జియో తరహా ఎయిర్‌టెల్ 4జి స్మార్ట్ ఫోన్

Last Updated : Oct 4, 2017, 07:16 PM IST
జియో తరహా ఎయిర్‌టెల్ 4జి స్మార్ట్ ఫోన్

రిలయన్స్ తక్కువ ధరకే 4జి స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే  ఫోన్ తొలివిడత బుకింగ్ చేసుకున్న వారికి డెలివరీ చేసే పనిలో పడింది జియో. కానీ తాజా జియో షరతులతో  ఫోన్ కొనాలా? వద్దా? అని వినియోగదారులు ఆలోచిస్తున్నారు. అయితే జియో నుంచి స్మార్ట్ ఫోన్ విడుదలైన ప్రస్తుత తరుణంలో, దాని కంటే ఎక్కువ ఫీచర్స్ తో, కేవలం 2500 రూపాయలకే స్మార్ట్ ఫోన్ అందేలా ఎయిర్టెల్ ఒక కొత్త ఫోన్ ను తయారుచేస్తుంది. ఎయిర్టెల్ స్పీడ్ చూస్తుంటే, బహుశా దీపావళి లేదా అంతకు ముందే ఫోన్ విడుదల చేసే అవకాశం ఉంది.  జియో లాగే వాయిస్, డేటా సర్వీసెస్ లు ఎయిర్టెల్ ఫోన్ లో ఉన్నాయట. అలానే గూగుల్ ప్లే స్టోర్ నుంచి అన్ని రకాల యాప్ లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. 

ఈ ఫోన్ ప్రత్యేకతలు: 

* ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్ OS 
* డ్యూయల్ సిమ్ 
* 4 అంగుళాల  డిస్ప్లే
* 1 జిబి ర్యామ్ 
* డబల్ కెమెరా 
* 4జి వోల్ట్ కాలింగ్ 
* బ్యాటరీ బ్యాక్అప్ 

 

 

Trending News