస్త్‌ డ్యాన్స్ చేశారు. వీరి డ్యాన్స్‌కు నెటిజెన్స్ ఫిదా అవుతున్నారు. లైక్స్‌, కామెంట్స్‌తో వీరిని ఎంకరేజ్ చేస్తున్నారు. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Pablo e Verônica (@pabloeveronicaoficial)

 

ఇక పుష్ప మూవీలోని తగ్గేదేలే డైలాగ్‌ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతోంది. చాలా మంది క్రికెటర్స్‌, పలువురు సెలబ్రిటీలు తగ్గేదేలే డైలాగ్‌ చెబుతూ వీడియోస్ చేశారు. అవి అన్నీ కూడా సోషల్‌మీడియాలో ఫుల్ వైరల్ అయ్యాయి. పుష్ప మూవీకి సంబంధించి చాలా మీమ్స్‌ వచ్చాయి.

Also Read : Katrina Kaif Honeymoon: మాల్దీవ్స్‌లో హనీమూన్‌.. హాట్ ఫొటోలు షేర్ చేసిన కత్రినా కైఫ్!! 

తాజాగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కూడా కొవిడ్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పుష్ప సినిమానే ఎంచుకున్న విషయం తెలిసిందే. పుష్ప (Pushpa) మూవీలోని తగ్గేదేలే డైలాగ్‌తో ఒక మీమ్‌ను క్రియేట్‌ సోషల్ మీడియాలో వదలగా విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.

Also Read : Chanakya Niti: లక్ష్మీ దేవి మీ ఇంట్లో ఉండాలంటే ఇలా చేయండి!!

Also Read : iPhone 12 Mini Flipkart: ఫ్లిప్ కార్ట్ భారీ ఆఫర్! రూ.32,000 కంటే తక్కువ ధరకే iPhone 12 Mini

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News