Bike Accident Viral Video: భూమ్మీద ఇంకా నూకలున్నట్టున్నాయి..డివైడర్ నుంచి ఈడ్చుకెళ్లినా బయటపడ్డారు

Viral Video: వేగం ప్రమాదకరం. అతివేగం ప్రాణాంతకం. ఈ రెండింటికీ మించి అప్రమత్తత మరింత అవసరం. రోడ్డుపై వెళ్లేటప్పుడు జాగ్రత్తగా లేకపోతే ఇలానే ఉంటుంది మరి..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 2, 2022, 07:31 PM IST
Bike Accident Viral Video: భూమ్మీద ఇంకా నూకలున్నట్టున్నాయి..డివైడర్ నుంచి ఈడ్చుకెళ్లినా బయటపడ్డారు

Bike Accident Viral Video: వేగం ప్రమాదకరం. అతివేగం ప్రాణాంతకం. ఈ రెండింటికీ మించి అప్రమత్తత మరింత అవసరం. రోడ్డుపై వెళ్లేటప్పుడు జాగ్రత్తగా లేకపోతే ఇలానే ఉంటుంది మరి..

సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు బాగా వైరల్ అవుతుంటాయి. ఇంకొన్ని షాకింగ్‌గా ఉంటాయి. మరికొన్ని ఒళ్లు జలదరింపజేస్తుంటాయి. ఈ కోవలో చెందిందే ఈ వీడియో. బాగా వైరల్ అవుతోంది. బైక్ ఉంది కదాని రోడ్డుపై ఇష్టారాజ్యంగా డ్రైవ్ చేస్తే ఇలాగే ఉంటుంది. భారీ మూల్యం చెల్లించుకోవల్సిందే..తృటిలో బయటపడ్డారు. అదృష్టం బాగుండి తల డివైడర్ వరకూ వెళ్లి..కొట్టుకోకుండా ఉండిపోయింది. విచిత్రంగా జరిగిన ఈ ప్రమాదంలో..ముగ్గుర్నీ రోడ్డున ఈడ్చేసింది. ఓ బైక్ మాత్రం..ఏమీ పట్టనట్టు..ముందుకు చాలా దూరం వెళ్లిపోయింది. 

ఈ వీడియో ఎక్కడిదో కానీ ఒళ్లు జలదరిస్తుంది. కాస్త ఫన్నీగా కూడా అన్పించినా నిర్లక్ష్యంగా ఉంటే ఏం జరుగుతుందో చెబుతుంది ఈ వీడియో. ఇద్దరు వ్యక్తులు బైక్ పై అటూ ఇటూ ఫ్లైట్ చేస్తూ ముందుకు పోతున్నారు. అంతలో వెనుక నుంచి మరో బైక్ సర్రున దూసుకొస్తుంది. ముందు అటూ ఇటూ విన్యాసాలు చేస్తూ పోతున్న బైక్‌ను ఢీ కొడుతుంది. అంతే ముగ్గురూ కల్సి చాలా దూరం రోడ్డుపై ఈడ్చుకుంటూ పోతారు. ఒకడైతే డివైడర్‌ను ఈడ్చుకుంటూ వెళ్లినా..అదృష్టం బాగుండి తలకు దెబ్బ తగలదు. ముగ్గురూ స్వల్ప గాయాలతోనే బయటపడిపోతారు. ఓ బైక్ మాత్రం ఇదంతా ఏం తెలియనట్టుగా ఎవరూ లేకుండానే చాలాదూరం అలా ముందుకెళ్లిపోవడం కూడా వీడియోలో గమనించవచ్చు.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by viral video (@viralvideos_09)

ఈ వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. కొందరు ఈ ముగ్గురి నిర్లక్ష్యంపై విమర్శలు చేసినా..కొందరు మాత్రం ఫన్నీగా ఆటపట్టిస్తున్నారు. రోడ్డుపై వెళ్లేటప్పుడు నిర్లక్ష్యంగా ఉంటే ఇలానే ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు. 

Also read: Snakes Romance: రెండు పాముల రొమాన్స్ ఎలా ఉంటుందో తెలుసా, వీడియో వైరల్

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News